
ఏపీటీఎఫ్ సభ్యత్వ నమోదు
నెల్లూరు (టౌన్): ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఏపీటీఎఫ్ ముందుంటోందని జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి పేర్కొన్నారు. కార్పొరేషన్ పరిధిలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఏపీటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. 12వ పీఆర్సీ కమిటీని నేటికీ నియమించలేదని ఆరోపించారు. మున్సిపల్ పాఠశాలల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేసి గుణాత్మక విద్యనందించేలా చూడాలని కోరారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ మురళీకృష్ణ, పట్టణ శాఖ బాధ్యులు శ్రీనివాసులు, వెంగబాబు, మహేష్, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.