breaking news
Yunan province
-
500 కిమీ నడవాలి.. అందుకే సేద తీరుతున్నాం
బీజింగ్: చైనాలో ఏనుగుల ఒక చోటనుంచి మరో చోటకు వలసపోతున్నాయి. యునాన్ ఫ్రావిన్స్ నైరుతి ప్రాంతంలో ఉన్న కొండల మధ్యలోని వైల్డ్‌లైఫ్ రిజర్వ్ నుంచి 15 ఏనుగులు గుంపుగా బయల్దేరాయి. అక్కడి నుంచి అదే ఫ్రావిన్సులో దాదాపు 500 కిమీ దూరంలో ఉన్న కున్మింగ్ అటవీ ప్రాంతానికి వెళుతున్నాయి. సుమారు 500 కిమీ పైగా ప్రయాణిస్తున్న ఈ ఏనుగుల గుంపు మార్గమధ్యలో అలసిపోయాయి.. విశ్రాంతి కోసం అన్ని గుంపుగా ఒకేచోట సేద తీరాయి. చైనా మీడియా ఈ ఏనుగుల గుంపును వీడియోలు తీస్తూ అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు. ఏనుగుల గుంపు అడవిలోకి వెళ్లేంతవరకు జనాలు ఎక్కువగా బయట తిరగకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఇంకో 200 కిమీ దూరం వెళితే ఆ ఏనుగుల గుంపు తమ గమ్య స్థానానికి చేరుకుంటాయి. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి: 4 భారీ టవర్లు... 10 సెకన్లలోనే నేలమట్టం! బాప్రే.. బంగారు నాణేనికి రూ.142 కోట్లు! -
రేటు విని.. గుండె జారి గల్లంతయిందే
కొన్నిసార్లు షాపింగ్‌కు వెళ్లినప్పుడు అక్కడ కనిపించే కొన్ని వస్తువులు విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. అయితే ఆ వస్తువులను కొనడానికి సరిప డేంత డబ్బులేనప్పుడు.. వాటిని కాసేపు పట్టుకొని చూసి అక్కడ పెట్టేసి రావడం చేస్తుంటారు కొందరు. సరిగ్గా ఇలాచేసే ఓ చైనా మహిళ స్పృహ తప్పి పడిపోయింది! యునాన్ ప్రావిన్స్ రూయిలి పట్టణంలో ఓ షాపులోకి వెళ్లిన మహిళ.. పచ్చరాయితో చేసిన బ్రాస్లెట్ను చూసి ముచ్చటపడింది. కొనకపోయినా పర్లేదు కనీసం చూద్దామని చేతిలోకి తీసుకుంది. అయితే అదికాస్తా జారి కిందపడటంతో 2 ముక్కలైంది. ఈ విషయాన్ని గమనించిన షాప్ యజమాని బ్రాస్‌లెట్‌కు డబ్బు చెల్లించాల్సిందిగా దాని ఖరీదును ఆ మహిళకు చెప్పాడు. అంతే ఆ రేటు విన్న మహిళ ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కాసేపు ఫిట్స్ వచ్చినట్లు నేలపై పడి కొట్టుకుంది. అక్కడివారు మొహం మీద కాసిన్ని నీళ్లు చల్లాక లేచి కూర్చున్న ఆ మహిళ.. బ్రాస్లెట్ రేటు 3,00,000 యువాన్లు (రూ. 28.60 లక్షలు) అని వినగానే స్పృహ తప్పానని చెప్పింది. ఆ మహిళ తరఫువారు 70,000 యువాన్లు రూ. (6.67 లక్షలు) చెల్లిస్తామని చెప్పినా యజమాని ఒప్పుకోకపోవడంతో చివరకు 1,80,000 యువాన్ల (రూ. 17.16 లక్షలు)కు బేరం కుదుర్చుకొని పగిలిపోయిన బ్రాస్లెట్ను పట్టుకెళ్లారు.