
బ్రాహ్మణ మహాసంఘ నూతన కార్యవర్గ ఏర్పాటు
నెల్లూరు(బృందావనం): అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఓ కల్యాణ మండపంలో అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘ, ఆంధ్రప్రదేశ్ విభాగ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. మహాసంఘ జిల్లా గౌరవాధ్యక్షుడిగా శేషగిరిరావు, జిల్లా అధ్యక్షుడిగా రేవూరు వెంకటకళాధర్‌రావు, కార్యదర్శిగా మామిడిపల్లి చంద్రశేఖర్, కోశాధికారిగా భట్టారం రాఘవేంద్ర, జిల్లా ఉపాధ్యక్షుడిగా గావి మాధవాచార్యులు, అర్చక, పురోహిత విభాగ గౌరవ సలహాదారులుగా నాగరాజుతో కార్యవర్గం ఏర్పాటైంది. కేంద్ర కమిటీ అనుమతితో ఏర్పాటైన కార్యవర్గానికి నియామక పత్రాలను అందజేశారు.