breaking news
Westindies series
-
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్!
టీ20 ప్రపంచకప్-2022కు ముందు ఆస్ట్రేలియా మరో కీలక పోరుకు సిద్దమైంది. స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా తలపడనుంది. అయితే ఈ సిరీస్‌కు గాయం కారణంగా ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ దూరమయ్యాడు. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 శుక్రవారం గోల్డ్ కోస్ట్ వేదికగా జరగనుంది. ఈ క్రమంలో అయితే స్టోయినిస్ మాత్రం గోల్డ్ కోస్ట్‌కు ఆస్ట్రేలియా జట్టుతో వెళ్లకుండా పెర్త్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా.. ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. పెర్త్ వేదికగా ఆదివారం(ఆక్టోబర్ 9)న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. కాగా ఈ సిరీస్‌కు స్టోయినిస్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు టీమిండియాతో టీ20 సిరీస్‌కు దూరమైన ఆసీస్ స్టార్ డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్.. విండీస్‌తో సిరీస్‌కు జట్టులోకి వచ్చారు. ఇక స్వదేశంలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఈ మెగా ఈవెంట్లో ఆసీస్ తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్22న న్యూజిలాండ్‌తో తలపడనుంది. వెస్టిండీస్ సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), సీన్ అబాట్, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, డేనియల్ సామ్స్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాత్త్ వేడ్ , డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా. చదవండి: రోహిత్, కోహ్లి, సూర్య కాదు.. వరల్డ్ టాప్-5 టీ20 ఆటగాళ్లు వీరే! -
జహీర్, హర్భజన్‌కు మరోసారీ..
వెస్టిండీస్‌తో వచ్చే నెల 6 నుంచి జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. గురువారమిక్కడ సమావేశమైన భారత సెలెక్షన్ కమిటీ ధోనీ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు. వెటరన్ బౌలర్లు జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్‌లకు జట్టులో చోటు దక్కలేదు. భుజం నొప్పితో బాధపడుతున్న రవీంద్ర జడేజాకు విశ్రాంతినిచ్చారు. ఓపెనర్ శిఖర్ ధవన్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. బ్యాటింగ్ దిగ్గజం సచిన్ తన చరిత్రాత్మక 200 వ టెస్టు ఆడుతుండటంతో ఈ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. జట్టు: ధోనీ (కెప్టెన్), ధవన్, మురళీ విజయ్, పుజారా, సచిన్, కోహ్లీ, అశ్విన్, భువనేశ్వర్, ఓఝా, అమిత్ మిశ్రా, రహానె, ఉమేష్, మహ్మద్ షమీ, రోహిత్, ఇషాంత్.