
వైద్యశాఖ అప్రమత్తం..
ఆదిలాబాద్‌టౌన్: ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. దీంతో నీరు నిల్వ ఉండి దోమలు, ఈగలు వృద్ధి చెంది సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రస్తు తం జిల్లాలో వైరల్ జ్వరాలతో పాటు టైఫాయిడ్, డెంగీ కేసులు నమోదవుతున్నాయి. దగ్గు, జ్వరం, తలనొప్పి, వాంతులు, విరేచనాలతో జనం అనా రోగ్యం బారిన పడుతున్నారు. ప్రస్తుతం రిమ్స్‌తో పాటు ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. అప్రమతమైన వైద్యశాఖ ర్యాపిడ్ ఫీవర్ సర్వేతో పాటు ఎపడమిక్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. స్టాప్ డయేరియా కార్యక్రమం చేపడుతోంది. డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
వ్యాధుల కాలం..
ఇటీవల కురిసిన వర్షాలతో ఆయా గ్రామాలు, పట్ట ణ ప్రాంతాలు చాలాచోట్ల అపరిశుభ్రంగా దర్శనమి స్తున్నాయి. గుంతలు, మురుగుకాల్వలతో పాటు నివాస పరిసరాల్లో నీరు నిల్వ ఉంటుంది. దీంతో దోమలు వృద్ధి చెంది వ్యాధులకు కారణమవుతున్నాయి. జిల్లాలో వారం పది రోజులుగా జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. చిన్నాపెద్ద తేడా లేకుండా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటికే 26 కేసులు నమోదు కాగా, ఈ నెలలోనే ఆరు నమోదు కావడం పరి స్థితికి అద్దం పడుతోంది.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖ కూడా అప్రమత్తమైంది. ముందస్తు ప్రణాళి క మేరకు చిన్నారులు డయేరియా బారిన పడకుండా ‘స్టాప్ డయేరియా’ను జూన్ 16 నుంచి షురూ చేసింది. ఈనెల 31 వరకు కొనసాగించేలా నిర్వహిస్తోంది. అలాగే సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఓఆర్‌ఎస్, జింక్ మాత్రలతో పాటు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో వారానికి రెండుసార్లు ఐదేళ్లలోపు చిన్నారులకు ఐరన్‌సిరప్ అందజేస్తున్నారు. ప్ర భుత్వ పాఠశాలల్లో 6 నుంచి 16 ఏళ్లలోపు వారికి వారానికోసారి ఐరన్ మాత్రలు అందిస్తున్నారు. ఇక ఆశలు, ఏఎన్‌ఎంలు ఇంటింటికి వెళ్లి ర్యాపిడ్ ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు. జ్వరం అదుపునకు అవసరమైన మందులు అందజేస్తున్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే.. ఫ్రైడే నిర్వహిస్తూ డెంగీ ప్రబలుతున్న కాలనీలు, గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఆదిమ గిరిజనులు నివసించే గ్రామాల్లో జన్‌మన్ కార్యక్రమంలో భాగంగా 13 ప్రత్యేక వాహనాల ద్వారా వైద్యసేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే రెండు ఎపడమిక్ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జి ల్లాలో హైరిస్క్ ప్రాంతాలను ఇప్పటికే గుర్తించా మని, ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాలపై ప్రత్యే క దృష్టి సారిస్తున్నట్లు పేర్కొంటున్నారు.
డెంగీ నియంత్రణపై ‘అర్బన్ యాక్షన్ ప్లాన్’
కైలాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో డెంగీ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించిన వై ద్యారోగ్యశాఖ, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా అర్బన్ యాక్షన్ ప్లాన్ ఖరారు చేశారు. 49 వార్డుల పరిధిలో డెంగీ జ్వరాలను నియంత్రించేలా చేపట్టాల్సిన చర్యలపై ఆరు ప్రత్యేక టీంల ను ఏర్పాటు చేశారు. ఈమేరకు సోమవారం సా యంత్రం మున్సిపల్ కార్యాలయ కాన్ఫరెన్స్ హా లులో వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్ సిబ్బంది తో డీఎంహెచ్‌వో నరేందర్‌రాథోడ్, మెప్మా డీఎంసీ కె.శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. అర్బన్ ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు, వార్డు ప్రత్యేకాధికారులు, ఆర్‌పీలు, శానిట రీ సిబ్బందికి సూచనలు చేశారు. యాక్షన్ ప్లాన్‌ను మంగళవారం నుంచి అమలు చేయనున్నట్లుగా తెలిపారు. ప్రతీటీం వారంలో మూడుసార్లు మంగళ, గురు, శుక్రవారాల్లో తమకు కేటాయించిన వార్డుల్లో డ్రైడే, ఆంటీ లార్వా యాక్టివిటీస్ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. శుభ్రత పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, జిల్లా మలేరియా నివారణ అధికారి శ్రీధర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
వ్యాధులు ప్రబలకుండా చర్యలు
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నాం. గతేడాది జిల్లాలో 366 డెంగీ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 26 నమోదయ్యాయి. ఆశలు, ఏఎన్‌ఎంలు, వైద్య సిబ్బంది సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు. అవసరమైన మందులను పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి.
– నరేందర్ రాథోడ్, డీఎంహెచ్‌వో