
పీవీటీజీల సంక్షేమానికి కృషి
● ఎంపీ గోడం నగేశ్
సాత్నాల: పీవీటీజీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ఎంపీ గోడం నగేశ్ అన్నా రు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పీవీటీజీ అవగాహన సదస్సు కార్యక్రమానికి ఆయ న హాజరై మాట్లాడారు. పీవీటీజీల అభివృద్ధి కోసం కేంద్రం ఆరు నెలల క్రితం రూ.313 కోట్లను మంజూరు చేసినా, రాష్ట్ర ప్రభుత్వం వాటిని విడుదల చేయడం లేదన్నారు. జిల్లాలో కొలాం, తోటి వర్గాలకు పక్కాఇళ్లు ఉండాలనే ఉద్దేశంతోకేంద్రం 4,902 ఇళ్లను మంజూరు చేసి నిర్మిస్తుందన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలని, అనంతరం నియోజకవర్గ అభివృద్ధి తమ ధ్యేయమన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా కృషి చేస్తానన్నారు. త్వరలోనే రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అనంతరం ఎంపీ, ఎమ్మె ల్యే దుబ్బగూడ గ్రామంలో జన్‌మన్ నిధులు రూ.60 లక్షలతో నిర్మించనున్న మల్టీపర్పస్ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఇందులో నాయకులు బోయర్ విజయ్, సుభాష్, సోనీరావ్, రాము, దేవరావు, గోవిందరావు, రమేశ్, రోహిదాస్, స్వామి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.