breaking news
Wireless subscribers
-
దేశంలో వైర్లెస్ సబ్స్క్రైబర్ల సంఖ్య ఎంతంటే..
టెలికాం సేవల వినియోగదారుల్లో వైర్లెస్ సబ్స్క్రైబర్ల సంఖ్య మార్చిలో పెరిగి మొత్తం 116.37 కోట్లకు చేరుకుంది. ఇది ఫిబ్రవరిలో 116.33 కోట్లుగా ఉంది. ఈమేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వివరాలు వెల్లడించింది. ముఖ్యంగా గ్రామీణ సబ్ స్క్రిప్షన్లు పెరగగా, పట్టణ సబ్ స్క్రిప్షన్లు స్వల్పంగా తగ్గాయని తెలిపింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌లు భారత టెలికాం పరిశ్రమలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ చందాదారుల చేరికల్లో అగ్రగామిగా నిలిచాయి.భౌగోళికంగా ఢిల్లీ సర్వీస్ సెంటర్ అత్యధిక టెలి-సాంద్రతను కలిగి ఉంది. అంటే యూనిట్ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో మొబైల్ చందాదారులను కలిగి ఉండడం. బిహార్ అతి తక్కువ టెలి-సాంద్రతను నమోదు చేసింది. పెరుగుతున్న సబ్‌స్రైబర్ల సంఖ్య దేశంలో కొనసాగుతున్న డిజిటల్ పరివర్తనను హైలైట్ చేస్తుంది. ఎక్కువ మంది గ్రామీణ వినియోగదారులు ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. యూజర్ డెమోగ్రాఫిక్స్, నెట్వర్క్ డిమాండ్లకు సంబంధించి టెలికాం ఆపరేటర్లు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాల్సి ఉంది.ఇదీ చదవండి: 27 ఎయిర్‌పోర్ట్‌లు, 430 విమానాలు నిలిపివేతవైర్లెస్ సబ్‌స్రైబర్ల సంఖ్య పెరగడం చాలా అంశాలను ప్రభావితం చేస్తుంది. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో మెరుగైన కనెక్టివిటీకి అవకాశం అందిస్తుంది. ఆన్లైన్ బ్యాంకింగ్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వ సేవలు ఎక్కువ మంది పొందేందుకు వీలవుతుంది. ఈ-కామర్స్, ఫిన్ టెక్, డిజిటల్ ఎంటర్టైన్మెంట్ రంగాలు వృద్ధి చెందుతాయి. మొబైల్ వినియోగదారులకు సేవలందించే వ్యాపారాలు.. ముఖ్యంగా మొబైల్ అప్లికేషన్లు, స్ట్రీమింగ్ సేవలు, డిజిటల్ సర్వీసులు పెరుగుతాయి. హై-స్పీడ్ కనెక్టివిటీని నిర్ధారించడానికి నెట్వర్క్ విస్తరణకు, 5జీ వినియోగానికి టెలికాం ప్రొవైడర్లు మరింత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. -
జియోకు భారీ షాకిచ్చిన యూజర్లు..!
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోకు యూజర్లు భారీ షాక్‌ను ఇచ్చారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో గణనీయంగా వైర్లెస్ యూజర్లను జియో కోల్పోయింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విడుదల చేసిన డేటా ప్రకారం...సెప్టెంబర్ నెలలో రిలయన్స్ జియో దాదాపు 1.9 కోట్ల మంది చందాదారులను కోల్పోయింది. అదే సమయంలో 2.74 లక్షల మంది కొత్త సబ్స్క్రైబర్లను భారతీ ఎయిర్టెల్ సొంతం చేసుకుంది. చదవండి: యాపిల్ ఉద్యోగుల శాలరీ ఎంతో తెలిస్తే షాకే..! మరోవైపు వొడాఫోన్ ఐడియా కూడా సెప్టెంబర్ నెలలో 10.7 లక్షల మంది వీఐను వీడారు. గత పదకొండు నెలలనుంచి యూజర్లు వోడాఫోన్ ఐడియాను వీడుతూనే ఉన్నారు. సెప్టెంబర్‌లో ఎయిర్టెల్ 0.08 శాతం కొత్త యూజర్‌బేస్‌తో నిలవగా...జియో 4.29శాతం మేర క్షీణించింది. ఇకపోతే వైర్లెస్ సబ్‌స్రైబర్స్ మార్కెట్లో మొత్తంగా చూసుకుంటే ఆగస్టులో 1.18 బిలియన్ల నుంచి సెప్టెంబర్ చివరి నాటికి 1.16 బిలియన్లకు చందాదారుల సంఖ్య పడిపోయింది. భారతీ ఎయిర్టెల్ తన మొబైల్ ప్లాన్స్ ధరలను కనీసం 20 శాతం మేర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఎయిర్టెల్ కస్టమర్లు వేరే నెట్‌వర్క్‌కు వెళ్లే అవకాశం లేకపోలేదని నిపుణులు భావిస్తున్నారు. చదవండి: రిలయన్స్‌తో డీల్ క్యాన్సల్..! భారత్‌ను వదులుకునే ప్రసక్తే లేదు...! -
టెలిఫోన్ యూజర్లు @105.92 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలోని మొత్తం టెలిఫోన్ యూజర్ల సంఖ్య ఏప్రిల్‌లో 105.92 కోట్లకు చేరింది. మార్చి చివరి నాటికి వీరి సంఖ్య 105.88 కోట్లుగా ఉందని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తెలిపింది. వైర్లెస్ సబ్స్క్రైబర్లు 103.36 కోట్ల నుంచి 103.42 కోట్లకు పెరిగారు. వీరిలో ప్రైవేట్ టెల్కోల వాటా 91.20 శాతంగా.. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వాటా 8.80 శాతంగా ఉంది. వైర్‌లైన్ యూజర్ల సంఖ్య 2.52 కోట్ల నుంచి 2.50 కోట్లకు తగ్గింది. ఇక ఎయిర్టెల్ వినియోగదారుల సంఖ్య 9.78 లక్షల పెరుగుదలతో 25.22 కోట్లకు పెరిగింది. రిలయన్స్ యూజర్ల సంఖ్య 1.1 లక్షల వృద్ధితో 10.25 కోట్లకు, వోడాఫోన్ సబ్స్క్రైబర్ల సంఖ్య 46,660 పెరుగుదలతో 19.79 కోట్లకు ఎగసింది.