breaking news
Wang Sicong
-
పెంపుడు కుక్కకు ఎనిమిది ఐఫోన్ 7ఎస్‌లు
బీజింగ్: ఐఫోన్ గిఫ్ట్ గా వస్తుందనగానే అబ్బ.. అని గబుక్కున మనసులో ఓ ఆశ పుడుతుంది. అలాంటిది ఏకంగా ఎనిమిది ఐఫోన్లు గిప్ట్గా వస్తున్నాయంటే ఇంకెలా ఉంటుంది. ఎగిరి గంతేయరు.. సాధారణంగా మనుషులైతే ఇలాగే చేస్తారు.. కానీ ఆ ఫోన్లు గిఫ్ట్‌గా వచ్చింది ఓ పెంపుడు కుక్కకు. అది కూడా కొత్త వెర్షన్ ఐఫోన్లు. ఈ మధ్య ఆపిల్ సంస్థ విడుదల చేసిన ఐఫోన్ 7ఎస్ ఫోన్లు. వాటిని దర్జాగా తన ముందు పెట్టుకొని హుందాగా సోఫాలో కూర్చుని తన యజమానికి తానంటే ఎంతిష్టమో ఓ స్టిల్ తో చెప్పేసింది ఆ కుక్క. ఇది చేసింది చైనాలోని అత్యంత ధనవంతుడైన వాంగ్ జియాన్లిన్ అనే వ్యక్తి కుమారుడు. వాంగ్ జియాన్ లిన్(61) అనే వ్యక్తి చైనాలో అతిపెద్ద కుభేరుడు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం అతడికి 30 బిలియన్ డాలర్ల ఆస్తితో చైనాలో మిక్కిలి ధనవంతుడిగా ఉన్నాడు. అతడికి వాంగ్ సికాంగ్ అనే కుమారుడు ఉన్నాడు. ఆ తండ్రికి ఇతనొక్కడే కొడుకు. అతడిని ఎంత గారభంగా పెంచాడో ఈ కుర్రాడికి ఉన్న 'కోకో' అనే పెంపుడు కుక్క ఉంది. దానికోసం అతడు చేసే హంగామా అంతా ఇంత కాదు. దాని పుట్టిన రోజు వచ్చినా మరేదైనా సందర్భం వచ్చినా కనీసం మనుషులకు కూడా చేయనంత గొప్పగా ఆ కార్యక్రమం నిర్వహిస్తాడు. కోకోకు ప్రత్యేక డ్రెస్, ప్రత్యేక షూ, కళ్లజోడు, టోపీ, హ్యాండ్ బ్యాగ్, గోల్డ్ చైన్, ప్రత్యేక ఫుడ్ ఇలా చెప్పుకుంటూ వెళితే ఓ చాంతాడంత లిస్టే ఉంది. ఇంత రాజభోగాలు అనుభవిస్తున్న ఆ కుక్కకు ఈ మధ్యే ఆపిల్ విడుదల చేసిన ఎనిమిది ఐఫోన్ 7ఎస్‌లు గిఫ్ట్ గా ఇచ్చి ఆ ఫొటోలను ఆన్ లైన్ లో పెట్టగా అదిప్పుడు పెద్ద వైరల్ గా మారి ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. అంతేకాదు ఈ కుక్కకు రెండు ఆపిల్ వాచ్‌లు కూడా ఉన్నాయి. దీని బాధ్యతలు చూసుకునేందుకు సిబ్బంది కూడా ఉన్నారట. ఓ అంఛనా ప్రకారం ప్రపంచంలోనే అత్యంత విలువైన సేవలతో రాజభోగాలు అనుభవిస్తున్న పెంపుడు కుక్క ఇదేనని తెలుస్తోంది. -
కుక్కకు బంగారపు యాపిల్ వాచీలు
బీజింగ్: వెర్రి వెయ్యి విధాలు అంటే ఇదే కాబోలు. తన పెంపుడు కుక్కకు లక్షలాది రూపాయల విలువ చేసే బంగారం వాచీలు అలంకరించి మురిసిపోయాడో సిరిపుత్రుడు. అక్కడితో ఆగకుండా సువర్ణపు వాచీలతో అలంకరించిన తన శునకం ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. చైనా సంపన్న వ్యాపారవేత్త వాంగ్ జియన్ లిన్ కుమారుడు వాంగ్ సికాంగ్ తన కుక్క కోసం సుమారు రూ. 25 లక్షల విలువచేసే రెండు బంగారపు యాపిల్ వాచీలు కొన్నాడు. వాటిని తన బుజ్జి కుక్క ముందు కాళ్లకు అలంకరించాడు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. 'నాకున్న నాలుగు కాళ్లకు నాలుగు వాచీలు పెట్టాలనుకున్నా. ప్రస్తుతానికి రెండు వాచీలతో సరిపెట్టుకున్నా. ఇవీ రెండూ నా స్టేటస్ కు తగ్గట్టే ఉన్నాయి' అని కుక్క తరపున చైనా ట్విటర్ వీబొలో కామెంట్స్ కూడా పోస్ట్ చేశాడు వాంగ్ సికాంగ్. అతడి పిచ్చిపై నెటిజన్లు ఘాటుగా స్పందించారు.