breaking news
Wedding Pullav
-
'వెడ్డింగ్ పులావ్' మూవీ రివ్యూ
టైటిల్: వెడ్డింగ్ పులావ్ జానర్: రొమాంటిక్ కామెడీ తారాగణం: అనుష్క రంజన్, దిగాంత్, సోనాలి సెహగల్, కరణ్ గ్రోవర్, రిషీ కపూర్. దర్శకత్వం: వినోద్ ప్రధాన్ నిర్మాత: శశీ రంజన్, అను రంజన్ అంతా కొత్తవారితో తెరకెక్కిన బాలీవుడ్ లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ వెడ్డింగ్ పులావ్. వినోద్ ప్రధాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓ పెళ్లి చుట్టూ తిరుగుతుంది. బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ ప్రచారంతో కాస్త హైప్ క్రియేట్ చేసిన వెడ్డింగ్ పులావ్ ఆడియన్స్ ను ఎంత వరకు మెప్పించిందో చూద్దాం. కథ : అనుష్క అలియాస్ లంబు (అనుష్క రంజన్), ఆదిత్య (దిగంత్) లు మంచి స్నేహితులు. ఎంతో స్నేహంగా ఉండే ఈ ఇద్దరు చాలా రోజుల తర్వాత తాము ప్రేమలో ఉన్నట్టు గుర్తిస్తారు. అయితే ఆ సమయానికి ఇద్దరికీ వేర్వేరుగా పెళ్లిళ్లు కుదురుతాయి. అనుష్కకు జై( కరణ్ గ్రోవర్)తో, ఆదిత్యకు రియా( సొనాలి సెహగల్)తో నిశ్చితార్థం అయిపోతుంది. ఆ తరువాత ఈ ఇద్దరు ప్రేమికులు ఏం చేశారు, తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారనేదే మిగతా కథ. విశ్లేషణ : కుచ్ కుచ్ హోతా హై లాంటి ఎన్నో బాలీవుడ్ సినిమాలు తెరకెక్కిన అదే పాత ఫార్ములాతో ఈ సినిమాను తెరకెక్కించారు. పంజాబీ వెడ్డింగ్ సెలబ్రేషన్ లో కాస్త ఫ్రెండ్ షిప్, ఇంకాస్త లవ్ స్టోరీ కలిపి సినిమాటిక్ గా చూపించారు. సినిమాలో ఒక్క రిషి కపూర్ తప్ప మిగతా అంతా కొత్తవారు కావటంతో నటీనటుల గురించి పెద్దగా చెప్పుకోవటానికి ఏమీ లేదు. ముఖ్యంగా లవ్ సీన్స్ పండించటంలో కొత్త తారలు ఫెయిల్ అయ్యారు. ప్లస్ పాయింట్స్ : రిషి కపూర్ క్యారెక్టర్ లొకేషన్స్ మైనస్ పాయింట్స్ : హీరో హీరోయిన్ల పర్ఫామెన్స్ రొటీన్ కథ, కథనం ఓవరాల్గా 'వెడ్డింగ్ పులావ్' ఏ సెక్షన్ ఆడియన్స్కు కూడా టేస్టీగా అనిపించటం లేదు. -
'పెళ్లికి కరెక్ట్ వయసు 32'
ముంబై: తనకింకా పెళ్లి వయసు రాలేదంటోంది బాలీవుడ్ భామ అలియా భట్. పెళ్లి పీటలెక్కడానికి కరెక్ట్ వయసు 32 అని చెప్పింది. తన స్నేహితురాలు అనుష్క రాజన్ హీరోయిన్ గా పరిచయం అవుతున్న 'వెడ్డింగ్ పలావ్' సినిమా ట్రైలర్ ను అలియా భట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తానింకా 'షాదీ కా లడ్డూ' టెస్ట్ చేయలేదని చెప్పింది. తన వయసు 22 అని, పెళ్లాడడానికి సరైన వయసు 32 ఏళ్లు అని పేర్కొంది. తనకు కాబోయే వాడు చూడడానికి బాగుండాలని, హాస్య చతురత కలిగినవాడై ఉండాలని తెలిపింది. తన ఇష్టాయిష్టాల గురించి తెలిసినవాడై ఉండాలని చెప్పింది. అక్షయ్ కుమార్, సిద్ధార్థ మల్హోత్రా సోదరులుగా నటించిన 'బ్రదర్స్' సినిమా చూసి భావోద్వేగానికి గురైయ్యానని వెల్లడించింది.