breaking news
YouTube Video Editor
-
వీడియో క్రియేటర్లకు పెద్దదెబ్బ.. యూట్యూబ్ కొత్త నిబంధన..?
రోజంతా ఏదో సమయంలో యూట్యూబ్ చూడకుండా ఉండని వారుండరంటే అతిశయోక్తి కాదు. ట్రైలరనో, టీజరనో.. ఎంటర్టైన్మెంట్ వీడియోలకోసమో, ఇన్ఫ్లూయెన్సర్ల షార్ట్స్ కోసమో.. రివ్యూలకనో, ప్రముఖుల వ్యూస్కనో.. మనం నిత్యం యూట్యూబ్‌పై ఆధారపడుతుంటాం. అయితే అలా వస్తున్న కంటెంట్‌లో నిజమెంత..? ఆ కంటెంట్‌లోని ఫొటోలు, వీడియో క్లిప్‌లు, వాయిస్‌లు నిజంగా ఆ వీడియో అప్లోడర్లవేనా..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేలా యూట్యూబ్ కొత్త నియమావళిని తీసుకురాబోతుంది. కృత్రిమ మేధ(ఏఐ) పురోగమిస్తున్నందున అది తయారుచేసే కంటెంట్‌పై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కంటెంట్‌కు సంబంధించి వాస్తవాలు ఎంతనే ప్రశ్నలు వస్తున్నాయి. ఏఐ సృష్టిస్తున్న సమాచారాన్ని ఎలా నిర్ధారించాలో ఒకింత సవాలుగా మారుతోంది. ఫొటోలు, వీడియోలు, ఆడియో రికార్డింగ్‌ల రూపంలో ఏఐ మోడల్‌ల ద్వారా వచ్చిన డేటాను స్పష్టంగా గుర్తించడంలో కేంద్రం సైతం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ సమస్యలకు పరిష్కారంగా యూట్యూబ్ కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు కొన్ని కథనాల ద్వారా తెలిసింది. ఆ వార్తల సారాంశం ప్రకారం.. కృత్రిమ మేధతో రూపొందించిన వీడియోలకు సంబంధించి యూట్యూబ్ నియమాలను ప్రకటించనుంది. యూట్యూబ్‌లో ఏదైనా వీడియో అప్లోడ్ చేసేముందు కొన్ని జనరేటివ్ ఏఐ క్లిప్‌లు, వాస్తవికతకు దగ్గరగా ఉండే కృత్రిమంగా సృష్టించిన వీడియోలను జోడిస్తుంటారు. వీక్షకులు దాన్ని ఇన్ఫ్లూయెన్సర్ల నిజమైన కంటెంట్ అని భ్రమపడే అవకాశం ఉంది. అలాంటి వారు ఇకపై తమ వీడియోలకు లేబులింగ్ ఇవ్వాలని యూట్యూబ్ కొత్త నియమాల్లో పేర్కొననుంది. వీడియో ఫుటేజీలో మార్పులు చేస్తున్నవారు, ఇతర పద్ధతుల్లో వాడుకుంటున్నవారు, రియల్ వాయిస్నుమర్చి సింథటిక్ వెర్షన్లను వినియోగిస్తున్నవారు తమ వీడియోలో లేబుల్‌ని చేర్చాల్సి ఉంటుంది. వీడియోలోని కంటెంట్ మార్పులు, ఫుటేజీ వివరాలు, సింథటిక్ అంశాలను పేర్కొంటూ విజువల్స్ రూపంలో లేదా వీడియో డిస్క్రిప్షన్ రూపంలో ఇవ్వాలి. లేదంటే వాయిస్ రూపంలో అయినా తెలియజేయాలి. ఇదీ చదవండి: బ్యాటరీ కనిపించకుండా ఫోన్ల తయారీ.. ఎందుకో తెలుసా.. ఈ నిబంధనలను పాటించడంలో విఫలమైతే యూట్యూబ్ చర్యలు తీసుకోబుతున్నట్లు తెలిసింది. ఈ నిబంధనలు మొబైల్ యాప్, డెస్క్‌టాప్, టెలివిజన్ ఇంటర్ఫేస్ వినియోగదారులందరికీ వర్తింపజేయనుంది. వార్తలు, ఎన్నికలు, ఫైనాన్స్, ఆరోగ్యం వంటి సున్నితమైన అంశాలకు సంబంధించిన కంటెంట్‌లో మరింత అప్రమత్తంగా ఉండేందుకు యూట్యూబ్ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. -
యూట్యూబ్‌లో ఆ ఫీచర్లు ఔట్
యూట్యూబ్ ఓ రెండు ఫీచర్లను సెప్టెంబర్ 20 నుంచి తన ప్లాట్‌ఫామ్‌పై తొలగిస్తోంది. వీడియో ఎడిటర్, ఫోటో స్లైడ్షోస్ టూల్స్ సెప్టెంబర్ 20తో రిటైర్ అయిపోతాయని యూట్యూబ్ తెలిపింది. అయితే అన్ని ఎడిటింగ్ ఫీచర్లను యూట్యూబ్ తీసివేయడం లేదు. ట్రిమింగ్, బ్లరింగ్, ఫిల్టర్స్ వంటి వాటిల్లో మెరుగుపరిచిన వాటిని వీడియో క్రియేటర్స్ వాడుకోవచ్చని యూట్యూబ్ చెప్పింది. ఈ ఫీచర్లను తొలగించడానికి ప్రధాన కారణం, వీటిని తక్కువగా వాడేలా చేసేందుకేనని కంపెనీ వివరించింది. వీటికి స్వస్తి పలికి, కొత్త టూల్స్‌ను అభివృద్ధి చేయడానికి, ఉన్నవాటికి మెరుగుపరడానికి చూస్తున్నామని గూగుగ్ ప్రొడక్ట్ ఫోరమ్ పేజ్ కమ్యూనిటీ మేనేజర్ మారిస్సా చెప్పారు. వీడియో ఎడిటర్ లేదా ఫోటో స్లైడ్‌షో సెక్షన్‌పై ప్రాజెక్టులు ఉన్న యూట్యూబ్ క్రియేటర్లు సెప్టెంబర్ 20 వరకు వీటిపై పైనలైజ్ చేసుకోవాలని, లేనిపక్షంలో వారు ప్రాజెక్టులు కోల్పోతారని చెప్పారు. వీడియో ఎడిటర్ లేదా ఫోటో స్లైడ్షోస్లతో ఇప్పటికే పబ్లిష్ అయిన వీడియోలు మాత్రం దీనికి ప్రభావితం కావు. ఒకవేళ ఆ వీడియోలను వీడియో ఎడిటర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే కష్టం. 720పీ రెజుల్యూషన్లోనే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.