breaking news
West Indies vs Nepal
-
నేపాల్ సంచలన విజయం.. వెస్టిండీస్‌కు ఘోర పరాభవం
నేపాల్ క్రికెట్ జట్టు సంచలన విజయం సాధించింది. తొలి టీ20లో వెస్టిండీస్ (WI vs NEP 1st T20)ను 19 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా టెస్టు హోదా ఉన్న జట్టుపై తొలిసారి గెలుపు రుచి చూసింది. కాగా వెస్టిండీస్- నేపాల్ జట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్నాయి.ఇందులో భాగంగా షార్జాలో శనివారం రాత్రి తొలి టీ20 జరిగింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. నేపాల్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే, ఓపెనర్లు కుశాల్ భుర్తేల్ (6), ఆసిఫ్ షేక్ (3) పూర్తిగా విఫలం కాగా నేపాల్ కష్టాల్లో పడింది.148 పరుగులుఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ రోహిత్ పౌడేల్ (Rohit Paudel) నిలకడగా ఆడుతూ 21 బంతుల్లో 30 పరుగులు సాధించాడు. మరోవైపు.. గుల్షాన్ ఝా (16 బంతుల్లో 22), దీపేంద్ర సింగ్ (17) ఫర్వాలేదనిపించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నేపాల్ 148 పరుగులు చేయగలిగింది.ఊహించని షాక్వెస్టిండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. నవీన్ బిడైసీ మూడు వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అకీల్ హొసేన్‌కు ఒక వికెట్ దక్కింది. అయితే, నామమాత్రపు లక్ష్యంతో ఛేదనకు దిగిన వెస్టిండీస్‌కు నేపాల్ ఊహించని షాకిచ్చింది.నేపాళ్ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన విండీస్.. 129 పరుగుల వద్ద నిలిచిపోయింది. టాపార్డర్‌లో ఓపెనర్లు కైల్ మేయర్స్ (5), ఆమిర్ జంగూ (19).. అకీమ్ ఆగస్టీ (15) విఫలమయ్యారు. మిగతావారిలో జువెల్ ఆండ్రూ (5), కేసీ కార్టీ (16) తేలిపోగా.. నవీన్ బిడైసీ 22 పరుగులతో విండీస్ టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు.మిగిలిన వారిలో ఫాబియాన్ అలెన్ 19, అకీల్ హొసేన్ 18 పరుగులు చేయగలిగారు. నేపాల్ బౌలర్లలో కుశాల్ భుర్తేల్ రెండు వికెట్లు తీయగా.. దీపేంద్ర సింగ్, కిరణ్ కేసీ, నందన్ యాదశ్, లలిత్ రాజ్‌బన్షీ, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ రోహిత్ పౌడేల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. వీరంతా సమిష్టిగా రాణించి నేపాల్‌కు చారిత్రాత్మక విజయం అందించారు.180 మ్యాచ్‌ల తర్వాత..టెస్టు హోదా ఉన్న జట్టుపై నేపాల్‌కు ఇదే తొలి విజయం. ఇందుకోసం నేపాల్‌కు ఏకంగా 180 అంతర్జాతీయ మ్యాచ్‌లు అవసరం కాగా.. నేపాల్ చేతిలో ఓడిన తొలి ఫుల్ మెంబర్ జట్టుగా విండీస్ చెత్త రికార్డును మూటగట్టుకుంది.ఇక 2022 టీ20 వరల్డ్‌కప్ సందర్భంగా విండీస్.. నేపాల్ మాదిరే అసోసియేట్ జట్టు అయిన స్కాట్లాండ్ చేతిలో ఓడింది. 2014లో ఐర్లాండ్, 2016లో అఫ్గనిస్తాన్ చేతిలోనూ పరాజయం చవిచూసింది. అప్పటికి ఈ రెండు జట్లు అసోసియేట్ టీమ్‌లే కావడం గమనార్హం. The team from the Land of Everest scales another summit 🧗Nepal shock West Indies by 19 runs in Sharjah 🇳🇵🔥#NEPvWI pic.twitter.com/jfPGN6sTOq— FanCode (@FanCode) September 27, 2025 -
వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్
నేపాల్‌తో టీ20 సిరీస్‌కు వెస్టిండీస్ (WI vs NEP) క్రికెట్ తమ జట్టును ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ షాయీ హోప్‌నకు విశ్రాంతినిచ్చిన విండీస్ బోర్డు.. అతడి స్థానంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ అకీల్ హొసేన్ (Akeal Hosein)కు బాధ్యతలు అప్పగించింది.కాగా షార్జా వేదికగా వెస్టిండీస్ జట్టు నేపాల్‌తో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబరు 27, 28, 30 తేదీల్లో మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో విండీస్ బోర్డు గురువారం తమ జట్టును ప్రకటించింది.ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటుకెప్టెన్ షాయి హోప్ (Shai Hope)తో పాటు పేసర్ అల్జారీ జోసెఫ్, బ్యాటర్ జాన్సన్ చార్లెస్ వంటి కీలక ప్లేయర్లకు కూడా సెలక్టర్లు రెస్ట్ ఇచ్చారు. అయితే, ఈ సిరీస్‌లో అకీల్ హొసేన్ సారథ్యంలో జేసన్ హోల్డర్, ఫాబియాన్ అలెన్, కైల్ మేయర్స్ వంటి వారు ప్రధాన భూమిక పోషించేందుకు సిద్ధమయ్యారు.ఇక ఏకంగా ఐదుగురు వెస్టిండీస్ ఆటగాళ్లు నేపాల్‌తో సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టేందుకు సన్నద్ధంగా ఉన్నారు. బ్యాటర్ అకీమ్ ఆగస్టీ, ఆల్‌రౌండర్ నవీన్ బిడైసీ, స్పిన్నర్ జీషన్ మొతారా, పేసర్ రామోన్ సైమండ్స్, కీపర్ అమీర్ జాంగూ (టీ20 అరంగేట్రం)లకు తొలిసారి ఈ జట్టులో చోటు దక్కింది.నేపాల్‌తో టీ20 సిరీస్‌కు వెస్టిండీస్ జట్టుఅకీల్ హొసేన్ (కెప్టెన్), ఫాబియాన్ అలెన్, జువెల్ ఆండ్రూ, అకీమ్ ఆగస్టీ, నవీన్ బిడైసీ, జెడియా బ్లేడ్, కేసీ కార్టీ, కరీమా గోరె, జేసన్ హోల్డర్, అమీర్ జాంగూ, కైల్ మేయర్స్, ఒబెడ్ మెకాయ్, జీషన్ మొతారా, రామోన్ సైమండ్స్, షమార్ స్ప్రింగర్.ఇదిలా ఉంటే.. ఈ సిరీస్ తర్వాత.. సీనియర్లతో కూడిన వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత పర్యటనకు వెళ్లనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా టీమిండియాతో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే విండీస్ తమ జట్టు వివరాలను వెల్లడించింది.టీమిండియాతో టెస్టులకు విండీస్ జట్టు వివరాలురోస్టన్ ఛేజ్ (కెప్టెన్), తేజ్ నారాయణ్ చందర్‌పాల్, బ్రెండన్ కింగ్, కెవ్లాన్ అండర్సన్, షై హోప్, జాన్ క్యాంప్‌బెల్, అతనాజ్, ఇమ్లాక్, గ్రీవ్స్, అండర్సన్ ఫిలిప్, అల్జారి జోసెఫ్, షామర్ జోసెఫ్, జేడెన్ సీల్స్, ఖారీ పైర్, జోమెల్ వారికాన్. చదవండి: ఒక్కోసారి ఒంటె మీద కూర్చున్నా.. కుక్కకాటు తప్పదు!


