
● సీఆర్టీ పోస్టుల భర్తీ విషయంలో.. ● ఐటీడీఏలో ముదిరిన వి
సాక్షి,ఆదిలాబాద్: ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, గిరి జనుల మధ్య వివాదం ముదిరింది. కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ (సీఆర్టీ) పోస్టుల భర్తీ విషయంలో తారాస్థాయికి చేరింది. పాత నోటిఫికేషన్ ప్రకారం కాకుండా కొత్తది జారీ చేయాలని విన్నవించినా పీవో దిగిరాలేదని వారు ఆరోపిస్తున్నారు. తప్పని పరిస్థితిలో మేడంకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగా ల్సి వచ్చిందని పేర్కొంటున్నారు. గురువారం ఆది లాబాద్ కలెక్టరేట్‌తో పాటు ఉట్నూర్‌లో గిరిజనులు పీవోను తొలగించాలంటూ తుడుందెబ్బ, ఆదివాసీ నిరుద్యోగులు, ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగడం సంచలనం కలిగించింది. ఇదిలా ఉంటే మొదట పాత నోటిఫికేషన్ ప్రకా రం ముందుకెళ్లిన ఐటీడీఏ గిరిజనుల ఆందోళన తర్వాత మెట్టు దిగివచ్చింది. రాత్రి రాత్రే కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే అందులోనూ తిరకాస్తు ఉందని గిరిజనులు వాపోతున్నారు. పోస్టుల సంఖ్య పొందుపర్చలేదని పేర్కొంటున్నారు. ఈ విషయమై పీవో ఖుష్బూ గుప్తాను ‘సాక్షి’ వివరణ కోరేందుకు పలుమార్లు ఫోన్‌లో ప్రయత్నించినా ఆమె అందుబాటులోకి రాలేదు.
వివాదం ఇలా..
ఉట్నూర్ ఐటీడీఏపరిధిలో ఖాళీగా ఉన్న గిరిజన ప్రా థమిక పాఠశాలల్లో 17 మంది సీఆర్టీల నియామకం కోసం అధికారులు చర్యలు చేపట్టారు. స్థానిక కుమురంభీం ప్రాంగణం పీఎంఆర్‌సీ భవనంలో 2023 మెరిట్ జాబితా ఆధారంగా ఈ ప్రక్రియ చేపట్టారు. దీన్ని గిరిజనులు విభేదించారు. అప్పట్లో సీఆర్టీలుగా నియమితులైన పలువురు ఆ తర్వాత రెగ్యులర్ ఉద్యోగాలు రావడంతో పోస్టులు ఖాళీ అ య్యాయని గిరిజనులు పేర్కొంటున్నారు. ఇలా ఖాళీ అయిన వాటిలో ఐటీడీఏలో పాతుకుపోయిన ఉద్యోగులు తమకు అనుకూలమైన వారిని నియమించుకున్నారని, ఇందులో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తున్నారు. ఈనేపథ్యంలోనే కొత్త నోటిఫికేషన్ ద్వారా ప్రస్తుత పోస్టులు భర్తీ చేయాల ని తాము డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. ఈ విషయమై పీవోకు తెలియజేసినా ఆమె కొత్త నోటిఫికేషన్‌కు ముందుకు రాకపోవడంతో ఆందోళనకు దిగాల్సివచ్చిందని వారు చెబుతున్నారు.
రెగ్యులర్ పోస్టులు సీఆర్టీగా మారిన వైనం..
దశాబ్దంన్నర నుంచి ఏజెన్సీలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ రాలేదు. దీంతో ఉన్నత చదువులు చదివినా పలువురు సర్కా రు కొలువు కోసం అష్టకష్టాలు పడుతున్నారని గిరి జన సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 2013 లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిది ఐటీడీఏల పరిధిలో 2,825 ఆశ్రమ పాఠశాలల్లో టీచర్ పోస్టులను మంజూరు చేసింది. దీంట్లో అప్పట్లో కొత్తగా ప్రతిపాదించిన ఆశ్రమ పాఠశాలలకు సంబంధించిన పోస్టులను కలిపి విడుదల చేసింది. ఇందులో గ్రేడ్–2 హెచ్‌ఎం నుంచి మొదలుకుంటే ఎస్‌ఏ, పీఈటీ, టీపీ, హెచ్‌పీ, ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం, ఎస్జీ టీ వంటి పోస్టులు ఉన్నాయి. వీటిలో ఉట్నూర్ ఐటీడీఏకు సంబంధించి 569 పోస్టులు ఉన్నాయి. అ యితే వివిధ కారణాలతో భర్తీకి నోచుకోలేదు. ఆ త ర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం, పలు ఇతర కారణాలతో ఆ రెగ్యులర్ పోస్టులను సీఆర్టీలుగా మలి చినట్లు గిరిజనులు వివరిస్తున్నారు. అందులో నుంచే ఖాళీలను భర్తీ చేస్తూ వస్తున్నారని పేర్కొన్నారు. 2023లో జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా అప్పట్లో పలు పోస్టులను భర్తీ చేసినప్పటికీ పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఐటీడీఏలో పాతుకుపోయిన ఉద్యోగులు అక్రమాలకు పాల్పడ్డారని, ఇందులో నాన్‌ట్రైబల్స్ కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ నోటిఫికేషన్‌పై కాకుండా కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయాలని తాము కోరామని వెల్లడించారు.

● సీఆర్టీ పోస్టుల భర్తీ విషయంలో.. ● ఐటీడీఏలో ముదిరిన వి

● సీఆర్టీ పోస్టుల భర్తీ విషయంలో.. ● ఐటీడీఏలో ముదిరిన వి