breaking news
weighing
-
తూకంలోనూ తినేస్తున్నారొయ్యా!
ఎండనకా.. వాననకా.. నకిలీలు, వైరస్లు, వాతావరణ మార్పుల నడుమ దినదిన గండాలను దాటుకుని రొయ్యల్ని పెంచితే.. గోతికాడ నక్కల్లా ఆక్వా రైతుల కష్టాన్ని దళారులు దోచేస్తున్నారు. ఇప్పటివరకు ఫీడ్, సీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఎక్స్‌పోర్టర్స్ రైతులను వివిధ రూపాల్లో ముంచేస్తున్నారు. తాజాగా రొయ్యల పట్టుబడి తూకంలోనూ మోసాలకు పాల్పడుతూ టన్నుకు 60 కేజీలు కాజేస్తున్న వైనం పశ్చిమగోదావరి జిల్లాలో వెలుగు చూసింది. తూకాల్లో మోసాలపై చర్యలు చేపట్టి రొయ్యల రైతులను రక్షించాలంటూ ఆక్వా రైతు సంఘం నాయకులు కలెక్టర్ సీహెచ్ నాగరాణికి వినతిపత్రం సమర్పించారు. – సాక్షి, భీమవరంఇలా మోసగిస్తున్నారురొయ్యల కొనుగోలుదారులు తూకంలో చేస్తున్న మోసం పాలకొల్లు నియోజకవర్గం మేడపాడులో బయటపడింది. సాధారణంగా ఎల్రక్టానిక్ కాటాల్లో కేజీలు, లీటర్లలో కొలిచేందుకు వీలుగా ‘మోడ్ బటన్’ ఉంటుంది. అవసరాన్ని బట్టి ఈ బటన్‌ను కేజీలు, లీటర్లలోకి సెట్ చేసుకోవచ్చు. దీనిని ఉపయోగించి వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నట్టు ఆక్వా రైతులు గుర్తించారు. కేజీ మోడ్‌లో ఉంచితే 1,000 గ్రాములకు కిలోగా డిస్ప్లేలో చూపిస్తుంది. దానిని లీటర్ల మోడ్‌లోకి మారిస్తే 9,400 గ్రాములు చూపిస్తుంది. అంటే రైతులు 100 కిలోల (క్వింటాల్) రొయ్యలను తూకం వేయిస్తే 94 కిలోలు మాత్రమే చూపుతుంది. క్వింటాల్‌కు 6 కిలోల చొప్పున టన్నుకు 60 కిలోల రొయ్యలను దళారులు, కంపెనీలు రైతుల నుంచి దోచేస్తున్నాయి. ఎల్రక్టానిక్ కాటా లీటర్ల మోడ్‌లో ఉన్నప్పుడు డిస్ప్లే మొదటిలో ‘ఎల్’ ఇండికేషన్ వస్తుంది. ఇది కనిపించకుండా ఉండేందుకు ‘ఎల్’ ఇండికేషన్ స్థానంలో బ్లాక్ స్టిక్కర్‌ను అతికిస్తున్నారు. దీనివల్ల ‘ఎల్’ సింబల్ కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. కాటా మోసాల వల్ల రొయ్యల కౌంట్, ధరను బట్టి టన్నుకు రూ.13 వేల నుంచి రూ.20 వేల చొప్పున రూ.కోట్లల్లో దోచేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు, పప్పు దినుసులు, అన్నిరకాల వ్యాపారాల్లోనూ ఈ తరహా కాటా మోసాలు జరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు.అడ్డుకోవాలని అధికారులకు వినతికాటా మోసాలకు తూనికలు, కొలతల శాఖ అధికారులు చెక్ పెట్టాలని ఆక్వా రైతులు డిమాండ్ చేస్తున్నారు. కేజీల్లో తూకం వేసే కాటాలకు కేజీ మోడ్ మాత్రమే ఉండేలా చూడాలని, వాటికి సీళ్లు, కచి్చతమైన ప్రమాణాలు పాటించేలా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని కోరుతున్నారు. రైతుల ఫిర్యాదులపై స్పందించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని, కాటా మోసాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆక్వా రైతు సంఘం నాయకులు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సీహెచ్ నాగరాణికి వినతిపత్రం అందజేశారు. కాగా.. రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా దోపిడీ జరుగుతోందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ మోసం జరిగే తీరును వివరిస్తూ పాలకొల్లుకు చెందిన జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం నాయకులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాటా మోసం కళ్లారా చూశాం ఇప్పటివరకు కాటా మోసం గురించి వినడమే గానీ.. ఎలా చేస్తారో తెలిసేది కాదు. కాటాకు చిన్న స్టిక్కర్ అతికించి రైతుల కష్టాన్ని దారుణంగా దోచేస్తున్నారు. ఈ తరహా మోసాలు ఒక్క ఆక్వాలోనే కాకుండా ఇతర వ్యాపారాల్లోనూ జరిగేందుకు అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం తనిఖీలు చేయించి ప్రజలు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి. – తులసి రాంబాబు, ఆక్వా రైతు సంఘం నేత, వీరవాసరం కాటాలకు కేజీ ఆప్షన్ మాత్రమే ఉంచాలి అటు వైరస్లు, ఇటు ధరల పతనం, సిండికేట్ల దోపిడీతో రొయ్యల రైతులు నష్టపోతుంటే కాటా మోసాలు మమ్మల్ని మరింత కుంగదీస్తున్నాయి. రొయ్యల పట్టుబడికి వినియోగించే కాటాలకు కేవలం కేజీ ఆప్షన్ మాత్రమే ఉండేలా చూడాలి. కాటా మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు తూనికలు, కొలతల శాఖ అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలి. – జీకేఎఫ్ సుబ్బరాజు, కార్యదర్శి, జిల్లా రొయ్య రైతుల సంక్షేమ సమాఖ్య, భీమవరం -
'తూతూమంత్రంగా' స్టాంపింగ్..! తీరా సీల్ వేశాక?
నిర్మల్: పట్టణంలోని పలు జిన్నింగ్ మిల్లులతోపాటు పెట్రోల్‌బంక్‌లో తూనికలు, కొలతల శాఖ జిల్లా అధికారులు గురువారం జరిపిన తనిఖీలు అనుమానాలకు తావిస్తున్నాయి. కాంటాలకు(వేబ్రిడ్జి), పెట్రోల్‌బంక్ యంత్రాలకు స్టాంపింగ్ వేసేందుకు వచ్చిన సదరు జిల్లా ఇన్చార్జి అధికారి తన అధికారిక వాహనం దిగకుండానే మమ అనిపించారు. ఆమె వెంట వచ్చిన డ్రైవర్, టెక్నీషియన్ మాత్రమే కాంటాలకు ఉన్న పాత సీల్ తొలగించి కొత్త సీల్ వేశారు. ఎలాంటి పత్రాలు పరిశీలించకుండానే సీల్ వేయడం, తీరా సీల్ వేశాక కూడా సంబంధిత పత్రాలు అందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలు ఇలా.. నిబంధనల ప్రకారం కొత్త స్టాంపింగ్ వేసే సమయంలో కాంటాలపై తూకం బాట్లు పెట్టి మాన్యువల్‌గా తనిఖీ చేయాలి. కానీ ఇన్చార్జి అధికారి అలాంటిదేమీ లేకుండా నామమాత్రంగా సీల్ వేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయి. తూకాల్లో ఎలాంటి మోసాలు జరుగకుండా రైతులకు అవగాహన కల్పించాల్సిన అధికారులు.. ఇలా కాంటాలకు స్టాంపింగ్ వేయడంపై రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై సంబంధిత తూనికలు, కొలతల అధికారి భూలక్ష్మిని కలిసి వివరణ కోరగా, తాను భైంసాలోని పెట్రోల్‌బంక్‌లో స్టాంపింగ్ గడువు ముగియడంతో వారి అభ్యర్థన మేరకు మాత్రమే వచ్చానని తెలిపారు. మరెక్కడా స్టాంపింగ్ చేయలేదని పేర్కొన్నారు. కాగా, జిన్నింగ్ మిల్లుల్లో సైతం స్టాంపింగ్ చేశారు కదా అని ప్రశ్నించగా, సమాధానం దాటవేశారు. -
కిలో చికెన్ @ 900 గ్రాములే..!
సాక్షి, హైదరాబాద్: కిలో అంటే వెయ్యి గ్రాము లు కదా... కానీ, చికెన్, మటన్ షాపుల్లో కిలో అంటే 900 గ్రాములే... అవును, ఇది నిజమే. చికెన్, మటన్‌షాపుల్లో వినియోగదారులకు దక్కేది అంతే. 10కిలోలు తీసుకుంటే కిలో తక్కువ తూకం వస్తుంది. చికెన్, మటన్ షాపు ల్లోని ఎలక్ట్రానిక్ కాంటా సెట్టింగ్‌లో ఫిట్టింగ్ ఇది. కాంటాలో చూడటానికి కిలో చికెన్ 1,000 గ్రాముల డిస్ప్లే ఉంటుంది. పాతకాలపు నాటి త్రాసు కాదు కదా.. ఎలక్ట్రానిక్ కాంటా కదా. చేతివాటం ఉండదని వినియోగదారులు నమ్మి మోసపోతున్నారు. రాష్ట్ర తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ ఆదేశాల మేరకు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో తూనికలు, కొలతల శాఖ బృందాలు జరిపా యి. ఈ సందర్భంగా పలు చికెన్, మటన్ సెం టర్లలో మోసాలు బయటపడ్డాయి. స్టాంపింగ్, రెన్యువల్ లేకుండా ఎలక్ట్రానిక్ కాంటాలు, వేయింగ్ మెషిన్లు వినియోగిస్తున్నట్లు గుర్తించి వాటిని సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో పలు చికెన్ సెంటర్లపై తూనికలు, కొలతల శాఖ ఇన్స్పెక్టర్ సంజయ్‌కృష్ణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా అలీ కేఫ్ వద్ద ఉన్న కేజీఎన్, న్యూ కేజీఎన్, ఫేమస్, రాయల్ చికెన్ సెంటర్లల్లో కిలోకి 100 గ్రాములు తక్కువగా తూకం వేస్తున్నట్లు గుర్తించారు. ఎలక్ట్రానిక్ కాంటాపై 900 గ్రాముల చికెన్ పెడితే 1,000 గ్రాములుగా డిస్ప్లే చూపిస్తోంది. అదే 1000 గ్రాముల చికెన్ పెడితే 1100 గ్రాములు డిస్ప్లే చూపిస్తోంది. దీంతో 100 గ్రాముల ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. 10 కిలోలకు కిలో చికెన్ తక్కువగా తూకం వస్తున్నట్లు పసిగట్టారు. దీంతో 10 కేసు లు నమోదు చేశారు. మరో ఆరుగురు దుకాణదారులు వేయింగ్ మెషిన్లను రెన్యువల్ చేయకుండానే వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అదేవిధంగా చికెన్, మటన్ మార్కెట్లు, సెంటర్లపై దాడులు చేసి యూసుఫ్‌గూడలో 13, ఫలక్‌నుమాలో 6, సికింద్రాబాద్‌లో 6 కేసులు నమో దు చేశారు. తూకం, మోసాలకు పాల్పడితే వినియోగదారులు తమకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఆ శాఖాధికారులు తెలిపారు. -
28వేల దిగువకు పసిడి?
ముంబై: డీమానిటైజేషన్ ఎఫెక్ట్ తో బంగారం పరుగుకు పగ్గాలు పడనున్నాయి. నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం వివిధ రంగాలపై అనుకూల, సానుకూల ప్రభావాన్ని చూపనుంది. ఈ క్రమంలో దేశీయ బంగారం ధరలు క్రమంగా దిగిరానున్నాయి. కొనుగోలు దారుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో పసిడి ధరలు డిసెంబర్ తరువాత పది గ్రా. పసిడి ధర రూ28,000 క్రిందికి దిగిరావచ్చని అంచనా వేస్తున్నారు డీమానిటైజేషన్ ప్రభావంతో బంగారం ధరలు గణనీయంగా పడిపోనున్నాయని, ప్రస్తుతం రూ.28,750 (పది గ్రాములు) గా ఉన్న ధరలు రూ 28,000 (పది గ్రాములు) కిందికి పడిపోనున్నాయంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు వివిధ రంగాల మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపిందని విశ్లేషకుల అంచనా. ముఖ్యంగా ముంబై ప్రఖ్యాత బంగారం మార్కెట్ జవేరీ బజార్ లో సగటున విక్రయాల నమోదు భారీగా క్షీణించింది. నోట్ద రద్దు తర్వాత రోజూ సగటున రూ 125 కోట్లుగా ఉండే అమ్మకాలు ప్రస్తుతం రూ .13 కోట్ల విలువ పడిపోయిందని బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. పాత బంగారం రీ సైకిల్, పెళ్లిళ్ల సందర్భంగా నెలకొన్న స్వల్ప కొనుగోళ్లు తప్ప పెద్దగా విక్రయాలు లేవని, డిమాండ్ గణనీయంగా తగ్గిందని ముంబై జ్యువెలర్స్ అసోసియేషన్ వైస్ ఛైర్మన్ కుమార్ జైన్ చెప్పారు. అలాగే నల్లకుబేరులు ఎక్కువగా బంగారం కొంటున్నారన్న నివేదికల నేపథ్యంలో ఐటీ దాడుల భయం కూడా తమని వెంటాడుతున్నట్టు వర్తకులు చెబుతున్నారు.అయితే నవంబరు డిశెంబరు నెలల్లో దేశవ్యాప్తంగా సుమారు 29 వేల పెళ్లిళ్లు జరగుతాయని, ఈ అంచనాలతోనే జవేరీ బజార్ లో 70 టన్నుల బంగారాన్ని స్టాక్ ఉంచుకున్నారు. సాధారణంగా త్రైమాసికంగా 30 టన్నులు బంగారాన్ని మాత్రమే దిగుమతి చేసుకుంటారు. కాగా డాలర్ ధరలు బాగా పుంజుకోవడంతో దేశంలో విలువైన లోహాలైన బంగారం, వెండి ధరలు స్తబ్దుగా ఉన్నాయి. అయితే సోమవారం డాలర్ కొద్దిగా వెనక్కి తగ్గడంతో వెండి, బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.