breaking news
wife burn
-
కిరోసిన్ పోసుకుని మహిళ ఆత్మహత్య
సాక్షి, గూడూరు : భార్యాభర్తలు గొడవ పడిన ఘటనలో ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకొని కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని గుండెంగలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం...నెక్కొండ మండలం చంద్రుగొండకు చెందిన నర్సింగోజు రాజు, భవాని (38) దంపతులు 10 సంవత్సరాల క్రితం మండలంలోని గుండెంగకు వచ్చి ఆర్ఎంపీ వైద్యం చేసుకుంటూ స్థిర పడ్డారు. కొన్ని రోజులు గా భార్యాభర్తల నడుమ కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం రాజు, భవాని గొడవపడ్డారు. భర్తతో గొడవ పడిన భవాని ఆవేశానికి గురై ఇంట్లో ఉన్న కిరోసిన్ డబ్బా పట్టుకొని పక్కనే ఉన్న బాత్రూంలోకి వెళ్లి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. మంటలతో కేకలు వేయగా రాజు వెంటనే వెళ్లి మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు. దీంతో అతని చేతులు, ముఖం కాలింది. స్థానికులు అక్కడకు చేరుకుని భవానిని చికిత్స నిమిత్త నర్సంపేటకు తరలించారు. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ భవాని మృతిచెందింది గ్రామస్తులు తెలిపారు. -
భార్యపై కిరోసిస్ పోసి తగులబెట్టిన భర్త
మెదక్: పచ్చగా సాగాల్సిన ఓ సంసారం కుటుంబ కలహాలతో బుగ్గిపాలైంది. దంపతుల సంసారంలో చోటుచేసుకున్న మనస్పర్థల కారణంగా భార్య ప్రాణాలను కోల్పోయింది. దంపతుల మధ్య గొడవలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో.. చివరకు విచక్షణ కోల్పోయిన భర్త భార్యపై కిరోసిన్ పోసి తగులబెట్టాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని టేక్మాల్ మండలం సురంపల్లిలో బుధవారం వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.