'పెళ్లికి కరెక్ట్ వయసు 32' | 32 is right age to get married, says Alia Bhatt | Sakshi
Sakshi News home page

'పెళ్లికి కరెక్ట్ వయసు 32'

Aug 21 2015 9:06 AM | Updated on Sep 3 2017 7:52 AM

'పెళ్లికి కరెక్ట్ వయసు 32'

'పెళ్లికి కరెక్ట్ వయసు 32'

తనకింకా పెళ్లి వయసు రాలేదంటోంది బాలీవుడ్ భామ అలియా భట్. పెళ్లి పీటలెక్కడానికి కరెక్ట్ వయసు 32 అని చెప్పింది.

ముంబై: తనకింకా పెళ్లి వయసు రాలేదంటోంది బాలీవుడ్ భామ అలియా భట్. పెళ్లి పీటలెక్కడానికి కరెక్ట్ వయసు 32 అని చెప్పింది. తన స్నేహితురాలు అనుష్క రాజన్ హీరోయిన్ గా పరిచయం అవుతున్న 'వెడ్డింగ్ పలావ్' సినిమా ట్రైలర్ ను అలియా భట్ విడుదల చేసింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... తానింకా 'షాదీ కా లడ్డూ' టెస్ట్ చేయలేదని చెప్పింది. తన వయసు 22 అని, పెళ్లాడడానికి సరైన వయసు 32 ఏళ్లు అని పేర్కొంది. తనకు కాబోయే వాడు చూడడానికి బాగుండాలని, హాస్య చతురత కలిగినవాడై ఉండాలని తెలిపింది. తన ఇష్టాయిష్టాల గురించి తెలిసినవాడై ఉండాలని చెప్పింది. అక్షయ్ కుమార్, సిద్ధార్థ మల్హోత్రా సోదరులుగా నటించిన  'బ్రదర్స్' సినిమా చూసి భావోద్వేగానికి గురైయ్యానని వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement