
టీ–గేట్ కమిటీ చైర్మన్‌గా గోవర్ధన్‌రెడ్డి
కైలాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించేందుకు టీ గేట్ (telangana Gateway for Adaptive Training & Employment) పథకాన్ని ప్రవేశపెట్టింది. అమలు కోసం జిల్లాస్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ జిల్లా చైర్మన్‌గా బి.గోవర్ధన్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఏ.రాజేశ్వరమ్మ, కన్వీనర్‌గా పి.శ్రీనివాస్, కో కన్వీనర్‌గా ఆర్.శ్రీనివాస్, సభ్యులుగా మిల్కా, ముత్యంరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని పారిశ్రామిక అవసరాలను విశ్లేషించడంతో పాటు శిక్షణ–ప్లేస్‌మెంట్ వ్యూహాలను అమలు చేసేందుకు ఈ కమిటీ పనిచేయనుంది.