
స్కానింగ్ కేంద్రాల్లో తనిఖీలు
నెల్లూరు(అర్బన్): నగరంలోని పలు స్కానింగ్ కేంద్రాలను వైద్య, ఆరోగ్యశాఖాధికారులు ఆకస్మికంగా మంగళవారం తనిఖీ చేశారు. నగరంలోని వెంకటరమణ ఆస్పత్రి, విజయ డయాగ్నొస్టిక్స్, సింహపురి, శ్రీనివాస స్కాన్ సెంటర్లలో రికార్డులను జిల్లా లెప్రసీ, టీబీ నివారణాధికారి ఖాదర్‌వలీ, వెంకటాచలం సీహెచ్‌సీ సూపరింటెండెంట్ వేదవల్లి వాణిశ్రీ, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నరసింహరావు పరిశీలించారు. పీసీ, పీఎన్డీటీ యాక్ట్ ప్రకారం వ్యవహరిస్తున్నారాననే అంశాన్ని ఆరాతీశారు. లింగ నిర్ధారణ చేస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. స్కానింగ్ చేసిన వారి వివరాలను ఫారమ్ – 4లో నమోదు చేసి వైద్యశాఖకు పంపాలని కోరారు. టీబీ నివారణ సిబ్బంది విజయకుమార్, హరీష్, తులసీరామ్ తదితరులు పాల్గొన్నారు.