breaking news
white colour
-
ఇదేం వింత.. చేతి వేళ్లు ఈ రంగులో ఉన్నాయేంటి?
సాధారణంగా అందరి చేతికి అయిదు వేళ్లు ఉంటే కొంతమందికి ఆరు వేళ్లు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే వేళ్ల సైజులలో కాస్తా అటుఇటుగా కూడా ఉండొచ్చు. మరి అవి ఏ కలర్లో ఉంటాయి.. ఎవరూ ఏ రంగులో ఉంటే దాదాపు వేళ్లు అదే రంగులో ఉంటాయని అనుకుంటున్నారా.. అవును ప్రత్యేకంగా వాటికంటూ ఒక రంగు ఏమీ ఉండదు కదా. ఇప్పటి వరకు అలాగే అనుకున్నాం. కానీ ఓ మహిళ వేళ్లు చూశాకా ఈ అభిప్రాయం మార్చుకోవచ్చు. ఎవరికి చూడని వింతంగా మహిళ చేతి రెండు వేళ్లు అప్పుడప్పుడు తెల్లగా మారుతుంటాయి. ఇందుకు ఓ కారణం కూడా ఉంది. మోనికా అనే మహిళ రేనాడ్స్ సిండ్రోమ్ అనే ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది. ఇది రక్తనాళాలపై అరుదుగా ప్రభావం చూపుతుంది. చేతి వేళ్ళ రక్త ప్రసారం చేసే నాళాలు చాలా సన్నగా ఉండటంతో రక్త ప్రసరణ సరిగా అందకపోవడం వల్ల చేతి లేదా కాలి వేళ్లు ఇలా తెల్లగా మారుతాయట. అయితే మోనికాకు చలిగా అనిపించినప్పుడు, ఏదైనా ఒత్తిడికి గురైనప్పుడల్లా వేళ్లు పూర్తిగా తెల్లగా వైట్‌గా మారుతాయి. ఈ విషయాన్ని ఆమె కూతురు జూలీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరలవుతోంది. మొదట ఎప్పుడో ఒకసారి ఇలా మారితో ప్రస్తుతం ఆమె వేళ్లు పూర్తిగా మొద్దుబారాయిని తెలిపారు. జనవరిలో అయితే వేళ్ళు మరింత తెల్లగా ఉంటాయని , తిరిగి మామూలు రంగులోకి వచ్చిన సమయంలో మరింత నొప్పిగా ఉంటాయని తెలిపారు. అయితే దీనికి ఏ వైద్యం లేదని వైద్యులు చెప్తున్నారు. ఆమె చేతి నరాల్లో ఉన్న సమస్య కారణంగానే అలాంటి పరిస్థితి ఉంటుందని వైద్యులు తెలిపారు. చదవండి: మే 2న ఎన్నికల కౌంటింగ్‌పై ఈసీ కీలక నిర్ణయం మాస్క్‌లాగా పెయింటింగ్.. దిమ్మతిరిగే షాకిచ్చిన అధికారులు -
బుద్ధుడికి మబ్బుల పందిరి
ధ్యానం చేస్తున్న బుద్ధుడిని కారుమబ్బులు కమ్మేస్తున్నాయి కాదూ.. ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన అమరావతిలో 125 అడుగుల ఎత్తులో నిర్మితమైన శ్వేతవర్ణ ధ్యానబుద్ధుడి విగ్రహం వద్ద శనివారం సాయంత్రం ఆకాశంలో నల్లని మేఘాలు అలముకోవడంతో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. నల్లని మబ్బుల కింద శ్వేతవర్ణంలోని బుద్ధుడి విగ్రహం దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపించింది. – అమరావతి -
కాజేయ్.. దాచెయ్!
అమాయకుల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్నారు కొందరు దళారులు. హోదా, ఉద్యోగం, డబ్బు ఎర చూపి కొందరు, చిట్టీల వ్యాపారం పేరుతో కొందరు వారిని నిలువునా ముంచుతున్నారు. ఇలా వైట్‌కాలర్ నేరాలకు మిర్యాలగూడ అడ్డాగా మారింది. ఇక్కడ అమాయక ప్రజల నుంచి కోట్లాది రూపాయలు కాజేస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. - న్యూస్‌లైన్, మిర్యాలగూడ నెల రోజుల కాలంలోనే మిర్యాలగూడ కేంద్రంలో పలు వైట్ కాలర్ నేరాలు చోటు చేసుకున్నాయి. దాంతో ఎంతో మంది అమాయకులు ఆర్థికంగా నష్టపోయారు. మిర్యాలగూడ పట్టణంలోని ఇండస్ఇండ్ బ్యాంకులో పనిచేస్తున్న మేనేజర్ చైతన్య నకిలీ డిపాజిట్ పత్రాలు ఇచ్చి ఖాతాదారుల నుంచి 42 లక్షల రూపాయలు కాజేశాడు. ఈ విషయం బ్యాంకు రీజినల్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చిన విషయం విదితమే. నకిలీ పత్రాలు ఇచ్చిన విషయం బ్యాంకు అధికారుల లెక్కల్లో తేలినా.. ఖాతాదారులకు ఖాళీ చెక్కులు ఇవ్వడంతోపాటు ఎలాంటి రశీదులూ ఇవ్వకుండా సుమారుగా 1.80 కోట్ల రూపాయలు కాజేసినట్లు సమాచారం. సోమవారం బాధితులు కొంతమంది బ్యాంకు ఎదుట ధర్నాకు దిగారు. మరికొంతమంది ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారని సమాచారం. మోసపోయిన ఖాతాదారుల్లో పట్టణానికి చెందిన కొంతమంది రైస్ మిల్లర్లు, డాక్టర్లు కూడా ఉన్నట్లు తెలిసింది. ఉద్యోగాల పేరిట మోసం.. ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి మోసానికి పాల్పడుతున్న వ్యక్తిపై గత నెలలో హుజూర్‌నగర్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. మిర్యాలగూడ పట్ణణానికి చెందిన ఒక వ్యక్తి వివిధ శాఖలలో ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి వద్ద 1.25 లక్షల రూపాయల చొప్పున రూ.38 లక్షలు వసూలు చేశారు. కాగా సంవత్సరాలు గడిచినా ఉద్యోగాలిప్పించకపోవడంతో నిరుద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా పట్టణంలోని విద్యానగర్ కాలనీలో పది రోజుల క్రితం చిట్టీల వ్యాపారం చేస్తున్న ఓ మహిళ సుమారుగా కోటి రూపాయలతో పరారీ అయ్యింది. కాగా ఆమె వద్ద చిట్టీలు వేసేవారంతా మహిళలే. వారంతాలబోదిబోమని మొత్తుకున్నా విషయం పోలీసుల వరకు వెళ్లలేదు. అదే విధంగా నెల రోజుల క్రితం సీతారాంపురానికి చెందిన మరో మహిళ సుమారు 10 లక్షల రూపాయల వరకు అప్పులు చేసి పరారీ అయినట్లు తెలిసింది. బీసీల పేరుతో అధిక వడ్డీలు.. పట్టణంలో వడ్డీ వ్యాపారులు విపరీతంగా పెరిగిపోయారు. బార్కటింగ్ (బీసీ)ల పేరుతో అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు. చిరు వ్యాపారులకు ఉదయం వేళలో 900 రూపాయలు ఇచ్చి సాయంత్రం వేళలో రూ.వెయ్యి తీసుకుంటున్నారు. అంతే కాకుండా బడా వ్యాపారులు సైతం లక్షల్లో డబ్బులు బీసీలకు తీసుకుంటున్నారు. అధిక వడ్డీలు చెల్లించలేని వారినుంచి వ్యాపారులు బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేస్తున్నారు.