breaking news
Vinayak Damodar Savarkar
-
నా ప్రాణాలకు ముప్పు
న్యూఢిల్లీ: హిందూ జాతీయవాది వినాయక్ దామోదర్ సావర్కార్‌పై చేసిన వ్యాఖ్యల కేసులో తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తంచేశారు. సావర్కర్ పరువుకు నష్టం వాటిల్లిందంటూ తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తి నాథురామ్ గాడ్సే కుటుంబ సభ్యుడేనని తెలియజేశారు. మహాత్మా గాంధీని హత్య చేసిన నాథురామ్ గాడ్సే బంధువు తనపై ఫిర్యాదు చేయడం చూస్తే తనకు ప్రాణాపాయం ఉన్నట్లు స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీ బుధవారం పుణే కోర్టుకు ఒక విజ్ఞాపన పత్రం సమర్పించారు. సావర్కర్‌పై గతంలో చేసిన వ్యాఖ్యలతో పాటు ఇటీవల తాను లేవనెత్తిన రాజకీయ అంశాల దృష్ట్యా తన భద్రత ప్రమాదంలో పడినట్లు భావిస్తున్నానని తెలిపారు. తనపై ఫిర్యాదు చేసిన వ్యక్తి కుటుంబం గతంలో హింసాకాండకు పాల్పడినట్లు, రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు దిగినట్లు సాక్ష్యాధారాలు ఉన్నాయని వివరించారు. ఆ చరిత్ర మళ్లీ పునరావృతం కావడానికి వీల్లేదన్నారు. మహత్మా గాంధీ హత్య లాంటిది మళ్లీ జరగకూడదని కోరుకుంటున్నట్లు స్పష్టంచేశారు. అలాగే ఓట్ల చోరీ బాగోతాన్ని బయటపెట్టినందుకు ఇద్దరు బీజేపీ నాయకుల నుంచి తనకు బెదిరింపులు వచ్చాయని రాహల్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి రవనీత్‌సింగ్ బిట్టూ, తర్వీందర్‌సింగ్ మార్వా తనను బహిరంగంగా బెదిరించారని చెప్పారు. ‘దేశంలో నెంబర్ వన్ టెర్రరిస్ట్ రాహుల్ గాంధీ’ అంటూ వారు ఆరోపణలు చేశారని తెలిపారు. తనకు తగిన భద్రత కల్పించేలా అధికారులను ఆదేశించాలని న్యాయస్థానాన్ని రాహుల్ గాంధీ కోరారు. ఉపసంహరించుకుంటాంపుణే కోర్టులో రాహుల్ గాంధీ తరఫున ఆయన లాయర్ మిలింద్ పవార్ పిటిషన్ వేసిన కొన్ని గంటల్లోనే మరో ట్విస్టు చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ ఆమోదం లేకుండానే ఈ పిటిషన్ దాఖలు చేశానని సదరు లాయర్ పేర్కొన్నారు. పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని చెప్పారు. ఇందుకోసం గురువారం విజ్ఞాపన పత్రం సమర్పిస్తానన్నారు. -
పరువు నష్టం కేసులో రాహుల్‌కు బెయిల్
పుణే: హిందుత్వ సిద్ధాంతకర్త వీడీ సావర్కర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లుగా ఆరోపణలెదుర్కొంటున్న కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి పుణే కోర్టు బెయిలిచ్చింది. కేసు విచారణలో భాగంగా శుక్రవారం రాహుల్ వర్చువల్‌గా హాజరు కావడంతో ఎంపీ/ ఎమ్మె ల్యేల ప్రత్యేక కోర్టు రూ.25 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత మోహన్ జోషి ఈ మేరకు కోర్టుకు ష్యూరిటీ ఇచ్చారు. ఫిబ్రవరి 18వ తేదీన తదుపరి విచారణ ఉంటుందని, ఈ కేసులో ప్రత్యక్షంగా రాహుల్ హాజరయ్యే అవసరం లేకుండా కోర్టు మినహాయింపు ఇచ్చిందని లాయర్ మిలింద్ చెప్పారు.ఇదీ చదవండి: కోల్డ్ కాఫీ చేసిన రాహుల్ గాంధీ, వైరల్ వీడియో -
మహోజ్వల భారతి: సముద్రంలోకి దూకి తప్పించుకున్న రోజు
వినాయక్ దామోదర్ సావర్కర్ స్వాతంత్య్ర సమరోద్యమ విప్లవకారులు. లాలా లజపతి రాయ్, బాల గంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్ వంటి రాజకీయ నాయకుల నుంచి ప్రేరణ పొందినవారు. ఉపకార వేతనంపై న్యాయవిద్యను అభ్యసించడానికి ఇంగ్లండ్ వెళ్లినప్పుడు ఆయన సహచరుడు చేసిన ఒక హత్య కేసు నుంచి తప్పించుకోడానికి ఇంగ్లండ్ నుంచి పారిస్‌కు మకాం మార్చారు. ఆ సమయంలోనే ఆయన జీవితంలో కొన్ని ముఖ్య ఘటనలు సంభవించాయి. వాటిల్లో ఒకటి 1910 జూలై 7న సావర్కర్ తను ఉన్న ఓడ నుంచి సముద్రంలోకి దూకి తప్పించుకోవడం! భారత్‌లో వైస్రాయ్‌ని చంపడానికి బాంబుదాడి జరిగింది. అందులో సావర్కర్ సోదరుడు నారాయణ్‌ను అరెస్టు చేశారు. అలాగే లండన్‌లో ఉన్న సావర్కర్‌ను వెంటనే అరెస్టు చేయాలని టెలిగ్రామ్ ఆదేశాలు వెళ్లాయి. అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. 1910 మార్చిలో ఆయన పారిస్ నుంచి ఇంగ్లండ్ రాగానే పోలీసులు అరెస్టు చేసి బ్రిక్స్టన్ జైలుకు తరలించారు. కొంత తర్జనభర్జన తరువాత ఆయనను భారతదేశంలోనే విచారించాలని భావించారు. దీనితో ఎస్ఎస్ మోరియా అన్న నౌకలో జూలై 1న ఎక్కించారు. ఏడో రోజుకు ఆ నౌక మార్సెల్స్ రాగానే సావర్కర్ సముద్రంలోంచి దూకి, తప్పించుకుని ఫ్రెంచ్ భూభాగం మీద అడుగు పెట్టారు. అయినా ఇంగ్లండ్ పోలీసులు మళ్లీ పట్టుకుని తీసుకుపోయారు. ఈ చర్యను సావర్కర్ అభిమానులు అంతర్జాతీయ కోర్టులో సవాలు చేశారు. కానీ ఆయనకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో బొంబాయి తీసుకువచ్చారు. రెండు జీవితకాలాల శిక్ష పడింది. పైగా ప్రవాసం. ఇది అప్పట్లో అంతర్జాతీయ వార్త అయింది. ఒక మనిషికి యాభై ఏళ్లు శిక్ష ఏమిటన్నది అందరి విస్మయం.