breaking news
young ias officers
-
పూజా ఖేద్కర్ ఎపిసోడ్లో మరో ట్విస్ట్
ఢిల్లీ: వివాదాస్పదంగా మారిన ట్రెయినీ ఐఏఎస్ పూజా మనోరమ దిలీప్ ఖేద్కర్‌కు ఝలక్ తగిలింది. తప్పుడు ధ్రువీకరణలు సమర్పించిందని ఆమెపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఏకపక్ష సభ్య కమిటీని నియమించింది. ఆమె ఉద్యోగంలో చేరేందుకు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమె తనకు నేత్ర, మానసిక సంబంధమైన కొన్ని సమస్యలున్నట్లు అఫిడవిట్ ఇచ్చిందని, కానీ, వాటిని నిర్ధారించేందుకు తప్పనిసరి వైద్య పరీక్షలకు మాత్రం ఆమె డుమ్మా కొట్టినట్లు కథనాలు వచ్చాయి. దీంతో.. నిజనిర్ధారణ కోసం కేంద్రం సింగిల్ మెంబర్ కమిటీని నియమించింది. ఈ కమిటీ దర్యాప్తు జరిపి.. రెండు వారాల్లో నివేదిక ఇస్తుందని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(DoPT) పేర్కొంది. వివాదం ఇదే..గొంతెమ్మ కోర్కెలతో మహారాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహానికి గురైన ట్రెయినీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ వార్తల్లోకి ఎక్కింది. పుణెలో అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ.. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే తన ఆడి కారుకు రెడ్-బ్లూ బీకన్ లైట్లు, వీఐపీ నంబర్‌ప్లేటు ఏర్పాటుచేసుకున్నారు. ‘మహారాష్ట్ర ప్రభుత్వం’ అనే స్టిక్కర్ అమర్చారు. తనకు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలని, తగినంత సిబ్బందితోపాటు ఓ కానిస్టేబుల్‌తో అధికారిక ఛాంబర్‌ను కేటాయించాలని పట్టుబట్టారు. అదనపు కలెక్టర్ అజయ్ మోర్ లేని సమయంలో.. ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఆయన గదిలో తన నేమ్‌ప్లేట్ పెట్టుకొని దాన్నే తన ఛాంబర్‌గా వినియోగించుకొన్నారు. వాస్తవానికి ప్రొబేషన్‌లో రెండేళ్లపాటు ఉండే జూనియర్ అధికారులకు ఈ సౌకర్యాలు లభించవు. వాస్తవానికి ఆమె ఈ సౌకర్యాల కోసం కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి తెస్తూ జరిపిన వాట్సాప్ సంభాషణల స్క్రీన్ షాట్లు కూడా తాజాగా వైరల్ అయ్యాయి. తనకు ఉన్నతాధికారి నుంచి ఈ సిబ్బంది నంబర్ లభించినట్లు ఆమె వాటిల్లో పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆమె కొన్ని డిమాండ్లు చేసి.. తాను వచ్చే నాటికి వాటిని పూర్తిచేయాలన్నారు. అయితే పూజ వ్యవహారాన్ని పుణె కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆమెను పుణె నుంచి వాసిమ్ జిల్లాకు బదిలీ చేశారు. ప్రొబేషన్ కాలం పూర్తయ్యేవరకు అక్కడే సూపర్ న్యూమరరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా పూజ వ్యవహరిస్తారని ఉన్నతాధికారులు వెల్లడించారు.నియామకమే వివాదం.. 2022 ఏప్రిల్‌లో తొలిసారి దిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు పిలువగా ఆమె కొవిడ్ సాకుగా చూపించి వెళ్లలేదు. ఆ తర్వాత కూడా కొన్ని నెలలపాటు వైద్య పరీక్షలకు హాజరు కాలేదు. చివరికి ఆరోసారి పిలుపురాగా.. పాక్షికంగా పరీక్షలు చేయించుకొన్నారు. దృష్టి లోపాన్ని అంచనావేసే కీలకమైన ఎమ్మారై పరీక్షకు ఆమె హాజరుకాలేదు. కానీ, ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ ఏదోరకంగా పూర్తయింది. ఆ తర్వాత కమిషన్ ఆమె ఎంపికను ట్రైబ్యూనల్‌లో సవాలు చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినా.. తన నియామకాన్ని కన్ఫర్మ్ చేసుకొంది. ఇక పూజా ఓబీసీ ధ్రువీకరణపైనా వివాదాలున్నాయి. దాని ఆధారంగానే ఆమెకు 841వ ర్యాంక్ వచ్చినా ఐఏఎస్ హోదాను పొందగలిగింది. నాకు అనుమతి లేదు.. వివాదాల నేపథ్యంలో.. ఐఏఎస్ పూజా ఖేద్కర్ తొలిసారి మీడియా వద్ద స్పందించారు. ‘‘నాకు ఈ అంశంపై మాట్లాడటానికి ప్రభుత్వ అనుమతి లేదు. నిబంధనలు అనుమతించవు క్షమించండి. మహారాష్ట్రలోని వాసిమ్‌లో కొత్త పాత్ర పోషించడం సంతోషంగానే ఉంది’’ అని పేర్కొన్నారు. -
యువ సారథులు; అందరూ 35 ఏళ్లలోపు వారే
సాక్షి, అనంతపురం: నలుగురు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్, ఒక ఐఎఫ్ఎస్.. అందరూ 35 ఏళ్ల లోపు వయసున్న వారే. కేవలం జీతం కోసం కాకుండా వృత్తిధర్మాన్ని చాటేలా తమ విధులను నిర్వర్తిస్తూ.. జిల్లాను అభివృద్ధి పథంలో పరుగులు తీయించేందుకు వీరంతా శ్రమిస్తున్నారు. కలెక్టర్‌గా గంధం చంద్రుడు.. జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యంగా.. పాలనలో తనదైన ప్రత్యేకత కనిపించేలా విధులు నిర్వర్తిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు... రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన దిశగా జాయింట్ కలెక్టర్ నిశాంతకుమార్, సచివాలయ సేవలు ప్రజల ముంగిటకే చేర్చే దిశగా మరో జాయింట్ కలెక్టర్ ఎ.సిరి, అటవీ సంరక్షణ, అటవీ భూముల పరిరక్షణ లక్ష్యంగా డీఎఫ్ఓ జగన్నాథ్ సింగ్, పెనుకొండ రెవెన్యూ డివిజన్‌ను అభివృద్ధి పథంలో నడిపించడమే ధ్యేయంగా సబ్ కలెక్టర్ నిషాంతి.. ప్రత్యేకతను చాటుకుంటున్నారు. వీరి బృహత్ చర్యల వల్ల రాష్ట్రంలోనే ‘అనంత’ జిల్లా ప్రత్యేకతను చాటుకుంటోంది. అభివృద్ధి.. సంక్షేమం రెండు కళ్లు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా జిల్లాను అభివృద్ధి బాటలో నడిపించే దిశగా కలెక్టర్ గంధం చంద్రుడు తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ►అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా తన విధులకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ►అంశాల వారీగా అధికారులతో సమీక్షిస్తూ.. తగిన కార్యాచరణతో జిల్లాను అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. ►ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పనులు కల్పించడంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ►జిల్లాలో 5 లక్షల మంది కూలీలకు పనులు కల్పించడాన్ని లక్ష్యంగా నిర్ధేశించుకుని, ఇప్పటి వరకూ 3.77 లక్షల మందికి ఉపాధి పనులు కల్పించారు. ఈ నెలాఖరులోగా లక్ష్యం పూర్తి చేసే దిశగా సంబంధిత అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ►సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు మెరుగుపరచడం, సచివాలయ వ్యవస్థ ద్వారా సేవలు ప్రజలకు అందించడం లక్ష్యంగా అధికారులను నడిపించడం... ప్రతి సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను పారదర్శకంగా ప్రజలకు చేరువ చేయడంలో కలెక్టర్ వ్యవహరిస్తున్న తీరుపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శాంతిభద్రతలే ఊపిరిగా.. -సత్యయేసుబాబు, ఎస్పీ ►శాంతి భద్రతల అదుపులో ఉన్నపుడే ప్రజలకు సంపూర్ణ రక్షణ ఉంటుందని బలంగా విశ్వసించే పోలీస్ ఉన్నత స్థాయి అధికారి ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు. ►ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, రాజకీయ గొడవలు చోటు చేసుకోలేదు. ►విధుల పట్ల ఆయన తీసుకునే నిర్ణయాలు కఠినంగా ఉన్నా.. ప్రజల ధన, మాన, ప్రాణ సంరక్షణలో అవి ఎంతో కీలకంగా మారాయి. ►కేవలం ప్రజలే కాకుండా శాఖలోని ఉద్యోగుల సంక్షేమాన్ని కూడా ఆలోచిస్తూ.. పోలీసు ఉద్యోగుల మంచీచెడులకు అధిక ప్రాధాన్యతనిస్తుంటారు. ►ప్రతి వారం గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తూ, తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకు తక్షణ పరిష్కారం చూపించారు. ►అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు. ►జిల్లాలో మట్కాను కూకటివేళ్లతో పెకలించేందుకు కఠినంగా వ్యవహరించారు. ►పోలీసు శాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ►కానిస్టేబుళ్ల బదిలీల విషయంలో విమర్శలకు తావివ్వకుండా కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించారు. ఎస్ఐల బదిలీ విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరించారు. వ్యవస్థ ప్రక్షాళన దిశగా -నిశాంత్‌కుమార్, జేసీ ‘ప్రజలకు సత్వర మెరుగైన సేవలు అందించడం, సమస్యలకు నాణ్యమైన పరిష్కారాన్ని చూపేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తా’ అంటూ పేర్కొనే నిశాంత్‌కుమార్... ఈ నెల 14న జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ►జిల్లాలో రైతు భరోసా, రెవెన్యూ (ఆర్బీ అండ్ ఆర్), ఇతర విభాగాలను ఆయనకు కేటాయించారు. ►నూతనంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జిల్లాలో అస్తవ్యస్తంగా ఉన్న రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా చర్యలు చేపట్టారు. ►రెవెన్యూ అంశాల్లోని లోపాలను సరిదిద్ది, సాంకేతిక పరిజ్ఞానం జోడించి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే దిశగా సాహసోపేత నిర్ణయాలతో ముందుకు పోతున్నారు. ►ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అందుకు తగినట్లుగా కార్యాచరణను రూపొందించుకుని అమలు చేస్తున్నారు. ►రెవెన్యూ ఒక్కటే కాకుండా.. తనకు అప్పగించిన గ్రామీణాభివృద్ధి, మహిళ శిశు సంక్షేమం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలు, పరిశ్రమలు, దేవాదాయ, నైపుణ్యాభివృద్ధి విభాగాలపైన కూడా ప్రత్యేక దృష్టి సారించారు. పారదర్శకతకు పెద్దపీట - ఎ.సిరి, జాయింట్ కలెక్టర్ ‘ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల సంక్షేమ ఫలాలు చిట్టచివరి‡ అర్హుడికి చేరాలి. అప్పుడే ప్రభుత్వ ఉద్ధేశం నెరవేరుతుంది. సచివాలయాల ద్వారా ప్రభు త్వ సేవలు ప్రజల ముగింటకే అందించే దిశగా చర్యలు చేపట్టాం’ అపి అంటున్న అట్టాడ సిరి... జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఈ నెల 24న బాధ్యతలు స్వీకరించారు. ►గ్రామ/వార్డు సచివాలయలు, అభివృద్ధి (వీడబ్ల్యూఎస్‌డీ) విభాగాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ►సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లను సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హుల దరిచేర్చడంలో పారదర్శకత ఉండేలా తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ►గ్రామ, వార్డు సచివాలయల నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలపై ఇప్పటికే జెడ్పీ సీఈఓ, డీపీఓ, మున్సిపల్ కమిషనర్లతో నివేదికలు తెప్పించుకుని, అందులో లోటుపాట్ల గుర్తింపు, వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ►ప్రభుత్వ పథకాలను అర్హుల దరిచేర్చేందుకు ఎప్పటికప్పుడు సమీక్షలతో ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకుని ముందుకు పోతున్నారు. ►తనకు అప్పగించిన ఇతర బాధ్యతలపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు -టి.నిషాంతి, సబ్‌కలెక్టర్ ‘ప్రజలకు మెరుగైన సేవలు సత్వరం అందించడం అందరి లక్ష్యం. మన పరిసరాలు పరిశుభ్రంగా ఆకట్టుకునేలా ఉండాలనే ఉద్ధేశంతో ప్రహరీలపై చిత్రాలు వేయించా. పిల్లల నవ్వుల ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు లలితకళల్లో శిక్షణ ఇప్పిస్తున్నాం. తురకలాపట్నం జెడ్పీ ఉన్నత పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను’ అని చెబుతున్న నిషాంతి... పెనుకొండ సబ్‌కలెక్టర్‌గా గత ఏడాది సెపె్టంబర్లో బాధ్యతలు చేపట్టారు. ►కార్యాలయంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిచ్చారు. ►దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ప్రజాసమస్యల దస్త్రాలను ఆగమేఘాలపై పరిష్కరించారు. ►నిషాంతి పనితీరు వల్ల ఫైల్ క్లియరెన్స్‌లో రాష్ట్రస్థాయిలో పెనుకొండ సబ్‌కలెక్టర్ కార్యాలయం ఉత్తమ అవార్డు అందుకుంది. ► ప్రహరీలపై ప్రభుత్వ పథకాలను చిత్రీకరించడం ద్వారా ప్రజలను చైతన్య పరిచారు. ►నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కియా పరిశ్రమ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. విద్యార్హతకు తగిన ఉద్యోగాలను నిరుద్యోగ యువతకు ఇప్పించారు. ►కరోనా ప్రభావిత హిందూపురంలో వైరస్ నియంత్రణకు రేయింబవళ్లూ శ్రమిస్తున్నారు. అటవీ సంపద రక్షణలో.. - జగన్నాథ్‌సింగ్, డీఎఫ్ఓ ‘పచ్చదనం కాపాడినప్పుడే మానవ మనుగడ ఉంటుంది. అటవీ భూముల పరిరక్షణ, అడవుల సంరక్షణ, వన్యప్రాణుల రక్షణపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం’ అని అంటున్న జిల్లా అటవీశాఖ అధికారి జగన్నాథ్‌సింగ్ ఆ దిశగా పయనిస్తున్నారు. ►అటవీ సంరక్షణ, అటవీ భూముల పరిరక్షణ లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోవడమే కాక, వాటిని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారు. ►గార్లదిన్నె, మరుట్ల, పెనకచర్ల డ్యామ్ ప్రాంతాల్లో అన్యాక్రాంతమైన 310 ఎకరాల అటవీ భూములను తాను బాధ్యతలు స్వీకరించిన అతి కొద్ది రోజుల్లోనే స్వాధీనం చేసుకున్నారు. ►అక్రమణలకు గురైన మరో 400 ఎకరాలు అటవీ భూములను స్వాదీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టారు. ►అటవీ భూముల ఆక్రమణలను నియంత్రించే దిశగా కఠినంగా వ్యవహరిస్తూ జిల్లాలో పూర్తి స్థాయిలో పచ్చదనం నెలకొల్పేందుకు శ్రమిస్తున్నారు. ►వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోతున్నారు. ►అడవులు అగ్నికి ఆహుతి కాకుండా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా ఈ వేసవిలో అటవీ ప్రాంతాల్లో అగి్నప్రమాదాలు కట్టడి చేయగలిగారు. -
'జాగ్రత్త.. కాస్త సున్నితంగా ఉండండి'
న్యూఢిల్లీ: చుట్టూ ఉండే వాతావరణం, పరిసరాలను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. కాస్తంతా సున్నితంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. తనను ఎలాంటి భయం లేకుండా ప్రతి ఐఏఎస్ అధికారి సంప్రదించవచ్చని అన్నారు. కొత్తగా విధుల్లోకి చేరుతున్న 2014 బ్యాచ్ ఐఏఎస్ లను కలిసిన సందర్భంగా వారితో ప్రధాని మాట్లాడుతూ ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ప్రభుత్వ పాలనలో భాగస్వాములవ్వాలని చెప్పారు. తొలుత అసిస్టెంట్ సెక్రటరీలుగా వ్యవహరించే మీరంతా సీనియర్ అధికారులను సంప్రదించే విషయంలో, అనుభవం నేర్చుకునే విషయంలో రాజీపడొద్దని, పెద్దవారనే భ్రమలో ఇరుక్కోవద్దని సూచించారు.