గిరిజనేతరుల సమస్యలపై సీఎంతో మాట్లాడుతా | - | Sakshi
Sakshi News home page

గిరిజనేతరుల సమస్యలపై సీఎంతో మాట్లాడుతా

Jul 14 2025 4:45 AM | Updated on Jul 14 2025 4:45 AM

గిరిజ

గిరిజనేతరుల సమస్యలపై సీఎంతో మాట్లాడుతా

రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి

నార్నూర్‌: ఏజెన్సీ ప్రాంతంలో నివాసం ఉంటున్న గిరిజనేతరుల సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరించడానికి కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి అన్నారు. ఆదివారం మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అధ్యాపకుడు కాంబ్లె బాలాజీ సోదరుని వివాహానికి మంత్రి హాజరయ్యారు. తొలిసారిగా మండలానికి వచ్చేసిన మంత్రికి కాంగ్రెస్‌, దళిత సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం అంబేడ్కర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నార్నూర్‌లో కొలాంధరి, ఎంపల్లి ప్రాజెక్ట్‌ మంజూరు కోసం చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడానికి ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల, ఉన్నత విద్యకోసం డిగ్రీ కళాశాల, నార్నూర్‌లో అంబేడ్కర్‌ భవన్‌, సేవాలాల్‌ భవన్‌, షాదీఖానా మంజూరు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీరా శ్యాంనాయక్‌, కాంగ్రెస్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి అత్రం సుగుణ, వక్స్‌బోర్డు మాజీ చైర్మన్‌ యూనుస్‌ అక్బానీ, సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బానోత్‌ గజానంద్‌నాయక్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ దుర్గే కాంతరావు, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు లోఖండే దేవురావు, మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు లోఖండే చంద్రశేఖర్‌, దళితరత్న అవార్డు గ్రహిత నర్శింగ్‌మోరే, ఫాక్స్‌ చైర్మన్‌ అడే సురేశ్‌, ఏఎంసీ డైరెక్టర్‌ కై లాస్‌నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

దేశం గర్వించదగిన మహోన్నతుడు అంబేడ్కర్‌

తాంసి: ప్రజలందరికి సమాన హక్కులు కల్పించడానికి భారత రాజ్యాంగాన్ని రచించిన మహోన్నతుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అని మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్మించిన అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆదిలాబాద్‌ ఎంపీ నగేష్‌, బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, విగ్రహదాతలు కాటిపెల్లి వసంత్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డితో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపీ ఎమ్మెల్యేలను అంబేడ్కర్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మండలంలో నెలకొన్న పలు సమస్యలను మండల నాయకులు మంత్రికి విన్నవించారు. ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా బోథ్‌ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఎంపీ నగేశ్‌ మాట్లాడుతూ తలమడుగు మండలంలో బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ అడ్డి భోజారెడ్డి, ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్‌ రెడ్డి, బోథ్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి గజేందర్‌, మాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్‌, మాజీ జెడ్పీటీసీలు గణేశ్‌రెడ్డి, రాజు, బాబన్న పాల్గొన్నారు.

మంత్రిని కలిసిన రూపేష్‌రెడ్డి

కై లాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామిని యువజన కాంగ్రెస్‌ ఆదిలాబాద్‌ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్‌ రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువజన కాంగ్రెస్‌ నాయకులకు తగిన ప్రాధాన్యతనిచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాల పండుగ

తాంసి: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీక అని మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి అన్నారు. ఆదివారం తలమడుగు మండలంలోని సుంకిడిలో బోనాల పండుగ కార్యక్రమంలో ఎంపీ గోడం నగేశ్‌, బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌తో కలిసి పాల్గొన్నారు. బోనం ఎత్తుకొని గ్రామస్తులతో కలిసి పొచ్చమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశా రు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ బోథ్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్‌, ఆదిలాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు గోక గణేశ్‌రెడ్డి, తాటిపెల్లి రాజు, తదితరులు పాల్గొన్నారు.

గిరిజనేతరుల సమస్యలపై సీఎంతో మాట్లాడుతా1
1/1

గిరిజనేతరుల సమస్యలపై సీఎంతో మాట్లాడుతా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement