breaking news
wrestlemania
-
భారత్‌లో నాకు ప్రత్యేక అభిమానులున్నారు : 'సూపర్‌స్టార్ జాన్ సినా'
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం అంతర్జాతీయ స్థాయిలో మరోసారి తన ప్రతిష్టను చాటుకుంది. డబ్ల్యూడబ్ల్యూఈ చాంపియన్‌షిప్‌నకు వేదికగా నిలిచింది. సమరాన్ని తలపించేలా శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ‘డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ స్పెక్టాకిల్’ పోరు జరిగింది. దేశంలో రెండోసారి, నగరంలో తొలిసారిగా పోటీలు జరగడంతో సందడి నెలకొంది. ‘డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ స్పెక్టాకిల్’లో పదమూడు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ‘జాన్ సినా’ రావడంతో అభిమానుల ఆనందం అంబరాన్నంటింది. జాన్ సినాతో పాటు సేథ్ ‘ఫ్రీకిన్’ రోలిన్స్, జిందర్ మహల్, నటల్య, ‘ది రింగ్ జనరల్’ గుంథర్, డ్రూ మెక్‌ఇంటైర్, కెవిన్ ఓవెన్స్, సమీ జైన్ వంటి డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్స్టార్లు తలపడేందుకు విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక విమానంలో వచ్చిన వీరికి ఎయిర్‌పోర్టులో అభిమానులు ఘనస్వాగతం పలికారు. డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ స్పెక్టాకిల్‌కు హాజరైన జాన్ సినాను సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా చీఫ్ రెవెన్యూ ఆఫీసర్, ఇంటర్నేషనల్ బిజినెస్ హెడ్ రాజేష్ కౌల్ ఆహ్వానించి అభినందనలు తెలిపారు. ఇటీవల డబ్ల్యూడబ్ల్యూఈ ట్యాగ్ టీమ్ కెవిన్ ఓవెన్స్, సామి జైన్‌లతో సీక్రెట్‌గా ఓ ప్రాజెక్ట్ చిత్రీకరణలో కనిపించి అలరించిన దక్షిణాది హీరో కార్తీ శుక్రవారం జాన్ సినాను ప్రత్యేకంగా కలిసి ఫొటోలు దిగారు. గొప్ప అనుభూతి.. ► ఈ సందర్భంగా జాన్ సినా మాట్లాడుతూ.. భారత్‌లో తనకు ప్రత్యేక అభిమానులున్నారని, ఇన్నేళ్ల తర్వాత భారత్ వేదికగా డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ స్పెక్టాకిల్‌లో పాల్గొనడం గొప్ప అనుభూతిగా నిలిచిపోతుందన్నారు. ► పోటీల్లో పాల్గొంటున్న భారతీయ ఫైటర్లు వీర్ మహాన్, సంగా, జిందర్ మహల్లు హైదరాబాద్ నగరాన్ని మరోసారి ఆస్వాదించామన్నారు. ప్రత్యేకంగా చార్మినార్‌ను సందర్శించామని, ఇక్కడి ఫేమస్ బిర్యానీ తిన్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ► స్పెక్టాకిల్‌లో పాల్గొన్న లేడీ ఫైటర్ నటల్య ‘భారతీయ అభిమానుల ప్రేమలో తడవటం గొప్ప అనుభూతి అని’ అభివర్ణించింది. ఇక్కడి మూలాల్లోనే పోటీతత్వం ఇమిడి ఉందని కితాబిచ్చింది. -
రింగ్‌లో మట్టికరిపించి ప్రేమలో పడ్డారు
-
రింగ్‌లో మట్టికరిపించి ప్రేమలో పడ్డారు
ఓర్లాండో: ఓ ఆటలోగానీ, పోటీలోగానీ విజయం అనంతరం తమకు నచ్చిన ప్రేయసికి, ప్రియుడికి ప్రపోజ్ చేసే సన్నివేశాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అప్పటి వరకు చెప్పాలనుకున్న మాటలు చెప్పలేకపోయినా తాను విజయం సాధించినచోట మనుసులో ఉన్న వ్యక్తి అక్కడే ఉండి ఉంటే మాత్రం ప్రేమ తన్నుకొని రావడం మాత్రం ఖాయం. సరిగ్గా రెజ్లింగ్ స్టార్ జాన్ సేనా విషయంలో అదే జరిగింది. ఎప్పటి నుంచో తనతోపాటు రెజ్లింగ్‌లో పాల్గొనే నిక్కి బెల్లాను ప్రేమిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఆ మాటను బయటకు చెప్పని జాన్ సేనా అనూహ్యంగా ప్రపోజ్ చేసి అందరినీ అబ్బురపరిచాడు. ఆదివారం ఓర్లాండోలో రెజ్లింగ్ మానియా 33 జరిగింది. రింగ్‌లో జాన్ సేనా, నిక్కి బెల్లా కలిసి తమ ప్రత్యర్థులు మిజ్, మార్సిని మట్టికరిపించారు. ఈ విజయం సాధించిన వెంటనే ఎవరూ ఊహించని విధంగా వెంటనే ఆకాశంవైపు ఓసారి చూసి మోకాలిపై కూర్చుని తనతోపాటు రెజ్లింగ్ రింగ్‌లో ఉన్న నిక్కీవైపు చూస్తూ ఓ వజ్రపు ఉంగరాన్ని తనకిస్తూ ప్రపోజ్ చేశాడు. ఇక తాను ఆగలేనని, ఈ మాట ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నానని, తనను పెళ్లి చేసుకుంటావా అని అడిగేశాడు. దాంతో ఎగిరిగంతేసినంత పనిచేసిన నిక్కీ కూడా తనకు కూడా చాలా ఇష్టమే అని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రింగ్‌లోనే అందరూ చూస్తుండగా జాన్ సేనాను ఆలింగనం చేసుకొని లిప్‌లాక్‌తో మైమరిపించింది.