breaking news
World Archery
-
వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్-3లో భారత పారా ఆర్చర్లు అదరగొట్టారు. పోటీల చివరి దశకు చేరుకున్న సమయంలో భారత్ ఖాతాలో రెండు స్వర్ణ పతకాలు, ఒక రజత పతకం చేరాయి.పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్ తోమన్ కుమార్, శ్యామ్ సుందర్ స్వామి జోడీ స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో ఇరాక్‌కు చెందిన అబ్బాస్ కదీమ్, అన్వర్ అల్దావూద్ జోడీపై 152-139తో ఘన విజయం సాధించింది.పురుషుల రికర్వ్ టీమ్ విభాగంలో పారాలింపిక్స్‌లో రెండుసార్లు పతకాలు సాధించిన హర్విందర్ సింగ్, విజయ్ సుండి జోడీ కూడా బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. తొలి సెట్లో వెనుకబడిన భారత జోడీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని స్లోవేకియా జోడీపై 6-2తో విజయం సాధించింది.మహిళల రికర్వ్ టీమ్ విభాగంలో భావన, పూజా జోడీ రజత పతకంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో ఈ జోడీ చైనా జోడీ చేతిలో ఓటమి పాలైంది.చదవండి: నాలుగు ఎకరాలు భూమి కొన్న సచిన్.. ధర ఎంతంటే.. -
భారత్ ఖాతాలో స్వర్ణం.. కీలకపాత్ర పోషించిన తెలుగు అమ్మాయి
భారత యువ ఆర్చర్లు అంతర్జాతీయ వేదికపై సత్తా చాటారు. దక్షిణ కొరియాలో జరుగుతున్న World Archery KAA Youth Invitational 2026 U21 రికర్వ్ మహిళల టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకం సాధించారు.ప్రాంజల్ థోలియా, ఖుషి కుమావత్, యుక్త శ్రీ కొండపావులూరి (ఆంధ్రప్రదేశ్)తో కూడిన భారత జట్టు ఫైనల్లో ఆతిథ్య దక్షిణ కొరియాను 5-3తో ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. కొరియా గడ్డపైనే ఆ దేశ జట్టును ఓడించడం భారత యువ ఆర్చర్ల విజయాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపింది.క్వాలిఫికేషన్ దశ నుంచి నిలకడగా రాణించిన భారత త్రయం ఫైనల్లోనూ ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొంది. కొరియా నుంచి వచ్చిన సవాలును తిప్పికొట్టి 5-3తో మ్యాచ్‌ను ముగించి స్వర్ణాన్ని ఖాయం చేసుకుంది.కాంపౌండ్ విభాగంలో రజతంమరోవైపు, భారత U21 కాంపౌండ్ మహిళల జట్టు కూడా టైటిల్ పోరులోకి దూసుకెళ్లింది. అదితి గోపిచంద్ స్వామి, తేజల్ రాజేంద్ర సాల్వే, వైష్ణవి కుమార్ పాటిల్‌తో కూడిన జట్టు చైనీస్ తైపీ చేతిలో అత్యంత ఉత్కంఠభరితమైన పోరులో 228-229తో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకుంది.అయితే కొరియాతో జరిగిన ప్రత్యేక ఎగ్జిబిషన్ గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించి స్వర్ణం అందుకుంది.వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్లో అదితి స్వామి రజత పతకం కూడా సాధించింది. దీంతో ఈ టోర్నీలో భారత యువ ఆర్చర్ల పతకాల ఖాతా మరింత బలపడింది. -
‘పోడియంపై ఇక ఒంటరిని కాను’
కోల్‌కతా: వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో స్వర్ణ, రజతాలు భారత్‌కే దక్కడం సంతోషంగా ఉందని... భారత స్టార్ పారా ఆర్చర్ శీతల్ దేవి పేర్కొంది. పారా ఆర్చరీలో లెక్కకు మిక్కిలి అవార్డులు, రికార్డులు తన పేరిట లిఖించుకున్న శీతల్ దేవి... సహచర పారా ఆర్చర్ పాయల్ నాగ్ ప్రదర్శనను కొనియాడింది. గతంలో పోడియంపై నిలిచినప్పుడు దేశం తరఫున తాను మాత్రమే గెలుస్తున్నట్లు ఒంటరి తనంగా ఉండేదని... ఇప్పుడు తనకు తోడు దొరికినట్లు అనిపిస్తోందని చెప్పింది. ఇటీవల బ్యాంకాక్ వేదికగా జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ కాంపౌండ్ మహిళల ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ఆర్చర్ శీతల్‌పై భారత్‌కే చెందిన 18 ఏళ్ల పాయల్ నాగ్ విజయం సాధించింది. దీంతో పసిడితో పాటు రజత పతకం భారత్‌కే దక్కింది. ఈ నేపథ్యంలో గురువారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో శీతల్ మాట్లాడుతూ...‘గతంలో నేను ఒక్క దాన్నే గెలుస్తున్నట్లు అనిపించేది. ఇప్పుడు పాయల్ వచ్చింది. చాలా సంతోషం. తను చక్కటి ప్రదర్శనతో విజయం సాధించింది. ఇద్దరం కలిసి దేశానికి మరిన్ని పతకాలు అందిస్తాం. ఆటలో గెలుపోటములు సహజం. ఆ రోజు నాకన్నా పాయల్ చాలా బాగా బాణాలు సంధించింది. దీంతో రెండు పతకాలు మనకే దక్కాయి. ఆసియా క్రీడలు, పారాలింపిక్స్‌లో దేశానికి మరిన్ని పతకాలు అందిస్తాం’ అని వెల్లడించింది. ఒడిశాలోని బాలాంగిర్‌కు చెందిన పాయల్ నాగ్... చిన్నప్పుడే విద్యుదాఘాతానికి గురైంది. మూడో తరగతి చదువుతున్న సమయంలో తండ్రి పనిచేస్తున్న భవనం వద్ద కరెంట్ షాక్‌కు గురైంది. దీంతో రెండు చేతులతో పాటు... రెండు కాళ్లు మోకాలి కింది వరకు తొలగించాల్సి వచ్చింది. అనంతరం ఆర్చరీని కెరీర్‌గా ఎంచుకున్న పాయల్... అంచెలంచెలుగా ఎదుగుతూ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. శీతల్‌పై గెలవడం పాయల్‌కు ఇది రెండోసారి. గతంలో నేషనల్ చాంపియన్‌షిప్‌లోనూ శీతల్‌పై పాయల్ పైచేయి సాధించింది. -
శీతల్‌కు పాయల్ షాక్!
బ్యాంకాక్: వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్‌లో భారత జట్టు 7 స్వర్ణాలు సహా మొత్తం 16 పతకాలు సాధించి అగ్రస్థానంతో ముగించింది. అయితే టోర్నీలో సంచలన ప్రదర్శన చివరి రోజు శనివారం వచ్చింది. కాంపౌండ్ మహిళల ఫైనల్ విభాగంలో వరల్డ్ నంబర్‌వన్, స్టార్ పారా ఆర్చర్ శీతల్‌దేవికి అనూహ్య పరాజయం ఎదురైంది. ఈ పోరులో భారత్‌కే చెందిన పాయల్ నాగ్ 139–136 స్కోరుతో శీతల్‌పై విజయం సాధించింది. గత ఏడాది దుబాయ్‌లో జరిగిన ఆసియా యూత్ పారా గేమ్స్‌లో పాల్గొన్న పాయల్‌కు ఇది రెండో అంతర్జాతీయ టోర్నీ మాత్రమే. ఓపెనింగ్ ఎండ్‌లో పాయల్ 27–25తో ముందంజ వేయగా, సెకండ్ ఎండ్ ముగిసే సరికి శీతల్ రాణించడంతో స్కోరు 54–54తో సమమైంది. అయితే చివరి ఎండ్‌లో మళ్లీ సత్తా చాటిన పాయల్ పైచేయి సాధించింది. ఒడిషాలోని బాలాంగిర్‌కు చెందిన పాయల్ కరెంట్ షాక్ కారణంగా రెండు చేతులు, రెండు కాళ్ల మోకాలి కింది భాగాలు కోల్పోయింది. ఏడాదిన్నర క్రితం జైపూర్‌లో జరిగిన జాతీయ పారా నేషనల్స్‌లో కూడా శీతల్‌పై పాయల్ గెలుపొందింది. -
పాత కోచ్... పాత విల్లు
- ఫామ్‌లోకి వచ్చిన ఆర్చర్ దీపిక - ప్రపంచకప్‌లో మూడు పతకాలు - ఆసియా క్రీడలపై దృష్టి న్యూఢిల్లీ: రెండేళ్లు... సాధారణంగా ఏ క్రీడాకారుడికైనా ఇది అమూల్యమైన సమయం. 18 ఏళ్లకే ప్రపంచ ఆర్చరీలో నంబర్‌వన్ (2012లో)గా నిలిచిన భారత ఆర్చర్ దీపికా కువూరికైతే ఇది అత్యంత విలువైన సవుయుం. పేలవ ప్రదర్శన కారణంగా ఈ రెండేళ్లలో దీపిక సాధించింది అంతంత వూత్రమే. ఫలితంగా టాప్-10లో స్థానం కూడా కోల్పోరుుంది. కానీ... ఇటీవల వుుగిసిన ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-4 టోర్నీలో దీపిక మునుపటి ప్రదర్శనను కొనసాగిస్తూ ఒక బంగారు పతకంతో పాటు రెండు కాంస్యాలు సాధించింది. ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అనే నానుడిని నిజం చేస్తూ పాత విల్లుతో ఈ టోర్నీలో బరిలోకి దిగడమే కాకుండా పూర్వపు కోచ్ ధర్మేందర్ తివారి ఆధ్వర్యంలో వుంచి ఫలితాలు సాధించింది. ‘ప్రపంచకప్ ముందు వరకు నేను పేలవ ప్రదర్శనను కొనసాగించా. 2012లో ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న నేను ఫామ్ లేమి కారణంగా టాప్-10లో స్థానం కోల్పోయూ. తరచూ కోచ్‌లను వూర్చడం వల్ల కూడా నాకు కలిసి రాలేదు. ఈ పరిస్థితుల్లో నా గురించి అంతా తెలిసిన టాటా అకాడమీ చీఫ్ కోచ్ ధర్మేంద్ర దగ్గర వుళ్లీ శిక్షణ తీసుకున్నా. కొత్త విల్లుతో కాకుండా పాత దానితో సాధన చేసి వుంచి ఫలితాలు సాధించా’ అని భారత ఆర్చరీ సమాఖ్య (ఏఎఫ్ఐ) అధ్యక్షుడు వీకే మల్హోత్రా నివాసంలో జరిగిన సన్మాన కార్యక్రవుంలో దీపిక కువూరి చెప్పింది. ప్రపంచకప్‌తో మునుపటి నైపుణ్యాన్ని సాధించిన దీపిక లక్ష్యం ఇప్పుడు ఆసియా క్రీడలు. దక్షిణ కొరియూలోని ఇంచియూన్‌లో వచ్చే నెల 19 నుంచి మెుదలయ్యే ఈ క్రీడల కోసం దీపిక తీవ్రంగా సాధన చేస్తోంది. ‘ప్రపంచకప్‌తో పోలిస్తే ఏషియూడ్ భిన్నమైనది. ఇది చాలా క్లిష్టమైనది. కొరియూ, చైనీస్ తైపీ, జపాన్, చైనా లాంటి జట్లు ఆసియూ క్రీడల్లో బరిలోకి దిగుతారు. పతకం గెలుస్తానని నేను చెప్పలేకపోరుునా వుంచి ప్రదర్శనను కొనసాగిస్తా. ఈ క్రీడల్లో ఆశావహ దృక్పథంతో బరిలోకి దిగుతా’ అని దీపిక తెలిపింది. ఇక ఆసియూ క్రీడలకు సన్నాహకంగా భారత కాంపౌండ్, రికర్వ్ ఆర్చర్లు దక్షిణ కొరియూ వాతావరణానికి అలవాటు పడేందుకు గ్వాంగ్జూకు ఈ నెల 28న బయుల్దేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు ఆర్చర్లు అక్కడే సాధన చేస్తారు.


