
ఆదివాసీ ఉద్యోగులు జాతి అభివృద్ధికి కృషిచేయాలి
ఇచ్చోడ: ఆదివాసీ ఉద్యోగులు తమ హక్కులకోసం పోరాడుతూనే జాతి అభివృద్ధికోసం కృషి చేయాలని ఆదివాసీ ఉద్యోగుల ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఆ త్రం భాస్కర్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఆదివాసీ భవన్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకూ ఆదివాసీలు అభివృద్ధిలో వె నుకబడి పోతున్నారన్నారు. ఆదివాసీలు అన్నిరంగాల్లో అభివృద్ధి వైపు పరుగులు తీయడానికి ఉ ద్యోగ సంఘాలు తమవంతు పాత్ర పోషించాలన్నా రు. ఆదివాసీల పిల్లలు చదువుపై ప్రత్యేక దృష్టి పె ట్టేలా ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. చదువుతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. మారుమూల ఆదివాసీ గ్రామాల్లో ఇప్పటికి తమ పిల్లలను బడికి పంపించడంలేదన్నారు. సమావేశంలో గౌరవ అధ్యక్షుడు కొడప కోసేరావు, ప్రధాన కార్యదర్శులు కనక దేవేందర్, మెస్రం గంగారాం, బోథ్ డివిజన్ అధ్యక్షుడు తొడసం భూమన్న, ఉమ్మడి జిల్లా ఆదివాసీ ఉద్యోగులు పాల్గొన్నారు.