
మహిళల ఆర్థికాభివృద్ధికి కేంద్రం చేయూత
బజార్‌హత్నూర్: మహిళల ఆర్థికాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేయూత అందిస్తుందని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. మండల కేంద్రంలో ఓఎన్జీసీ మంజూరు చేసిన 270 కుట్టుమిషన్లను 18 గ్రామాల మహిళలకు ఆ సంస్థ ప్రతినిధి మృత్యంజయ్‌తో కలిసి పంపిణీ చేశారు. అలాగే స్థానిక జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదర్శ, గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల, జెడ్పీ పాఠశాల విద్యార్థులకు 50 ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడు తూ.. మహిళలు స్వయం ఉపాధితో రాణించా లన్నారు. అలాగే విద్యార్థులు కష్టపడి చదివి ఉ న్నతంగా ఎదగాలన్నారు. అనంతరం డేడ్ర గ్రా మాన్ని సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడారు. డేడ్ర, గిరిజాయి, మాన్కపూర్, బద్దునా యక్ తండా, ఇంద్రనగర్, ఉమార్డ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తానని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ మండల అధ్యక్షుడు పో రెడ్డి శ్రీనివాస్, జెడ్పీటీసీ మాజీ సభ్యులు తాటిపల్లి రాజు, కొత్త శంకర్, నాయకులు గణేశ్, రమణ, సుఖ్‌దేవ్, మురళీమోహన్, గజానంద్, రాజేశ్వర్, ఎంఈవో కిషన్‌గుప్తా, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.