breaking news
women attempts sucide
-
కోరిక తీర్చాలంటూ.. బావ వేధింపులు తాళలేక..
తాడేపల్లి: బావ లైంగిక వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన జొన్న ఆదిశేషు రెండో కుమారుడు శ్రీనివాసరావుకు, పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెంకు చెందిన అన్నారావు, సత్యవతిల ఏకైక కుమార్తె గీతాసురేఖకు 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు మగపిల్లలు. భర్త శ్రీనివాసరావు ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. తమ్ముడు శ్రీనివాసరావు అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని అన్న శివశంకర్ మరదలిపై కన్ను వేసి తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిజేశాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన గీతాసురేఖ జనవరి 15 వ తేదీన పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకొంది. అదే రోజు విజయవాడలో నివాసం ఉండే సురేఖ సోదరుడు రామకృష్ణ ఆమెకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చిన రామకృష్ణ సాయంత్రం 4 గంటల సమయంలో ఉండవల్లిలోని సురేఖ ఇంటికి వచ్చాడు. తమ కుమారుడు, కోడలు బయటకు వెళ్లారని మామ ఆదిశేషు రామకృష్ణతో చెప్పాడు. పిల్లల్ని సైతం బెదిరించడంతో వారు కూడా అలాగే చెప్పి భోరున విలపించారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆత్మహత్యాయత్నం చేసుకున్నా చెప్పకుండా దాచారు. పిల్లలు చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. వెంటనే బాధితురాలిని విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ సోమవారం సురేఖ మృతి చెందింది. బావ శివశంకర్, మామ ఆదిశేషు, దీనికి కారణమైన మిగతా వారిపై కేసు నమోదు చేయాలని సురేఖ బంధువులు డిమాండ్ చేశారు. అమ్మకు ఏమైందో అర్థంకాక ఆ చిన్నారులిద్దరూ ఆస్పత్రిలో బెడ్ వద్దే నిలబడి తీవ్రంగా దుఃఖించారు. చివరకు తల్లి చనిపోయిందని తెలియడంతో పిల్లలు బోరున విలపిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. నిందితుడు శివశంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
కుక్క దూరమైందని మహిళ ఆత్మహత్యాయత్నం
టీనగర్ (చెన్నై): ప్రాణంగా పెంచుకున్న కుక్కను భర్త అడవిలో విడిచిపెట్టడంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మాహుతికి యత్నించింది. ఈ సంఘటన తమిళనాడులో సంచలనం కలిగించింది. నామక్కల్ జిల్లా పరమత్తివేలూరు సుల్తాన్‌పేటకు చెందిన పెరుమాళ్ కూరగాయల వ్యాపారి. ఇతని భార్య శాంతి (35). ఇంట్లో కుక్కను పెంచుతోంది. దీన్ని భర్త వ్యతిరేకించడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో కుక్క, పిల్లలను కనింది. దీంతో విసిగిపోయిన పెరుమాళ్ ఒక గోనె సంచిలో పిల్లలతోపాటు తల్లి కుక్కను అడవిలో వదిలిపెట్టాడు. బయటికి వెళ్లిన శాంతి ఇంటికి రాగానే కుక్క లేకపోవడంతో భర్తను ప్రశ్నించింది. వాటిని అడవిలో వదిలినట్టు భర్త చెప్పడంతో ఆమె భర్తతో గొడవపడింది. భర్త బయటికి వెళ్లగానే శాంతి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె కేకలు విన్న ఇరుగుపొరుగువారు మంటలార్పి పరమత్తివేలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.