
● రసాయనాలతో కృత్రిమంగా తయారీ ● తాగే వారి ఆరోగ్యంపై తీవ్
రసాయనాలతో తయారు చేసిన కల్లును స్వాధీన పరుచుకున్న ఎకై ్సజ్ అధికారులు
స్వల్పంగా సేకరించిన కల్లులో భారీగా నీటితో పాటు రసాయనాలు అఽ దిక మోతాదులో కలుపుతున్నారు. ముఖ్యంగా క్లోర ల్ హైడ్రేట్, ఆల్పజ్రోలం, డైజోఫామ్, ఓపీఎం ఇతర రసాయనాలను కలిపి కృత్రిమ కల్లు తయారు చేస్తున్నారు. వీటిని తాగిన వారు మత్తులో తూగుతున్నారు. పులుపు కోసం లెమన్ సాల్ట్, తీపి కోసం షాక్రిన్, పులియబెట్టడానికి డైయిస్ట్ పౌడర్, తెలుపు కోసం టైటానియం డయాక్సైజ్, నురుగు కోసం కుంకుడుకాయ ఇతర రసాయనాలు కలుపుతున్నారు. ఇది అచ్చం ఈత, తాటికల్లు లాగానే కనిపిస్తోంది. కానీ ఇందులో ఒక శాతం కూడా వాటి ఆనవాళ్లు ఉండడం లేదని ప లువురు పేర్కొంటున్నారు.
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో కొంత మంది కల్తీ కల్లు తయారు చేసి అమాయక ప్రజల జీవి తాలతో చెలగాటం ఆడుతున్నారు. రసాయనాలు, ఇతర పదార్థాలు కలిపి అచ్చం ఈతకల్లులా తయారు చేస్తున్నారు. వీటిని తాగిన జనం అనారోగ్యం బారి న పడుతున్నారు. పట్టించుకోవాల్సిన ఎకై ్సజ్ శాఖ అధికారులు ‘మామూలు’గా వ్యవహరించడంతో ఈ కల్తీ దందా యథేచ్ఛగా సాగుతుందనే ప్రచారం వినిపిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో కల్తీ కల్లు సేవించి తొమ్మిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇంత జరుగుతున్నా ఆ శాఖ నామమాత్రపు తనిఖీలకే పరిమితమైందనే విమర్శలున్నాయి. కొరడా ఝళిపించకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
ఆదిలాబాద్ స్టేషన్ పరిధిలో వందల్లో ఈత చెట్లు ఉండగా.. ప్రతీరోజు 10వేల లీటర్లకు పైగా కల్తీ కల్లు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇక ఉట్నూర్ స్టేషన్ పరిధిలో 5వేల లీటర్ల వరకు, ఇచ్చోడ స్టేషన్ పరిధిలో 8వేల లీటర్ల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. అయితే చెట్లు తక్కువగా ఉన్నప్పటికీ తయారయ్యే కల్లు అధికం. మొత్తంగా 5 శాతం కల్లు ఉంటే 95 శాతం రసాయనాలతోనే తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు..
కల్తీ కల్లు ప్రాణాలు తీస్తుందని తెలిసినా.. చాలా మంది దానికి అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. తక్కువ ధరకే దొరుకుతుండటంతో తాగి అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు. చెట్ల నుంచి వచ్చే కల్లులో రసాయనాలు, నీళ్లు, ఇతర పదార్థాలు కలిపి భారీ మొత్తంలో తయారు చేసి కాంపౌండ్‌లలో విక్రయిస్తున్నారు. వీటిని తాగిన వారి శరీర అవయవాలు పనిచేయకుండాపోయి ప్రాణాంతకంగా మారుతోంది. క్లోరల్ హైడ్రేట్, డైజోఫామ్ వంటివి అధిక మోతాదులో కలపడంతో నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. శ్వాస తగ్గిపోవడం, బీపీ తగ్గడం, కోమాలోకి వెళ్లడం, మరణం సంభవిస్తుంది. కాలేయం, కిడ్నీలపైనా వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
తయారీ ఇలా..
తనిఖీలు చేపడుతున్నాం..
కల్తీ కల్లు తయారు చేయకుండా తనిఖీలు చేపడుతున్నాం. అనుమతి లేని షాపులపై కేసులు నమోదు చేస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నాం.
– విజేందర్, ఎకై ్సజ్ సీఐ, ఆదిలాబాద్
నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం
కల్తీ కల్లు తాగే వారి నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. క్లోరోహైడ్రేట్, ఆల్ఫజోలమ్, డైజోఫామ్ తదితర రసాయనాలతో తయారు చేసిన కల్లు తీవ్రమైన మత్తు, బద్దకం, వివిధ అనారోగ్యానికి దారి తీస్తుంది. ఫిట్స్, మూత్రపిండాలు చెడిపోవడం, గుండె, నరాల సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ.
– ఆడే విఠల్, రిమ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్