breaking news
yalamachili
-
ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, ప.గో(యలమంచిలి): ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న పడవ ఇంజిన్ పాడైపోవడంతో వరద ఉధృతికి కొట్టుకుపోయింది. యలమంచిలి మండలం బాడవ వరద ప్రాంతం నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తూర్పు గోదావరి వైపు చెట్టుకు లంగర్ వేసి పడవను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అదుపు చేసింది. ఎమ్మెల్యే ముంపు గ్రామాలకు వెళ్లేటప్పుడు తమకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని డీఎస్పీ నాగేశ్వరరావు అన్నారు. సమాచారం ఇచ్చిన వెంటనే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో కాపాడగలిగామన్నారు. -
విశాఖజిల్లాలో దారుణం
విశాఖపట్నం: విశాఖ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. యలమంచిలి నెహ్రూనగర్‌లో రోడ్డు పక్కన చెట్ల పొదల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఓ పసికందును వదిలి వెళ్లారు. శిశువు ఏడుపు విన్న స్థానికులు ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించి ఆస్పత్రిలో చేర్చారు. అప్పుడే పుట్టిన మగశిశువును గుర్తు తెలియని వ్యక్తుల చెట్లపొదల్లో వదిలి వెళ్లారని స్థానికులు పోలీసులకు తెలిపారు.