breaking news
warangal elections
-
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం
-
ప్రజలను అన్ని విధాలుగా YSR ఆదుకున్నారు
-
‘స్వతంత్ర’మైతే మద్దతివ్వం
గాలి వినోద్ అభ్యర్థిత్వంపై ఆర్ఎస్పీ, ఫార్వర్డ్‌బ్లాక్ సాక్షి, హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ ఉపఎన్నికల్లో వామపక్షాల తరఫున కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ నిలిస్తే తాము మద్దతు ఇచ్చేది లేదని రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ(ఆర్ఎస్ పీ), ఫార్వర్డ్ బ్లాక్ ప్రకటించాయి. వామపక్షాల్లో ఏదో ఒక పార్టీ ఎన్నికల చిహ్నంపై పోటీ చేస్తేనే మద్దతు ఇస్తామని, లేకపోతే ఆయన అభ్యర్థిత్వాన్ని బలపర్చబోమని ఆర్ఎస్పీ నేత జానకిరాములు, ఫార్వర్డ్‌బ్లాక్ నేత బండ సురేందర్‌రెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. సోమవారం వినోద్ నామినేషన్ కార్యక్రమానికి చాడ వెంకటరెడ్డి(సీపీఐ), తమ్మినేని వీరభద్రం(సీపీఎం), స్థానిక ఎంపీసీఐ నాయకుడు మినహా మిగతా ఏడు పార్టీల నాయకులు హాజరుకాలేదు. ఈ ఎన్నికల్లో గాలి వినోద్‌ను బలపరిచే విషయంపై ఏ నిర్ణయం తీసుకోలేదని ఇదివరకే న్యూడెమోక్రసీ-రాయల, చంద్రన్నవర్గాలు, సీపీఐ(ఎంఎల్) ప్రకటించాయి. ఈ పార్టీల నేతలతో పాటు ఆర్ఎస్పీ, ఫార్వర్డ్‌బ్లాక్, ఎస్‌యూసీఐ, లిబరేషన్ పార్టీల నాయకులు నామినేషన్ల దాఖలుకు హాజ రుకాలేదు. వామపక్షాల అభ్యర్థి పో టీలో లేకపోతే ఎవరికి మద్దతివ్వాలనే నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ తమకు ఉంటుం దని ఈ పార్టీల నాయకులు అంటున్నారు. వామపక్షాలు బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి వరంగల్ ఉపఎన్నికల్లో గాలి వినోద్‌కుమార్ వామపక్షాలు బలపరిచిన స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు. వివిధ వామపక్షాలతోపాటు తెలంగాణ ఉద్యమ వేదిక, వివిధ సామాజిక సంఘాలు వినోద్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నాయన్నారు. నామినేషన్ కార్యక్రమానికి వామపక్షాల నాయకులందరినీ ఆహ్వానించలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయా వామపక్షాల నాయకులు పాల్గొంటారన్నారు. -
ఉప ఎన్నిక ప్రభుత్వానికి హెచ్చరిక
కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. వరంగల్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ ప్రభుత్వానికి హెచ్చరిక అన్నారు. ఆయనిక్కడ మంగళవారం మాట్లాడుతూ రుణమాఫీ సహా ఏ ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన ధ్వజమెత్తారు. కార్మికుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. నిత్యావసర సరుకుల కృత్రిమ కొరత సృష్టించేవారిని జైలులో పెట్టాలన్నారు. వరంగల్ ఉప ఎన్నికల వామపక్షాల అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్న గాలి వినోద్ కుమార్ నవంబర్ 2వ తేదీన నామినేషన్ దాఖలు చేస్తారని వెల్లడించారు. -
'ప్రజలను మభ్యపెట్టేందుకే..'
నర్సంపేట: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి త్వరలో జరిగే ఉప ఎన్నికల్లో వామపక్షాల అభ్యర్థిగా ప్రజా గాయకుడు గద్దర్ పేరును ప్రతిపాదించనున్నట్లు సీసీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. శుక్రవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ వర్క్‌షాపులో ఆయన ప్రసంగించారు. అభ్యర్థిత్వంపై గద్దర్ నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల వాగ్దానాల అమలుపై ప్రజలను మభ్యపెట్టేందుకు సీఎం కేసీఆర్ తాజాగా జిల్లాల ఏర్పాటును తెరపైకి తెచ్చారని ఈ సందర్భంగా తమ్మినేని ఆరోపించారు.