watch store
-
స్విస్ వాచీల స్టోర్స్ విస్తరణ.. కొత్తగా మరో ఆరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్విస్ లగ్జరీ వాచీల దిగ్గజం బ్రైట్లింగ్ వచ్చే ఏడాదిన్నర వ్యవధిలో కొత్తగా ఆరు బొటిక్ స్టోర్స్‌ను ఏర్పాటు చేయనుంది. దీంతో వీటి సంఖ్య 10కి చేరనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు పుణె తదితర నగరాల్లో నాలుగు బొటిక్ స్టోర్స్ ఉన్నట్లు బ్రైట్లింగ్ ఇండియా ఎండీ ప్రదీప్ భానోత్ తెలిపారు.దేశీయంగా స్విస్ వాచీల మార్కెట్ సుమారు రూ. 2,500 కోట్లుగా ఉంటోందని ఆయన చెప్పారు. పరిశ్రమ ఏటా సుమారు 15 శాతం ఎదుగుతుండగా, తాము అంతకు మించి వృద్ధిని నమోదు చేస్తున్నట్లు ప్రదీప్ చెప్పారు. స్మార్ట్ వాచీలు వచ్చినప్పటికీ .. హోదాకు నిదర్శనంగా ఉండే బ్రైట్లింగ్లాంటి లగ్జరీ వాచీల ప్రాధాన్యతను గుర్తించే వారు పెరుగుతున్నారని ఆయన తెలిపారు.అలాగే వాటిపై ఖర్చు చేసే సామర్థ్యాలు పెరుగుతుండటం కూడా వ్యాపార వృద్ధికి దోహదపడనుందని వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్ స్టోర్‌లో సుమారు రూ. 3.11 లక్షల నుంచి సుమారు రూ. 17 లక్షల పైచిలుకు విలువ చేసే వాచీలు అందుబాటులో ఉన్నాయి. 140 ఏళ్ల బ్రైట్లింగ్ చరిత్రలో అత్యంత ప్రాధాన్యమున్న వాచీలను ఇందులో మార్చి 25 వరకు ప్రదర్శిస్తున్నారు. -
సెల్‌ఫోన్ దెబ్బ..‘టైం’ బాగలేదు!
సాక్షి, కనగల్(నల్లగొండ) : సెల్‌ఫోన్ విప్లవంతో గడియారం టైం బాగోలేక విలవిల్లాడుతోంది. సెల్ఫోన్లోనే టైం చూపుతున్నందున ప్రజలు గడియారాలను వాడడం మానేస్తున్నారు. ఒకప్పుడు చేతికి వాచీ ఉంటే స్టేటస్ సింబల్.. ఇప్పడు చేతిలో సెల్‌ఫోన్ ఉంటే అదే ప్రపంచం. ఇలా కాలానుగుణంగా మారుతున్న లోకం పోకడలకు ఎన్నో వస్తువులు కనుమరుగువుతున్నాయి. అందులో మణికట్టు మణిహారం చేతిగడియారం ఒకటి. ఒకప్పుడు పెళ్లి కొడుకుకు గడియారం, సైకిల్, రేడియోను ఆడపెళ్లివారు పెట్టేవారు. అది ఎంతో గొప్పగా భావించేవారు. గడియారం పెట్టకపోతే పెళ్లిలు ఆగిన ఘటనలు ఉన్నాయి. ఇలా శతాబ్దాలుగా మనిషితో పెనవేసుకున్న గడియారం బంధాన్ని సెల్‌ఫోన్ తెంచేస్తోంది. మణిహారం చేతి గడియారం.. కొన్నేళ్ల క్రితం వరకు మణికట్టుకు మణిహారంగా చేతిగడియారం వెలిగిపోయేది. చేతికి గడియారం ఉంటే అదో స్టేటస్ సింబల్. గడియారంపై మమకారంతో ఇప్పటికీ కొందరు సీనియర్ సిటిజన్స్ చేతిగడియారాలను వాడుతున్నారు. మొబైల్ ఫోన్ రాకతో గడియారం స్థితిగతులు మారిపోయాయి. సెల్ఫోన్లోనే సమయంతోపాటు తేదీ నెల, సంవత్సరం చూపిస్తున్నందున ప్రజలు గడియారానికి ప్రత్యామ్నాయంగా మొబైల్ ఫోన్‌ను ఎంచుకుంటున్నారు. ఒకప్పుడు ప్రతి వీధిలో గడియారాల షాపు ఉండేది. రంగురంగుల డిజైన్లతో షాపు నిండా గోడ గడియారాలు, చేతి గడియారాలు, టేబుల్ గడియారాలు ఉండేవి. గడియారాల విక్రయాలు, రిపేర్లతో ఎంతోమంది ఉపాధి పొందేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయాయి. గడియారం దుకాణాలు గిరాకీ లేక మూతపడ్డాయి. దీంతో దుకాణదారులకు ఉపాధి కరువైంది. మూతపడుతున్న దుకాణాలు సెల్‌ఫోన్ దెబ్బకు గడియారంతోపాటు ఇతర ఉపకరణాలు సైతం కనుమరుగవుతున్నాయి. రంగుల లోకాలను ఒక్క క్లిక్‌తో ఫొటో ఫ్రేమ్‌లో బంధించే కెమెరా, మనసుకు హాయినిచ్చే పాటలు వినిపించే టేప్‌రికార్డర్, రేడియో, చీకట్లో దారిచూపే టార్చిలైట్, ఎంతటి లెక్కనైనా క్షణాల్లో చేసే క్యాలకులేటర్.. ఇలా ఎన్నో ఉపకరణాలను సెల్‌ఫోన్ మింగేసింది. మొబైల్లోనే ఫొటోలు దిగడం ఎవరికి పంపాలనుకుంటే వారికి క్షణాల్లో పంపుతున్నందున పనిలేక ఫోటో స్టూడియోలు మూతపడుతున్నాయి. కెమెరాకు క్రేజీ తగ్గడంతో ఎంతోమంది ఫొటోగ్రాఫర్లు జీవనోపాధిని కోల్పోయారు. -
టైటాన్ అతిపెద్ద వాచ్ స్టోర్ హైదరాబాద్‌లో..
• 2017లో 200 కొత్త మోడళ్లు • కంపెనీ సీఈవో రవికాంత్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : వాచీల తయారీ దిగ్గజం టైటాన్ కంపెనీ అతి పెద్ద ఔట్లెట్ హైదరాబాద్‌లో బుధవారం ప్రారంభమైంది. ఇక్కడి జూబ్లీహిల్స్‌లో 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో పునరుద్ధరించిన ఈకేంద్రంలో వరల్డ్ ఆఫ్ టైటాన్, హీలియోస్ స్టోర్లను నెలకొల్పారు. టైటాన్‌కు చెందిన ఫాస్ట్‌ట్రాక్, సొనాటా, జూప్, స్కిన్‌తోపాటు రేమండ్ వీల్, మొవాడో, గెస్, ఎంపోరియో అర్మాణీ, ఫాసిల్ వంటి 25 ప్రముఖ విదేశీ బ్రాండ్లుసైతం కొలువుదీరాయి. ఈ ఔట్లెట్లో ఎండ్ ఆఫ్ సీజన్ సేల్‌లో భాగంగా వాచీలపై 40 శాతం దాకా డిస్కౌంట్ ఇస్తున్నట్టు టైటాన్ కంపెనీ వాచెస్, యాక్సెసరీస్ సీఈవో ఎస్.రవికాంత్ తెలిపారు. స్టోర్‌ను ప్రారంభించినఅనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మోడళ్ల ధర రూ.1.8 లక్షల దాకా ఉందని వివరించారు. వచ్చే ఏడాదీ 200 మోడళ్లు.. ఇటీవల ప్రవేశపెట్టిన సొనాటా యాక్ట్ సేఫ్టీ వాచ్‌కు మహిళల నుంచి మంచి స్పందన ఉందని రవికాంత్ వెల్లడించారు. మొత్తంగా టైటాన్ ప్రస్తుత సంవత్సరంలో 200 మోడళ్లను ప్రవేశపెట్టింది. 2017లోనూ అదే స్థాయిలోమోడళ్లను పరిచయం చేస్తామని వెల్లడించారు. ఏటా 1.4 కోట్ల యూనిట్ల వాచీలను విక్రయిస్తున్నట్టు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. వీటిలో అంతర్జాతీయ బ్రాండ్ల వాటా 10 శాతం దాకా ఉందన్నారు. స్మార్ట్ వాచీలవిభాగంలో మరిన్ని మోడళ్లను తేనున్నట్టు తెలిపారు. రూ.10 వేలలోపు ధరలో స్మార్ట్ వాచీలు ఆరు నెలల్లో వచ్చే అవకాశం ఉందని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నవంబర్‌లో 6–7 శాతం అమ్మకాలుతగ్గాయన్నారు. 50 శాతమున్న కార్డు చెల్లింపులు 75%కి చేరాయని తెలిపారు.