breaking news
yoth
-
2026కు 26 ట్రెండ్స్.. ఏఐ నుంచి జీరో వేస్ట్ వరకూ..
మరికొద్ది రోజుల్లో 2026 రానుంది.. కోటి ఆశలతో మనమంతా కొంగొత్త కాలంలోకి ప్రవేశించబోతున్నాం. ఈ తరుణంలో కొత్త సంవత్సరంలో ఇవి చేయాలి.. అవి చేయాలి అంటూ కొందరు లక్ష్యాలను పెట్టుకుంటారు. ఇటువంటి తరుణంలో రాబోయే 2026 మన జీవనశైలిని, సాంకేతికతను, మార్కెట్లను ఎలా ప్రభావితం చేయనుంది? ఏయే అంశాలు రాజ్యమేలనున్నాయి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నుండి జీరో వేస్ట్ వరకు ఎలా ఉండబోతోంది.. ఏ టు జెడ్ ధోరణులపై సమగ్ర విశ్లేషణ మీకోసం..AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)2026లో ఏఐ రంగంలో అతిపెద్ద మార్పు రానుంది. ఇప్పటి వరకు కేవలం మన ప్రశ్నలకు సమాధానమిచ్చే చాట్బాట్ల స్థాయి నుండి, సొంతంగా పనులు పూర్తి చేసే ఏజెంటిక్ వ్యవస్థల వైపు అడుగులు పడనున్నాయి. అలాగే ప్రైవసీ, వేగాన్ని దృష్టిలో ఉంచుకుని ఫోన్లలోనే నేరుగా పనిచేసే ఏఐ ఆదరణ పొందనుంది.Beauty (సౌందర్యం)సౌందర్య సాధనాలు కేవలం అందం కోసమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా అన్నట్లుగా మారనున్నాయి. అంటే మేకప్ వేసుకుంటేనే చర్మం హైడ్రేట్ కావడం, సూర్యుడి నుండి రక్షణ పొందడం వంటి 'హైబ్రిడ్ ఫార్ములా'లు మార్కెట్‌ను ఏలబోతున్నాయని ‘ది ఎకనమిక్ టైమ్స్’తన విశ్లేషణలో పేర్కొంది.Cars (కార్లు)ప్రీమియం కార్లలో మాత్రమే ఉండే అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, సరౌండ్ వ్యూ కెమెరాలు, ఓవర్ ది ఎయిర్ (ఓటీఏ) అప్డేట్స్ వంటి ఫీచర్లు సామాన్య వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.Dining & Drinks (ఆహారం- పానీయాలు) భారతదేశంలో ఏటా 23 మిలియన్ల మంది కొత్తగా మద్యం తాగే వయస్సులోకి వస్తున్నారు. 2026లో క్రాఫ్ట్ బీర్లు, తక్కువ ఆల్కహాల్ ఉండే కాక్టెయిల్స్, రమ్ వంటి వాటికి ఆదరణ పెరగనుంది. ఆహార రంగంలో 'మైక్రో డైనర్స్', కేవలం రుచి మాత్రమే కాకుండా వాతావరణం కూడా అనుభూతినిచ్చే ‘మల్టీ-సెన్సరీ డైనింగ్’ కీలకం కానున్నాయి.Entertainment (వినోదం)వినోద రంగంలో ఏఐ వినియోగం పెరగడంతో కళాకారుల నుండి వ్యతిరేకత ఎదురుకానుంది. దీంతో పలువురు నటులు ఇప్పటికే తమ పేరు, రూపం, శైలిపై కాపీరైట్ హక్కులను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. క్రియేటివ్ కమ్యూనిటీని రక్షించేందుకు కఠినమైన నిబంధనలు వచ్చే అవకాశం ఉంది.Fashion (ఫ్యాషన్)2026ను పర్సనల్ స్టయిల్ సంవత్సరంగా పిలుస్తున్నారు. అల్గారిథమ్స్ చూపించే ట్రెండ్స్ కంటే తమకు నచ్చినట్లు దుస్తులు ధరించడానికి జనం మొగ్గు చూపుతారు. మెకిన్సే నివేదిక ప్రకారం కొత్త దుస్తుల కంటే సెకండ్ హ్యాండ్ ఫ్యాషన్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందనుంది.Gaming (గేమింగ్)గేమింగ్‌లో ఏఐ ప్రతి యూజర్ కోసం ప్రత్యేకమైన కథనాలను, పరిసరాలను సృష్టిస్తుంది. దీనివల్ల గేమ్స్ మరింత అడిక్టివ్గా మారనున్నాయి. అయితే ఇది గేమర్స్ భద్రతపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆందోళనకరంగా మారింది.Health (ఆరోగ్యం)జబ్బులు రాకముందే గుర్తించే 'ప్రిడిక్టివ్ హెల్త్‌కేర్’ సాధారణం కానుంది. పోషకాహార లోపం, గుండె పనితీరు, నిద్ర సమస్యలను ఏఐ విశ్లేషించి రోజువారీ సూచనలు అందిస్తుంది. నిరంతర హెల్త్ మానిటరింగ్ కీలకం కానుంది.Interiors (ఇంటీరియర్స్)కృత్రిమంగా కనిపించే ఇళ్ల కంటే సహజమైన కలప, వంపులు తిరిగిన ఫర్నిచర్, వైవిధ్యమైన టెక్స్చర్లకు 2026లో డిమాండ్ ఉంటుంది. పాతకాలపు వస్తువులను మళ్లీ ఇళ్లలో చేర్చుకోవడం ఫ్యాషన్‌గా మారుతుంది.Jobs (ఉద్యోగాలు)ఐటీ వంటి రంగాల్లో ఆటోమేషన్ వల్ల మార్పులు వచ్చినా, సరైన నైపుణ్యం ఉన్న అభ్యర్థులకు ఉద్యోగ మార్కెట్ బలంగా ఉంటుంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీఎస్) విస్తరించడం వల్ల నియామకాలు పెరిగే అవకాశం ఉంది.Kids & Family (పిల్లలు-కుటుంబం)తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ఆడుకోవడం ద్వారా బంధాన్ని బలపరుచుకునే 'కిడల్టింగ్' (Kidulting) పెరుగుతోంది. ఇది పెద్దల ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. పాఠశాలల్లో బట్టీ పట్టే పద్ధతుల కంటే అనుభవం ద్వారా నేర్చుకోవడం అనేదానికి ప్రాధాన్యత పెరుగుతుంది.Luxury (లగ్జరీ)కేవలం ఖరీదైన వస్తువులను కొనడం కంటే, ప్రత్యేకమైన ప్రయాణాలు, అరుదైన సాంస్కృతిక కార్యక్రమాలు, వెల్నెస్ రిట్రీట్స్ వంటి అనుభూతిని ఇచ్చే అంశాలకు ప్రాధాన్యత పెరుగుతుంది.Music (సంగీతం)పంజాబీ సంగీతం తరహాలోనే హర్యాన్వీ, భోజ్‌పురి, మలయాళం తదితర ప్రాంతీయ భాషల సంగీతం గ్లోబల్ స్థాయిలో పాపులర్ అవుతుంది. భారతీయ కళాకారులు తమ ఫ్యాన్ బేస్ నుండి ఆదాయాన్ని పొందే మార్గాలను అన్వేషిస్తారు.Nutrition (పోషణ)జీర్ణక్రియ మెరుగుపరుచుకోవడం కోసం, దీర్ఘాయువు కోసం ఆహారంలో ఫైబర్ (పీచు పదార్థం) ను విపరీతంగా పెంచడం (Fiber maxing) అనేది 2026లో ప్రధాన హెల్త్ ట్రెండ్ కానుంది.Outdoors (అవుట్డోర్స్)రోజుకు 10 వేల అడుగులు నడవడమే కాకుండా, డిస్క్ గోల్ఫ్ , ఫ్రిస్బీ వంటి సామాజిక ఆటల పట్ల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కమ్యూనిటీలుగా ఏర్పడి ఆరుబయట సమయం గడపడం పెరుగుతుంది.Pets (పెంపుడు జంతువులు)పెంపుడు జంతువులను కేవలం జంతువులుగా కాకుండా కుటుంబ సభ్యులుగా చూసే ధోరణి మరింత పెరుగుతుంది. 2026లో ‘పెట్ పేరెంటింగ్’ శైలిలో మార్పులు రానున్నాయి. పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకమైన హెల్త్ ఇన్సూరెన్స్, ఆర్గానిక్ ఆహారం, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే ‘పెట్ థెరపీ’ సెషన్లకు డిమాండ్ పెరుగుతుంది.Quiet Travel (ప్రశాంత ప్రయాణాలు)పర్యాటకులు.. రద్దీగా ఉండే ప్రదేశాల కంటే, ఏకాంతంగా, ప్రశాంతంగా ఉండే ప్రాంతాల వైపు మొగ్గు చూపుతారు. దీన్నే 'క్వయిట్ ట్రావెల్’ అంటున్నారు. ధ్వని కాలుష్యం లేని ప్రాంతాలు, డిజిటల్ డిటాక్స్ అందించే రిసార్టులు 2026లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.Retail (రిటైల్)ఆన్లైన్ షాపింగ్, ఆఫ్-లైన్ స్టోర్స్ కలయికతో ఫిజిటల్' అనుభవం కొత్త పుంతలు తొక్కుతుంది. షాపుల్లోకి వెళ్ళినప్పుడు ఏఆర్ (ఏఆర్) అద్దాల ద్వారా దుస్తులను ట్రై చేయడం, క్యూలో నిలబడకుండా నేరుగా యాప్ ద్వారా చెల్లింపులు చేయడం వంటివి సాధారణం కానున్నాయి.Sustainability (సుస్థిరత)పర్యావరణంపై శ్రద్ధ కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఆచరణలోకి వస్తుంది. వినియోగదారులు వస్తువులను కొనేముందు అవి పర్యావరణానికి ఎంత హాని చేస్తాయో అనేది చూసి కొంటారు. కంపెనీలు కూడా రీసైకిల్ చేసిన ప్యాకేజింగ్‌ను విధిగా వాడాల్సి ఉంటుంది.Tech (సాంకేతికత)2026లో క్వాంటం కంప్యూటింగ్, 6G దిశగా పరిశోధనలు వేగవంతం అవుతాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ)మన ఇళ్లలోని ప్రతి వస్తువును స్మార్ట్‌గా మారుస్తుంది. వ్యక్తిగత డేటా భద్రత కోసం మరిన్ని కఠినమైన సాంకేతిక నిబంధనలు అమల్లోకి వస్తాయి.Urban Farming (నగరాల్లో వ్యవసాయం)నగరాల్లో నివసించే వారు తమ మేడల మీద లేదా బాల్కనీలలో హైడ్రోపోనిక్స్ పద్ధతిలో కూరగాయలు పెంచుకోవడం ఒక పెద్ద ట్రెండ్‌గా మారుతుంది. కెమికల్స్ లేని ఆహారం కోసం జనం ఈ దిశగా అడుగులు వేస్తారు.Virtual Reality (వర్చువల్ రియాలిటీ)వీఆర్ టెక్నాలజీ ఇకపై విద్య, వైద్య రంగాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. విద్యార్థులు క్లాస్‌రూమ్‌లో కూర్చుని, ప్రపంచంలోని ఏ మూలన ఉన్నా చారిత్రక కట్టడాలను వర్చువల్‌గా సందర్శించవచ్చు. అలాగే వైద్యులు సంక్లిష్టమైన సర్జరీల కోసం వీఆర్ సిమ్యులేషన్లను ఉపయోగిస్తారు.Work-Life Balance (వృత్తి-వ్యక్తిగత జీవిత సమతుల్యత)కంపెనీలు ‘ఫోర్ డే వర్క్ వీక్’ (వారానికి నాలుగు రోజులే పని) ప్రయోగాత్మకంగా అమలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి పెద్దపీట వేయడం ద్వారా ఉత్పాదకతను పెంచాలని పలు సంస్థలు భావిస్తున్నాయి.Xenotransplantation (జెనో-ట్రాన్స్‌ప్లాంటేషన్)జంతువుల అవయవాలను మనుషులకు అమర్చే ‘జెనో-ట్రాన్స్‌ప్లాంటేషన్’ రంగంలో 2026లో కీలక పురోగతి కనిపించవచ్చు. అవయవ దాతల కొరతను తీర్చేందుకు జన్యుమార్పిడి చేసిన జంతువుల అవయవాలపై పరిశోధనలు పెరిగే అవకాశం ఉంది.Youth Activism (యువత క్రియాశీలత)రాజకీయ, సామాజిక మార్పులలో యువత పాత్ర మరింత కీలకం కానుంది. సోషల్ మీడియా వేదికగా వారు లేవనెత్తే అంశాలు ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయనున్నాయి.Zero Waste (జీరో వేస్ట్)చెత్తను పూర్తిగా తగ్గించే ‘జీరో వేస్ట్’ జీవనశైలిని జనం అలవాటు చేసుకుంటారు. ప్లాస్టిక్ బదులు తినగలిగే నీటి పాడ్స్ , భూమిలో కలిసిపోయే ప్యాకేజింగ్ మెటీరియల్స్ వంటి ఇన్నోవేషన్లు మార్కెట్లోకి రానున్నాయి. 2026వ సంవత్సరం మానవ మేధస్సు , పర్యావరణ స్పృహల కలయికగా ఉండనుంది. టెక్నాలజీ మన పనులను సులభతరం చేస్తే, పర్యావరణ పరిరక్షణ మన భవిష్యత్తును కాపాడనుంది.ఇది కూడా చదవండి: -
దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం కీలకం
ఐఎఫ్ఎస్ డెప్యూటీ సెక్రెటరీ సందీప్‌కుమార్‌రెడ్డి బసంత్‌నగర్: దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం ఎంతో అవసరమని భారత విదేశీ వ్యవహారాల శాఖ (ఐఎఫ్ఎస్) డెప్యూటీ సెక్రటరీ బయ్యపు సందీప్‌కుమార్‌రెడ్డి అన్నారు. తన స్వగ్రామమైన కమాన్‌పూర్ మండలం రాణాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల, బసంత్‌నగర్‌లోని ఆలీవర్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో సోమవారం జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం కేశోరాం గెస్ట్‌హౌస్‌లో మాట్లాడారు. విద్య అనేది మనిషిలో విశ్వాసాన్ని పెంచుతుందని, ఇష్టంతో కష్టపడితే ఏదైనా సాధించవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు కృషి చేయాలని, అందుకు వారి తల్లిదండ్రులు సహకరించాలని సూచించారు. వ్యక్తిగత నైపుణ్యం కోసం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చైనాలో ప్రతి ఒక్కరికి వారివారి అభీష్టం మేరకు ఆసక్తి ఉన్న రంగాలలో శిక్షణ ఇచ్చి ప్రోత్సహించే కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందని, అలాంటి విధానాన్ని మన దేశంలో సైతం అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తన స్వగ్రామమైన రాణాపూర్ గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. తమ ఇంటిని గ్రామ అంగన్‌బాడీ కేంద్ర నిర్వహణకు ఇచ్చినట్లు వివరించారు. ఆయన వెంట బయ్యపు మనోహర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, కొండ్ర శంకర్, బాలసాని కుమార్, తిరుపతి ఉన్నారు. -
హద్దులు మీరుతున్న యువత..!
సంస్కృతి వైపు మొగ్గు –రకరకాల ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి –యుక్త వయస్సులో తీవ్ర ప్రభావం –పిల్లలను సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.. ఆలేరు : కౌమారం దశ బహు విచిత్రమైంది. వయస్సు చేసే అల్లరి, తల్లిదండ్రులను ఎదిరించి పంతం నెరవేర్చుకునేలా చేసేది ఈ దశే. ఇంట్లో లభించే స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ యువత పాశ్చాత్య పోకడల వైపు పయనిస్తూ పెడదోవ పట్టేది ఈ వయస్సులోనే. సెల్ఫోన్లలో, కంప్యూటర్లలో ఆశ్లీల కార్యక్రమాలను వీక్షించడం, వీడియో గేమ్‌లు ఆడడం, చాటింగ్ చేయడం, సెల్ఫోన్లతో గంటల తరబడి మాట్లాడడం, ధూమ, మద్యపానం లాంటి దురలవాట్లకు ఆకర్షితులవుతున్న టీనేజీ యువతపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. చేతి నిండా డబ్బులు.. నేటి తరంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్యాకెట్ మనీ ఇష్టారాజ్యంగా ఇస్తున్నారు. దీంతో వారు జల్సాలకు అలవాటు పడుతున్నారు. అంతేకాకుండా ఖరీదైన సెల్ఫోన్లు, బైక్ లు, ల్యాప్‌ట్యాబ్‌లు కొనిస్తుండడంతో వాటిని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఆకర్షణకు బందీ.. టీనేజీ యువతీయువకులు ఆకర్షణకు బందీ అవుతున్నారు. ప్రేమో, స్నేహమో తెలియని పరిస్థితి నెలకొంది. స్నేహానికి, ప్రేమకు మధ్య అంతరాన్ని గుర్తించడం లేదు. టీనేజీ భావనలను అధిగమించలేకపోవడం, సినిమాలు, టీవీల ప్రభావం, ఇంటివద్ద సమస్యలు తదితర కారణాలతో ప్రేమలో పడుతున్నారు. ప్రేమే లోకం, జీవితం అన్నట్టుగా మునిగిపోతున్నారు. దీంతో చదువు పెడదారిన పడుతోంది. గతంలో విద్యార్థులు చదువు, కే రీర్కు సంబంధించిన విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టేవారు. కానీ నేఆ పరిస్థితి లేదు. ప్రేమ పేరుతో అమ్మాయిలపై దాడులు జరుగుతున్నాయి. ప్రేమలో విఫలమైతే ఉన్మాదులుగా మారుతున్నారు. మరికొందరు ఆత్మహాత్యలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ టీనేజీ వయస్సులోనే ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ నుండే.. సిగరేట్, బీరు తాగడం ఫ్యాషన్‌గా భావిస్తున్నారు.. నేటి తరం యువత. ఇంటర్ నుంచే వాటిని అలవాటు చేసుకుంటున్నారు. గుట్కాపై నిషేధం ఉన్నా యువత బానిస కావడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సిగరెట్ తాగడం విద్యార్థులు ఎక్కువగా ఉంటున్నారు. ఇంటర్నెట్తో... ఇంటర్నెట్ చాలా మందికి కొత్త విషయాలు తెలుసుకోవాలనే మానసిక జిజ్ఞాస ఉత్సుకతంగా మారుతోంది. హైస్కూల్ వయస్సు మొదలయ్యే ప్రాయంలోనే అధికంగా ఉపయోగిస్తున్న స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు ఏ మాత్రం అప్రమత్తత లేకపోతే ప్రమాదం పొంచి ఉన్నట్టే. నెట్‌తో అనుసంధానం కాగానే అప్రయత్నంగానే ప్రత్యక్షమయ్యే అవాంచనీయ ప్రకటనలు, చిత్రాలు మనస్సును కలుషితం చేస్తుంది. 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాతనే ప్రారంభించాల్సిన ఫేస్బుక్ ఖాతాను తప్పుడు జనన తేదీలతో ఆరంభిస్తున్నారు. యాప్స్ ద్వారా సునాయసనంగా విషయాలను, చిత్రాలను, దృశ్యాలను పంచుకుంటున్నారు. యూటుబ్లో మంచితో పాటు చెడు కూడా ఉంది. వ్యసనంగా సెల్‌ఫోన్.. నేడు ప్రతి ఒక్కరికీ సెల్‌ఫోన్ వ్యసనంగా మారింది. బైక్ నడుపుతూ, రోడ్డు దాటుతూ, రైలు పట్టాలు దాటుతూ సెల్ఫోన్లో మాట్లడడం సాధారణంగా మారింది. దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గంటల తరబడి మాట్లడడం వల్ల సమయం వృధా అవుతుంది. ఇటీవల కాలంలో సెల్ఫీలతో కూడా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. మరియు హెడ్‌ఫోన్స్‌తో కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కుర్రాళ్లు జాగ్రత్త అధిక వేగం ఉన్న వాహనాల కొనుగోలుకు యువత అసక్తి చూపుతున్నారు. సై్టల్, హోదా ఉంటుందని వారి భావన. ఖరీదైన బైక్‌లపై మోజు గణనీయంగా పెరుగుతోంది.ఫలితంగా అతివేగం వల్ల వాహనంపై నియంత్రణ లేక ప్రమాదాల బారిన పడుతున్నారు. అయితే తమ పిల్లలకు బైక్‌లను సమకూరుస్తున్న తల్లిదండ్రులపైనే చాలా బాధ్యత ఉందనే విషయాన్ని గమనించాలి. చేతికొచ్చిన పిల్లలు మృత్యువాత పడితే కడుపుకోత బాధ గురించి పిల్లలకు తెలియజేయాలి. బైక్‌లు కొనిచ్చినప్పటికీ.. వాటి నిర్వహణపై తల్లిదండ్రులు గమనిస్తుండాలి. మద్యానికి బానిసలుగా.. యుక్తవయస్సు ఉన్నవారు ఆల్కహాల్‌కు బానిసవుతున్నారు. కొన్నిచోట్ల యువకులు మద్యం కోసం ప్రత్యేక బడ్జెట్‌ను తయారుచేసుకుంటున్నారు. తమ పాకెట్ మనీలో 70శాతం వరకు ఆల్కహాల్‌కే ఖర్చు పెడుతున్నారు. మద్యానికి డబ్బులు లేని సమయంలో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడుతున్నారు. ఇటీవల హైద్రాబాద్‌లో కొందరు యువకులు మద్యం తాగి వాహనం నడుపుతూ చిన్నారి రమ్యతో పాటు మరో ఇద్దరు చనిపోయేందుకు కారణమయ్యారు. ముగ్గులోకి లాగుతున్నారు పబ్‌లోకి అమ్మాయిలతో వస్తేనే ప్రవేశం.. స్నేహితులతో కలిసి వెళ్తున్న యువకులకు తీరా అక్కడికి వెళ్లాక మద్యం, మత్తు పదార్ధాలకు అలవాటు చేస్తున్నారు. ఎనర్జీ డ్రింక్స్‌తో మొదలుపెట్టి మద్యం, మత్తుపదార్థాల వరకు చేరుతున్నారు. క్రేజీగా భావిస్తున్నారు. స్టార్ హోటల్స్‌లలో అయితే వైన్ ఫెస్టివల్‌తో యువతారాన్ని ఆకర్షిస్తున్నాయి. క్రమంగా ఆల్కహాల్ ఎక్కువగా ఉండే పానీయాలపై మొగ్గు చూపుతున్నారు. నైతిక విలువలకు ప్రాధాన్యం విద్యార్థులకు ప్రాధమిక స్థాయి నుండే నైతిక విలువల పట్ల అవగాహన కల్పించాలి. మానవత్వం గురించి చెప్పాలి. పాశ్చాత్య పోకడలకు దూరంగా ఉండేలా చూడాలి. చదువు, కేరీర్‌పైనే దృష్టి సారించేలా చూడాలి. తల్లిదండ్రులతో అభిప్రాయాలు పంచుకునేలా స్వేచ్ఛగా వెల్లడించాలి. సమస్యలు ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించాలి. జీవితమంటే సరదలు, షికారులే కాదు.. లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగేలా ప్రోత్సహించాలి. ప్రేమే జీవితం కాదు.. జీవితంలో ప్రేమ ఓ భాగం మాత్రమే అన్నది గుర్తుంచుకోవాలి. తల్లిదండ్రుల బాధ్యత పెరగాలి విద్యార్థుల గురించి వారి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. విద్యార్ధులను కేవలం ఉద్యోగాలు సంపాదించి యంత్రాలుగానే కాకుండా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి. ఎలాంటి స్నేహాలు చేస్తున్నారు, వారి ప్రవర్తన ఏ విధంగా ఉందని కనిపెడుతుండాలి. విద్యతో పాటు నైతిక విలువలు, మానవత్వం, సామాజిక బాధ్యతలు నేర్పాలి. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి –నర్సింహులు, ఎస్సై, ఆలేరు మారుతున్న సమాజంలో తల్లిదండ్రులు సంపాదన మీద చూపుతున్న శ్రద్ధ కుటుంబంపై చూపడం లేదు. ప్రధానంగా పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా చూడాలి. మానవీయ విలువలను తెలియజేయాలి. పిల్లలకు ఆత్మీయత, అనురాగాలు, అనుబంధాలను పెంపొందేలా పెంచాలి. తేడా గుర్తించాలి –డా. ప్రభాకర్ , స్త్రీ వైద్య నిపుణులు, ఆలేరు ప్రేమకు–ఆకర్షణకు తేడా తెలుసుకోవాలి. కౌమరదశ– యవ్వనానికి పూర్వం అంటే 13–19 సంవత్సరాల మధ్య స్త్రీ పురుషుల్లో హర్మోన్ల ప్రభావంతో ఆకర్షణలు ఏర్పడుతాయి. విజ్ఞాత కలిగి హృదయపూర్వక సాన్నిహిత్యాన్ని కోరుకోవడమే అసలైన ప్రేమ. 20 ఏళ్లు దాటిన యువత సమాజం, పరిస్థితులు, కుటుంబ వ్యవస్థ, చదువు అన్నింటిపై అవగాహన కలిగి ఉంటారు. యాంత్రీకరణగా సంబంధాలు –బండిరాజుల శంకర్, ప్రిన్సిపాల్, ఆలేరు ప్రస్తుతం తల్లిదండ్రులకు సంపాదనపై ఉన్న ద్యాసం కుటుంబంపై ఉండడం లేదు. ఆలుమగల మధ్య సంబంధాలు యాంత్రీకరణగా మారడంతో అనుబంధం, ఆత్మీయత, అనురాగం దూరమవుతున్నాయి. వీటి ప్రభావం పిల్లలపై పడుతుంది. పిల్లలు పాశ్చాత్య పోకడలు పట్టకుండా చూడాల్సింది తల్లిదండ్రులదే. వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలపై అవగాహన కల్పించాలి.


