breaking news
Womens one-day tournament
-
ఫైనల్లో ఆంధ్ర ఓటమి
బెంగళూరు: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీనియర్ మహిళల వన్డే టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ టోర్నీలో తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించిన ఆంధ్ర జట్టు తుది పోరులో 11 పరుగుల తేడాతో బెంగాల్ చేతిలో ఓటమి చవిచూసింది. ఆంధ్ర జట్టులో నలుగురు రనౌట్ కావడం గమనార్హం. టాస్ నెగ్గిన ఆంధ్ర ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 198 పరుగులు సాధించింది. మందిర మహాపాత్ర (39 నాటౌట్), దీప్తి (34; 3 ఫోర్లు) రాణించారు. ఆంధ్ర బౌలర్లలో సీహెచ్ ఝాన్సీ లక్ష్మి మూడు వికెట్లు తీయగా... పుష్పలత, శరణ్యలకు ఒక్కో వికెట్ లభించింది. 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు 49.1 ఓవర్లలో 187 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అనూష (61; 5 ఫోర్లు), పద్మజ (38; 4 ఫోర్లు) ఆకట్టుకున్నా... కీలకదశలో ఔటవ్వడం ఆంధ్ర విజయావకాశాలపై ప్రభావం చూపింది. -
నాకౌట్‌కు హైదరాబాద్
సౌత్‌జోన్ అండర్-19 టోర్నీలో రన్నరప్ సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ సౌత్‌జోన్ ఇంటర్ స్టేట్ అండర్-19 మహిళల వన్డే టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. దీంతో ఆలిండియా అండర్-19 నాకౌట్ టోర్నమెంట్‌కు అర్హత సంపాదించింది. విజేతగా నిలిచిన కర్ణాటక జట్టు కూడా నాకౌట్ పోరుకు సిద్ధమైంది. సౌత్‌జోన్ నుంచి ఈ రెండు జట్లు అర్హత పొందాయి. గుంటూరులో జరిగిన ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు తలపడ్డాయి. అత్యధిక విజయాలతో కర్ణాటక చాంపియన్‌షిప్ సాధించగా, హైదరాబాద్ జట్టు మెరుగైన రన్‌రేట్ ఆధారంగా ఆంధ్ర, కేరళలను వెనక్కి నెట్టి రన్నరప్‌గా నిలిచింది. విజయవాడలో గురువారం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) కోశాధికారి రహీమ్ కర్ణాటక జట్టుకు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్కే ప్రసాద్, రమేశ్, ఎల్లారావు, బాపూజీ, సీఆర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ విమెన్ క్రికెటర్ రచన ‘బెస్ట్ బౌలర్’ అవార్డును అందుకుంది. కల్పన (ఆంధ్ర) ‘బెస్ట్ వికెట్ కీపర్’, జి.దివ్య (కర్ణాటక) ‘బెస్ట్ బ్యాట్స్‌విమెన్’, పుష్ప (కర్ణాటక) ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డులు అందుకున్నారు.