breaking news
Womens basketball section
-
Basket Ball: 7 అడుగుల 5 అంగుళాల ఆజానుబాహురాలు.. ఎంత అలవోకగా పాయింట్లు సాధిస్తుందో చూడండి..!
మహిళల బాస్కెట్‌బాల్‌లో 17 ఏళ్ల చైనా అమ్మాయి ఝాంగ్ జియు సంచలనాలు సృష్టిస్తుంది . 7 అడుగుల 5 అంగుళాల ఆజానుబాహురాలైన జియు తన హైట్‌ను అడ్వాంటేజ్‌గా తీసుకుని అలవోకగా పాయింట్లు సాధిస్తూ టాక్ ఆఫ్ ద సోషల్‌మీడియాగా మారింది. జియు తన ఎత్తు కారణంగా దూరం నుంచి ఖచ్చితత్వంగా డైరెక్ట్ షూట్లు చేయడంతో పాటు దుర్భేద్యమైన డిఫెన్స్‌ను ప్రదర్శించగలుగుతుంది. 16-year-old Zhang Ziyu, the 7’5 female basketball player, barely broke a sweat during her debut for Team Chinapic.twitter.com/nOScHVR4RN— Dexerto (@Dexerto) June 25, 2024అంతర్జాతీయ కెరీర్లో తన తొలి టోర్నమెంట్ (FIBA అండర్ 18 మహిళల ఆసియా కప్ 2024) ఆడుతున్న జియు.. తాజాగా ఇండొనేషియాతో జరిగిన మ్యాచ్‌లో 19 పాయింట్లు సాధించి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. జియు కేవలం 13 నిమిషాల వ్యవధిలో 9 షూట్లను పాయింట్లుగా మలిచింది. ఈ గేమ్‌లో చైనా 109-50 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.ఈ మ్యాచ్ అనంతరం ఇంటర్నేషనల్ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ (FIBA) జియు సాధించిన పాయింట్లకు సంబంధించిన వీడియోను సోషల్‌మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరలవుతుంది. జియు చెమటోడ్చకుండా పాయింట్లు సాధిస్తుందని కొందరంటుంటే.. మరికొందరు జియుని చీట్ కోడ్ అని అంటున్నారు. మొత్తానికి జియు బాస్కెట్‌బాల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. -
అమెరికా అమ్మాయిల ‘సిక్సర్’
మహిళల బాస్కెట్‌బాల్ విభాగంలో అమెరికా జట్టు వరుసగా ఆరోసారి స్వర్ణాన్ని సాధించింది. ఫైనల్లో అమెరికా 101-72 పాయింట్ల తేడాతో స్పెయిన్‌ను ఓడించింది. 1996 అట్లాంటా ఒలింపిక్స్ నుంచి ఇప్పటివరకు అమెరికా జట్టుకు బాస్కెట్‌బాల్ ఫైనల్స్‌లో ఓటమి లేకపోవడం విశేషం. కాంస్య పతక పోరులో సెర్బియా 70-63తో ఫ్రాన్స్‌ను ఓడించింది.