
బీఆర్‌ఎస్, బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదు
కైలాస్‌నగర్: రాష్ట్రంలో పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. జైనథ్ మండలంలోని నిరాల గ్రామ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఆదిలాబాద్ పట్టణంలోని 13, 34 వార్డుల బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పట్టణంలోని ప్రజాసేవా భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఓటమితో రాజకీయంగా మాజీ మంత్రి జోగు రామన్న పని అయిపోయిందన్నారు. పాయల్ శంకర్ ఎలాంటి వారనేదీ ప్రజలందరికీ తెలుసన్నారు. ఇద్దరూ కుటుంబం గురించి ఆలోచిస్తారే తప్ప నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీలేదన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.