breaking news
Voluntary death
-
రాజ్యాంగ హక్కులే మూలాధారం
పట్నా: ప్రజాస్వామ్య, స్వేచ్ఛాయుత సమాజానికి రాజ్యాంగం రక్షణ కల్పించిన హక్కులే మూలాధారమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా తెలిపారు. ప్రజలకు స్వేచ్ఛగా బతికే హక్కు ఉన్నప్పుడు చనిపోయే హక్కు కూడా ఉంటుందని వెల్లడించారు. పట్నాలోని భారతి విశ్వవిద్యాలయంలో జరిగిన డా.పతంగ్‌రావు కదమ్ స్మారకోపన్యాసంలో జస్టిస్ మిశ్రా ప్రసంగించారు. పాక్షిక యూథనేషియా(స్వచ్ఛంద మరణం)కు గతంలో సుప్రీం అనుమతి ఇవ్వడంపై స్పందిస్తూ..‘ఇది ఇబ్బందికరమైన పరిస్థితే. కానీ బతికే హక్కున్న ప్రతి పౌరుడికి చనిపోయే హక్కు కూడా ఉంటుంది. దీని ఆధారంగానే తీర్పు ఇచ్చాం’ అని వెల్లడించారు. -
స్వచ్ఛంద మరణానికి సహకరించండి: టుటు
కేప్‌టౌన్: నోబెల్ శాంతి బహుమతి విజేత, దక్షిణాఫ్రికా విశ్రాంత క్రైస్తవ బోధకుడు డెస్మండ్ టుటు తన స్వచ్ఛంద మరణానికి సహకరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆయన శుక్రవారం తన 85వ జన్మదిన్నాని జరుపుకున్నారు. ‘నాకు రోజులు దగ్గరపడుతున్నాయి. చివరి రోజుల్లో జీవచ్ఛవంలా ఉండడం నాకిష్టం లేదు. వైద్యుల సాయంతో చనిపోవడానికి నాకు అనుమతి కావాలి’ అని వాషింగ్టన్ పోస్ట్‌కు రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో వైద్యుల సాయంతో చనిపోవడం నిషిద్ధం. -
ఇక కారుణ్య మరణాలకు ఓకే
దేశంలో కారుణ్య మరణాలను అనుమతించాలా, వద్దా అన్న అంశంపై కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న చర్చకు త్వరలోనే తెరపడనుంది. కారుణ్య మరణాలను (ఎథనేషియా) అనుమతిస్తూ ముసాయిదా బిల్లును కేంద్ర ఆరోగ్య శాఖ రూపొందించింది. దీనిపై ముందుగా ప్రజాభిప్రాయం కోరతామని, వారినుంచి వచ్చే సూచనలు పరిగణలోకి తీసుకొని సమగ్ర చట్టాన్ని తీసుకొస్తామని 'జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్' డైరెక్టర్ డాక్టర్ జగదీష్ ప్రసాద్ మీడియాకు తెలిపారు. కారుణ్య మరణాలను అనుమతించేందుకు 'ప్రొటెక్షన్ ఆఫ్ పేషంట్స్ అండ్ మెడికల్ ప్రాక్టీషనర్స్' చట్టంలో సవరణలు తీసుకురావాలి. చట్టం తీసుకొస్తే భారత వైద్యమండలి (ఎంసీఐ) కీలక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. మెడికల్ ప్రాక్టీషనర్లకు సరైన మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంటుంది. కారుణ్య మరణాలను అమలు చేసేందుకు యాక్టివ్ ఎథనేషియా, పాసివ్ ఎథనేషియా అనే రెండు పద్ధతులు ఉంటాయి. ప్రాణాంతక జబ్బుతో బాధపడుతూ ఇక ఎంతమాత్రం బతకరని తెలిసిన రోగుల విషయంలో కొన్ని దేశాలు యాక్టివ్ ఎథనేషియాను, మరికొన్ని దేశాలు పాసివ్ ఎథనేషియాను అమలు చేస్తున్నాయి. యాక్టివ్ ఎథనేషియా అంటే ప్రాణాలు తీసే ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మృత్యువును ప్రసాదించడం. పాసివ్ ఎథనేషియా అంటే చికిత్సను ఆపేసి లైఫై సపోర్ట్ వ్యవస్థను తొలగించి రోగి తనంతట తానే చనిపోయేలా చేయడం. యాక్టివ్ ఎథనేషియాను దుర్వినియోగం చేసే అవకాశం ఉండడంతో పాసివ్ ఎథనేషియాకే కేంద్రం మొగ్గు చూపిందని డాక్టర్ జగదీష్ తెలిపారు. అరుణ షాన్‌బాగ్ అనే నర్సు విషయంలో దేశంలో కారుణ్య మరణాలను అనుమతించాలంటూ తీవ్రస్థాయిలో డిమాండ్ వచ్చింది. ఆమె రేప్ కారణంగా 42 ఏళ్లపాటు ఆస్పత్రి పడకపై జీవచ్ఛవంలా గడిపింది. ఆమె పనిచేసిన అస్పత్రి నర్సులే ఆమెను అన్నేళ్ల పాటు చూసుకున్నారు. కామన్ కాజ్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ 2005లో దాఖలు చేసిన పిటిషన్‌ను రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు విచారించినప్పుడు మరోసారి కారుణ్య మరణాలపై చర్చ జరిగింది. ఈ పిటిషన్ విషయంలో అభిప్రాయాలు తెలియజేయాలంటూ కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు కోరింది. అప్పుడు కేంద్రం కారుణ్య మరణాలను అనుమతించేందుకు నిరాకరించింది. కారుణ్య మరణాలను అనుమతించాలంటూ లా కమిషన్ చేసిన సిఫార్సులను కూడా కేంద్రం తిరస్కరించింది. ఇప్పుడు అదే లా కమిషన్ మళ్లీ చేసిన సిఫార్సును ఇప్పటి బీజేపీ ప్రభుత్వం ఆమోదించింది. -
స్వచ్ఛంద మరణానికి అనుమతి ఇవ్వాలని ధర్నా
నెల్లూరు(పొగతోట) : ప్రభుత్వ జీఓలకు, కోర్టు వారి ఆదేశాలకు వ్యతిరేకంగా అనుమతులు మంజూరు చేసి, మనసిక క్షోభకు గురి చేసిన తనకు స్వచ్ఛంద మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతు విడవలూరు మండలం ఊటుకూరుకు చెందిన కలిచేటి వెంకారెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట అందోళన చేశారు. ఆయన మాట్లాడుతూ 13 ఏళ్లుగా నా భూమిని నన్ను సాగు చేసుకోనివ్వకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని తెలిపారు. అనేక ప్రయత్నాలు చేసిన ఫలితం లేదని తెలిపారు. స్వచ్ఛంద మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ధర్నా అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.