breaking news
withdrew
-
అట్టుడుకుతున్న మణిపూర్.. సంగ్మా కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: బీజేపీ ఆధ్వర్యంలోని మణిపుర్ ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకున్నట్లు నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అధ్యక్షుడు, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా ఆదివారం(నవంబర్ 17) ప్రకటించారు.‘మణిపూర్‌లో సంక్షోభాన్ని పరిష్కరించడంలో సీఎం బీరేన్ సింగ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తాజా హింసాత్మక ఘటనల్లో అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి మా మద్దతును తక్షణమే ఉపసంహరించుకుంటున్నాం’ అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాసిన లేఖలో ఎన్పీపీ తెలిపింది. మణిపుర్ అసెంబ్లీలో మొత్తం 60 సీట్లున్నాయి. వీటిలో 53స్థానాలతో ఎన్డీయే అధికారంలో ఉంది. ఈ 53 సీట్లలో ఎన్పీపీకి ఏడు సీట్లున్నాయి.హింసాత్మక ఘటనల నేపథ్యంలో మణిపుర్ పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఆదివారం(నవంబర్ 17)ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో శాంతిస్థాపనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహారాష్ట్రలో తన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుని ఢిల్లీకి తిరిగి వచ్చిన వెంటనే అమిత్ షా ఈ సమావేశాన్ని నిర్వహించారు. కాగా, మణిపుర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌తోపాటు ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల నివాసాలపై నిరసనకారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. -
ఐఐటీ ప్లేస్ మెంట్ కమిటీ బ్లాక్ లిస్ట్ లో ఆరు కంపెనీలు
ముంబై : అధిక వేతనంతో జాబ్ ఆఫర్ చేస్తూ.. ప్రాంగణాల్లోనే నియామకాలు చేపడుతూ... ఉద్యోగాల్లో చేర్చుకోవడంలో జాప్యం చేస్తున్న కంపెనీలపై ఐఐటీల ప్లేస్ మెంట్ కమిటీ(ఏఐపీసీ) సీరియస్ అయింది. క్యాంపస్ రిక్రూట్మెంట్ వ్యవహారంలో ఇటీవల నెలకొన్న వివాదం నేపథ్యంలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) స్పందించింది. ఇకమీదట కళాశాల ప్రాంగణాల్లో నియామకాలు చేపట్టకుండా అరు కంపెనీలను ఈ ఏడాది బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. కంపెనీల్లో ఉద్యోగాల నియామకాల్లో జాప్యం చేస్తుండటం వంటి వరుస ఘటనల నేపథ్యంలో ఏఐపీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ముంబైలో శుక్రవారం భేటీ అయిన కమిటీ అరడజను కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నట్టు ప్రకటించింది. ఆఫర్ లెటర్లు ఇచ్చి విత్ డ్రా చేసుకోవడం, ముందు ప్రకటించిన వేతనంలో కోత విధించడం, ఉద్యోగ నియామకాల్లో జాప్యం చేస్తుండటం వంటి మూడు కారణాలను పరిగణలోకి తీసుకుని ఈ బ్లాక్ లిస్ట్ ను విదించినట్టు ఐఐటీ మద్రాస్ ట్రైనింగ్ అండ్ ప్లేస్ మెంట్ అడ్వైజర్ వీ.బాబు తెలిపారు. అయితే ఏయే కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టారో ఆ కంపెనీ వివరాలను వెల్లడించలేదు. ఏడాది పాటు ఈ కంపెనీలు ఐఐటీల్లో ప్లేస్ మెంట్లు నిర్వర్తించకుండా బ్లాక్ లిస్ట్ కొనసాగుతాయని తెలిపారు. ఇటీవలే ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ సంస్థ ఉద్యోగాలిస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా స్పందించకపోవడంతో, ఐఐటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఐఐటీ గౌహతి క్యాంపస్ లో ఐదుగురు విద్యార్థులకు జింప్లీ సంస్థ, ఐఐటీ బొంబాయి క్యాంపస్ లో ఏడుగురు విద్యార్థులకు పోర్టియా అండ్ పెప్పర్ సంస్థ జాబ్ ఆఫర్లు ప్రకటించి, ఫిబ్రవరి మధ్యలో విత్ డ్రా చేసుకుంది.