సర్పంచు, వార్డు స్థానాలకు 18న ఎన్నికలు
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో అనివార్య కారణాల వలన ఎన్నికలు జరగని రాయదుర్గం మండలం బాగేనాయకనహళ్లి సర్పంచ్ స్థానంతో పాటు 25 మండలాల్లోని పలు వార్డు స్థానాలకు ఈ నెల 18న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ గురువారం విడుదల చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) టి.రమణ, పరిపాలనాధికారి విశ్వనాథరెడ్డి తెలిపారు.
ఎన్నికల షెడ్యూల్ ఇలా :-
3వ తేదీ నుంచి 6 వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీక రిస్తారు.
ఎన్నికలు జరిగే స్థానాల్లో వార్డుల వారీగా ఓటర్ల వివరాలను శుక్రవారం నోటిస్‌బోర్డులో అతికించాలి.
7వ తేదీన నామినేషన్ల పరిశీలన.
9వ తేదీన ఆర్డీఓలు అప్పీల్లు స్వీకరిస్తారు.
10వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరణ చేసుకోవచ్చు. మూడు గంటల అనంతరం పోటీచేసే అభ్యర్థుల వివరాలను అధికారులు వెల్లడిస్తారు. మరుసటి రోజు నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుంది.
18వ తేదీ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రా రంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. 2 గంట ల అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుం ది. సాయంత్రానికి విజేతల పేర్లు వెల్లడిస్తారు.
ఎన్నికలు జరిగే వార్డు స్థానాలు :
రాయదుర్గం మండలంలో గ్రామదట్ల 9వ వార్డు, నాగిరెడ్డిపల్లిలో 2, 4, 6 వార్డులు, వడ్రహొన్నూరులో 8వ వార్డు, అనంతపురం మండలంలో కురుగుంట 3, 7, 8 వార్డులు, బుక్కరాయసముద్రం మండలంలో బి.కొత్తపల్లి 5వవార్డు, దండువారిపల్లి 3, 8 వార్డులు, దయ్యాలకుంటపల్లిలో 9వ వార్డు, పెద్దపప్పూరు మండలంలో గార్లదిన్నె 3, 4, 8 వార్డులు, వరదాయపల్లిలో 5వ వార్డు, పెద్దవడుగూరు మండలం ముమ్మప్పగుత్తిలో 3, 4, 8 వార్డులు, పామిడి మండలంలో గజరాంపల్లి 7వార్డు, శింగనమల మండలంలో కొరివిపల్లి 3వవార్డు, తాడపత్రి మండలంలో కొండేపల్లి 3వవార్డు, ఉరవకొండ మండలంలో బూదగెవి 1, 10 వార్డులు, మోపిడిలో 3వ వార్డు, వజ్రకరూరు మండలంలో చిన్న హోతూరు 4, 7 వార్డులు, కొనకొండ్లలో 12వ వార్డు, పీసీ ప్యాపిలిలో 3, 5, 8, 11 వార్డులు, పందికుంటలో 2, 3, 4, 5, 8 వార్డులు, తట్రకల్లో 1 నుంచి 10 వార్డులు, విడపనకల్లు మండలంలో ఆర్.కొట్టాల 2, 6 వార్డులు, కొట్టాలపల్లిలో 2, 7, 8 వార్డులు, యల్లనూరు మండలంలో చింతకాయమంద 4వ వార్డు, ముదిగుబ్బ మండలంలో పొడరాళ్లపల్లి 3వ వార్డు, ఎన్పీకుంటలో బలిజపల్లి 1, 3 వార్డులు, ఎదురుదొన 3, 5, 10, 12 వార్డులు, పెడబల్లిలో 8, 9 వార్డులు, వెస్ట్ నడింపల్లిలో 4, 7 వార్డులు, నల్లమాడ మండలంలో చెరుపల్లిలో 8వవార్డు, ఓడిచెరువు మండలంలో ఇనగలూరులో 1వ వార్డు, తనకల్లు మండలంలో మలిరెడ్డిపల్లి 3, 4, 5 వార్డులు, బెలుగుప్ప మండలంలో హనిమిరెడ్డిపల్లి 9వ వార్డు, బొమ్మనహాల్ మండలంలో కల్లుహొల 9వ వార్డు, బ్రహ్మసముద్రం మండలంలో వెస్ట్కోడిపల్లిలో 9వ వార్డు, ధర్మవరం మండలంలో రావులచెరువు 10వ వార్డు, గుమ్మఘట్ట మండలంలో సిరిగేదొడ్డి 10వ వార్డు, గుమ్మఘట్ట 2, 4, 6, 10 వార్డులు, కళ్యాణదుర్గం మండలంలో తిమ్మసముద్రం 3, 4, 10, 12 వార్డులు, కనగానపల్లి మండలంలో ముక్తాపురం 5, 8 వార్డులు, విడపనకల్ మండలంలో కొట్టాలపల్లి 9వ వార్డు, చిలమత్తూరు మండలంకేంద్రంలో 7వ వార్డుకు ఎన్నికలు జరగనున్నాయి.