
‘జ్వాల’తో విద్యార్థినుల్లో ఆత్మస్థైర్యం
ఆదిలాబాద్‌రూరల్: విద్యార్థినిల్లో ఆత్మస్థైర్యం నింపాలనే ఉద్దేశంతో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ జ్వాల’ కార్యక్రమం చేపడుతున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాలలో కా ర్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. బాలికల ఆత్మరక్షణ కోసం జిల్లా వ్యా ప్తంగా ఆయా పాఠశాలల్లో కరాటే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, డీఈవో శ్రీనివాస్‌రెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పాఠశాల, కళాశాలల ప్రధానోపాధ్యాయులు, సీఐలు, కరాటే శిక్షకులు పాల్గొన్నారు.