
విన్నపాలు వినవలె
సర్వేకు రావడం లేదు
నాకు బెల్లూరి శివా రులో 49/3లో 8.18ఎకరాల వ్యవసాయ భూమి పట్టా ఉంది. అయి తే క్షేత్రస్థాయిలో నాలుగెకరాల మాత్రమే ఉంది. మిగతా భూ మి తమదంటూ ఇటీవల రైల్వే అధికారులు బండరాయిని పాతారు. అయితే ఆ భూమి హద్దులు చూపించాలని సర్వే కోసం దరఖా స్తు చేసుకున్నాను. సర్వేయర్‌ను పలుమార్లు కలిసి విన్నవించినా రావడం లేదు. చొరవచూపి న్యాయం చేయాలని కోరుతున్నా.
– చందా పొచ్చుబాయి, భీంసరి
కై లాస్‌నగర్: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అర్జీదారులు కలెక్టర్ రాజర్షి షాకు మొర పెట్టుకున్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చారు. తమ సమస్యలతో కూడిన దరఖాస్తులను కలెక్టర్‌కు అందజేశారు. వాటిని స్వీకరించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు అందజేస్తూ పెండింగ్‌లో ఉంచకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా, ఆర్డీవో వినోద్‌కుమార్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వివిధ సమస్యలకు సంబంధించి ఈ వారం 131 దరఖాస్తులు అందాయి. అందులో కొందరి నివేదన..
ప్రజావాణికి అర్జీల వెల్లువ
దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్

విన్నపాలు వినవలె