
వేతనాలు పెంచాలని వినతి
ఆదిలాబాద్: ఐటీడీఏ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పార్ట్‌టైం, శానిటేషన్ వర్కర్ల వేతనాలు పెంచాలని ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను తెలంగాణ ప్రభుత్వ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని ఎంపీ నివాసంలో, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారిని కలిసి వినతిపత్రాలు అందించారు. ఇందులో సంఘం జిల్లా అధ్యక్షుడు షౌకత్ హుస్సేన్, గౌరవ అధ్యక్షుడు కేబీసీ నారాయణ, నాయకులు రామచంద్ర, రాజలింగు, దిలీప్‌కుమార్ తదితరులున్నారు.