breaking news
Vizaag
-
క్రెడిట్ చౌర్యం.. క్యాబినెట్ సాక్షిగా బట్టబయలు!
సాక్షి, అమరావతి: విశాఖకు గూగుల్ రాక వెనుక నిజాలను తొక్కిపెట్టి సంకుచిత బుద్ధితో చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించిన వైనం తాజాగా మంత్రివర్గ సమావేశం సాక్షిగా మరోసారి బట్టబయలైంది! విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు రాంబిల్లి, అనకాపల్లి పరిధిలో అడవివరం, తర్లువాడ గ్రామాలలో 480 ఎకరాలను గూగుల్‌తో డేటా సెంటర్లకు సంబంధించి వ్యాపార అనుబంధం ఉన్న అదానీకి కేటాయించేందుకు శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడమే దీనికి నిదర్శనం. అదానీ గ్రూపు సంస్థలు అదానీ ఇన్ఫ్రా, అదానీ కోనెక్స్, అదానీ పవర్ లిమిటెడ్ తదితర సంస్థలను గూగుల్ నోటిఫైడ్ పార్టనర్స్‌గా గుర్తిస్తూ మంత్రివర్గం ఆమోదించడం గమనార్హం. విశాఖలో అదానీ సంస్థ డేటా సెంటర్ నిర్మిస్తుందని.. అందుకోసం భూమి అప్పగించాలంటూ గత అక్టోబర్ 4న రాష్ట ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్‌కు గూగుల్ ప్రతినిధి అలెగ్జాండర్ లేఖ రాయడం గమనార్హం.జగన్ హయాంలోనే డేటా సెంటర్‌కు శంకుస్థాపనవిశాఖ నగరాన్ని అంతర్జాతీయ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ హయాంలోనే 2020 నవంబర్‌లో (కోవిడ్ సమయంలో) అదానీ డేటా సెంటర్‌కు బీజం పడటం.. ఆ తర్వాత 2023 మే 3న అదానీ డేటా సెంటర్‌కి శంకుస్థాపన జరగడం తెలిసిందే. అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు గత ప్రభుత్వంలోనే ప్రక్రియ మొదలైంది. ఇందుకోసం సింగపూర్ నుంచి 3,900 కి.మీ. మేర సముద్రంలో కేబుల్ ఏర్పాటు ప్రక్రియకు నాడే శ్రీకారం చుట్టారు. ఈమేరకు సింగపూర్ ప్రభుత్వానికి వైఎస్సార్ సీపీ హయాంలోనే 2021 మార్చి 9న లేఖ రాయడం గమనార్హం. విశాఖలో అదానీ డేటా సెంటర్‌కు 190 ఎకరాలు కేటాయించి 2023 మే 3న శంకుస్థాపన చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వమే. దాని కొనసాగింపులో భాగంగానే ఇప్పుడు 1,000 మెగావాట్లకు డేటా సెంటర్‌ను విస్తరిస్తున్నారు. ఇందులో వైఎస్సార్సీపీ ప్రభుత్వం, సింగపూర్, కేంద్ర ప్రభుత్వం, అదానీ కృషి ఎంతో ఉన్నట్లు తేటతెల్లమవుతోంది. అదానీ పేరెత్తితే వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందని బాబు సంకుచిత బుద్ధితో వ్యవహరించారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.ఉద్యోగాలు కూడా ఇచ్చేలా నాడు ఒప్పందం.. డేటా సెంటర్‌కు అవసరమైన హార్డ్‌వేర్, ఇతర టెక్నాలజీని గూగుల్ సమకూరుస్తుండగా.. అదానీ గ్రూప్ దాదాపు రూ.87 వేల కోట్లు పెట్టుబడి పెట్టి దీన్ని నిర్మిస్తోంది. రాష్ట్రానికి గూగుల్‌ను తెస్తున్నందుకు అదానీకి ధన్యవాదాలు చెప్పాల్సిన చంద్రబాబు కనీసం క్రెడిట్ ఇవ్వలేదు. ఆ పేరు చెబితే, వైఎస్సార్ సీపీ ప్రభుత్వ కృషి గురించి కూడా ప్రస్తావించాల్సి వస్తుందనే భయంతోనే నిజాలను కప్పిపుచ్చి గుట్టుగా వ్యవహరించారు. కేంద్రం, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం, అదానీ.. ఇంతమంది కృషితో గూగుల్ రాకకు మార్గం సుగమమైందని చెప్పటానికి చంద్రబాబు సంకోచించారు. కేవలం డేటా సెంటర్ ఏర్పాటు మాత్రమే కాకుండా 25 వేల ఉద్యోగాలు కల్పించాలని ఆ రోజు అదానీతో చేసుకున్న ఒప్పందంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కోరడం గమనార్హం. తద్వారా ఐటీ పార్క్, స్కిల్ సెంటర్, రిక్రియేషన్ సెంటర్ల ద్వారా యువతకు ఉద్యోగాలు కల్పించేలా ఒప్పందంలో పొందుపరిచింది. -
అలాంటి వాళ్లు నాకు చిన్నపిల్లల్లా కనిపిస్తారు: దేవీశ్రీ ప్రసాద్
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అందరి జీవితాల్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయని.. కానీ నా లైఫ్‌లో కేవలం అప్స్ మాత్రమే ఉంటాయన్నారు. నాకు ఎవరైనా చెడు చేస్తే వారు చిన్న పిల్లలుగా కనిపిస్తారని అన్నారు. దేవుడిపై భారం వేసి జీవితంలో సక్సెస్ అవుతుంటానని వెల్లడించారు. గచ్చిబౌలి స్టేడియంలో స్టేజ్ ఏర్పాటు చేశామని.. ర్యాంప్ కూడా వేశామని తెలిపారు. నా ప్రతి షో ఇలాగే ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పుడు జరగబోయే స్పోర్ట్స్ స్టేడియం కూడా అద్భుతంగా ఉందని దేవీశ్రీ ప్రసాద్ అన్నారు.ఇటీవల కర్ణాటక లో చేసిన షో సక్సెస్ అయిందని దేవీశ్రీ ప్రసాద్ తెలిపారు. నా మ్యూజికల్ షోకు చాలామంది అతిరథ మహారథులు చెప్పారు. రంగ స్థలం, సరిలేరు నీకెవ్వరు వంటి పలు సినిమాలు విశాఖలో చేశామని గుర్తు చేశారు. అందరు నాపై చూపించే ప్రేమనే నాకు ఎనర్జీ అని అన్నారు. పలు విదేశాల్లో తాను షోలు చేశానని డీఎస్పీ వెల్లడించారు. ఇటీవల మ్యూజికల్ నైట్‌కు వైజాగ్ పోలీసులు అనుమతి నిరాకరించడంతో దేవీశ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.వైజాగ్‌లో అనుమతి నిరాకరణటాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ వైజాగ్‌లో నిర్వహించబోయే మ్యూజికల్ నైట్‌కు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. నాలుగు సార్లు ప్రయత్నించినా విశాఖ పోలీసులు అనుమతులు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. ఏప్రిల్ 19న విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్లో మ్యూజికల్ నైట్ నిర్వహించేందుకు డీఎస్పీ (Devi Sri Prasad) సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ లైవ్ షో కోసం ఆన్లైన్లో భారీగా టికెట్లు విక్రయించారు. కానీ భద్రతా కారణాల రీత్యా అనుమతి ఇవ్వలేమని సీపీ శంఖబ్రత బాగ్చీ తేల్చి చెప్పారు. కొద్ది రోజుల క్రితం ఆక్వా వరల్డ్‌లో జరిగిన దుర్ఘటన నేపథ్యంలోనే అనుమతులకు నిరాకరించారు. -
స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలను అవమానించిన జనసేన నేత బొలిశెట్టి
-
ఏపీ లో రైల్వే శాఖ హెల్ప్ డెస్క్ ఏర్పాటు
-
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసీల్దారు, డ్రైవర్ : విశాఖ
-
ఛార్మి ప్రయాణిస్తున్న విమానానికి ప్రమాదం!
వైజాగ్: ఇండిగో ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్న టాలీవుడ్ నటి ఛార్మి భయానక పరిస్థితిని ఎదుర్కొంది. ఆకస్మాత్తుగా 100 అడుగుల విమానం జారి పోవడంతో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని అనుకున్నానని ఛార్మి సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ లో ఓ మెసేజ్ ను పోస్ట్ చేసింది. ఈ ఘటన వైజాగ్ లో జరిగిందని ఛార్మి వెల్లడించింది. ఒక్కసారి ఫ్లైట్ కిందకు జారిపోయింది. దాదాపు నా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని అనుకున్నాను. కాని దేవుడు బ్రతికించాడు. నేను ఇంకా బ్రతికి ఉన్నానని నమ్మడం లేదు. భూమి నడుస్తుంటే ఇంకా నమ్మశక్యం కావడం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఆనందంతో జీవించాల్సిందే అని ఛార్మి ఒక్కసారిగా వేదాంతం ధోరణి ప్రదర్శించింది.


