● నేటినుంచి పంపిణీ ప్రక్రియ షురూ ● ఏడేళ్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెర ● అర్హులకు చేకూరనున్న సంక్షేమ పథకాల లబ్ధి ● ప్రభుత్వ నిర్ణయంపై పేదప్రజల్లో ఆనందం | - | Sakshi
Sakshi News home page

● నేటినుంచి పంపిణీ ప్రక్రియ షురూ ● ఏడేళ్ల నిరీక్షణకు ఎట్టకేలకు తెర ● అర్హులకు చేకూరనున్న సంక్షేమ పథకాల లబ్ధి ● ప్రభుత్వ నిర్ణయంపై పేదప్రజల్లో ఆనందం

Jul 14 2025 4:45 AM | Updated on Jul 14 2025 4:45 AM

● నేట

● నేటినుంచి పంపిణీ ప్రక్రియ షురూ ● ఏడేళ్ల నిరీక్షణకు ఎట

కై లాస్‌నగర్‌: కొత్త రేషన్‌కార్డుల జారీకి రంగం సిద్దమైంది. ఈ నెల 14న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కార్డుల పంపిణీ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జిల్లాలోనూ అర్హులైన పేదలకు రేషన్‌కార్డులు అందించే దిశగా అధికార యంత్రాంగం కసర త్తు ముమ్మరం చేసింది. మీసేవ, ప్రజాపాలన కేంద్రాల్లో స్వీకరించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో వి చారిస్తున్న అధికారులు అర్హులైన వారి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఆమోదిస్తున్నారు. దీంతో తమకు రేషన్‌కార్డులు ఎప్పుడెప్పుడు వస్తాయా అనే గంపెడాశతో ఎదురుచూస్తున్న పేదప్రజల నిరీ క్షణకు ఎట్టకేలకు తెరపడనుంది. నూతన కార్డుదా రులకు సన్నబియ్యంతో పాటు ప్రభుత్వ సంక్షేమ ప థకాల లబ్ధి చేకూరనుండటంతో ప్రభుత్వ నిర్ణయంపై అర్హులైన వారిలో ఆనందం వ్యక్తమవుతోంది.

ఏడేళ్ల నిరీక్షణకు తెర...

కొత్త రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ ఏడేళ్లుగా నిలిచిపోయింది. దీంతో కార్డుల్లో మార్పులు, చేర్పులకు సై తం అవకాశం లేకుండా పోయింది. అయితే ప్రభుత్వం అందించే పథకాలన్నింటికి రేషన్‌ కార్డునే ప్రా మాణికంగా తీసుకోవడంతో వేలాది మంది కార్డుల్లేక వాటి లబ్ధికి దూరమయ్యారు. రేషన్‌ బియ్యం పొందలేకపోయారు. దీంతో కొత్త రేషన్‌ కార్డులను ప్రభుత్వం ఎప్పుడు జారీ చేస్తుందా? అని గంపెడాశతో ఎదురుచూస్తునే ఉన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 26న జిల్లాలోని మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసి అక్కడి అర్హులైన పేదలకు కార్డులను జారీ చేసి వారికి రేషన్‌ బియ్యం అందించింది. తాజాగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో దరఖాస్తు చేసుకున్న అర్హులైన పేదలందరికి కార్డులను అందించే దిశగా చర్యలు చేపట్టింది. మీసేవ, ప్రజాపాలన కేంద్రాల్లో అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారిస్తున్న రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు ఆన్‌లైన్‌లో వాటిని ఆమోదిస్తున్నారు. దీంతో త్వరలోనే వారందరికీ కొత్త రేషన్‌కార్డులు అందనున్నాయి. దీంతో వారి నిరీక్షణకు తెరపడనుంది. అయితే మూడు నెలల రేషన్‌కోటా బియ్యం ఇప్పటికే ప్రభుత్వం కార్డుదారులకు పంపిణీ చేసిన నేపథ్యంలో కొత్తగా జారీ చేసే కార్డుదారులకు జూలై నుంచి బియ్యం పంపిణీ చేస్తుందా? లేక తర్వాత అందజేస్తుందా? అనేదానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు.

చేకూరనున్న ‘సంక్షేమ’ లబ్ధి

జిల్లాలో ప్రస్తుతం 1,92,752 కుటుంబాలు రేషన్‌కార్డులను కలిగి ఉండగా వాటి పరిధిలో 6,49,521 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం లబ్ధిపొందుతున్నారు. కొత్త కార్డుల జారీతో ఈ సంఖ్య మరింత పెరగనుండగా మరికొంతమంది పేదప్రజలకు లబ్ధి చేకూరనుంది. తద్వారా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యంతో పాటు మహాలక్ష్మి పథకం కింద అందించే రూ.500 గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ వంటి పథకాల ప్రయోజలను సైతం అందుకోనున్నారు. వీటితో పాటు ప్రధానంగా ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యసేవలు పొందే అవకాశం ఉంది. దీంతో తమకు కార్డులు ఎప్పుడు వస్తాయా అని ఆశగా ఎదురుచూసున్న వారిలో ప్రభుత్వ ప్రకటన ఆనందాన్ని రెట్టింపు చేసింది. జిల్లాలో కొత్త కార్డుల విచారణ కాస్తా నెమ్మదిగా సాగుతుండటంపై అర్హులైన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చి ఎక్కడ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోతుందోననే భయంతో దరఖాస్తుదారులు తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకునేందుకోసం జిల్లాలోని తహసీల్దార్‌, పౌరసరఫరాలశాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణ చేస్తున్నారు. దీంతో ఆయా కార్యాలయాల్లో దరఖాస్తుదారుల సందడి కనిపిస్తోంది.

జిల్లాలో కొత్త రేషన్‌కార్డుల వివరాలు

కొత్తగా సభ్యుల చేర్పుల

వివరాలు

ఈ చిత్రంలో కనిపిస్తున్న గంజివార్‌ సునీల్‌–నాగరాణి దంపతులకు 2020లో వివాహమైంది. వీరిది ఆదిలాబాద్‌ పట్టణంలోని కోలిపూరకాలనీ. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. విచారణ చేపట్టిన అధికారులు ఇటీవల ఆమోదించారు. దీంతో ఆ కుటుంబానికి రేషన్‌కార్డు అందనుంది. ఈ కుటుంబం సన్నబియ్యంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందనున్నారు.

అందిన దరఖాస్తులు ఆమోదం పొందినవి తిరస్కరించినవి

18,970 6,970 237

అందిన దరఖాస్తులు ఆమోదించినవి తిరస్కరించినవి

32,254 12,754 5,400

ఆదేశాలు రాలేదు

కొత్త కార్డుల జారీ ప్రక్రియ ఈ నెల 14న ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే జిల్లాలో ఎప్పటి నుంచి చేపట్టాలనే దానిపై ప్రభుత్వం నుంచి ఇంకా మాకు ఎలాంటి ఆదేశాలు అందలేదు. మీ సేవ కేంద్రాల ద్వారా అందిన దరఖాస్తులపై విచారణ చేస్తూ అర్హులైన వారిని ఆమోదం తెలుపుతున్నాం. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. ప్రభుత్వ తదుపరి ఆదేశాలకు అనుగుణంగా కార్డుల జారీపై తగు చర్యలు తీసుకుంటాం.

– వాజీద్‌ అలీ, డీఎస్‌వో, ఆదిలాబాద్‌

● నేటినుంచి పంపిణీ ప్రక్రియ షురూ ● ఏడేళ్ల నిరీక్షణకు ఎట1
1/3

● నేటినుంచి పంపిణీ ప్రక్రియ షురూ ● ఏడేళ్ల నిరీక్షణకు ఎట

● నేటినుంచి పంపిణీ ప్రక్రియ షురూ ● ఏడేళ్ల నిరీక్షణకు ఎట2
2/3

● నేటినుంచి పంపిణీ ప్రక్రియ షురూ ● ఏడేళ్ల నిరీక్షణకు ఎట

● నేటినుంచి పంపిణీ ప్రక్రియ షురూ ● ఏడేళ్ల నిరీక్షణకు ఎట3
3/3

● నేటినుంచి పంపిణీ ప్రక్రియ షురూ ● ఏడేళ్ల నిరీక్షణకు ఎట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement