breaking news
	
		
	
  Vikramaditya Singh
- 
      
                   
                                                       డబుల్ పీజీ ప్రొఫెసర్‌తో మంత్రి రెండో పెళ్లిడబుల్ మాస్టర్ డిగ్రీ చేసిన ప్రొఫెసర్ అమ్రీన్ సెఖోన్‌ను ద్వితీయ వివాహం చేసుకున్నారు మినిస్టర్ విక్రమాదిత్య సింగ్. సెప్టెంబర్ 22న చండీగఢ్‌లో సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. విక్రమాదిత్య సింగ్ (Vikramaditya Singh) ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ ప్రజా పనులు, పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్నారు. ఆరుసార్లు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజా వీరభద్ర సింగ్ కుమారుడే ఈయన.వధువు అమ్రీన్ సెఖోన్ (Amreen Sekhon) పంజాబ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇంగ్లీష్, సైకాలజీలో డబుల్ మాస్టర్స్ డిగ్రీలతో పాటు సైకాలజీలో పీహెచ్డీ చేశారు. విక్రమాదిత్యకు పాత స్నేహితురాలైన ఆమె.. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కూడా చదువుకున్నారు. సర్దార్ జోతిందర్ సింగ్ సెఖోన్, ఓపిందర్ కౌర్ ఆమె తల్లిదండ్రులు.యువరాణితో ఫస్ట్ మ్యారేజ్విక్రమాదిత్య సింగ్ 1989, అక్టోబర్ 17న జన్మించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని బిషప్ స్కూల్లో చదువుకున్న సింగ్, 2011లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని హన్స్‌రాజ్ కళాశాల నుంచి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. 2016లో చరిత్రలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆయన మంచి క్రీడాకారుడు కూడా. జాతీయ స్థాయి ట్రాప్ షూటర్‌గా 2007లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. రాజస్థాన్‌లోని అమేత్కు చెందిన యువరాణి సుదర్శన చుండావత్‌ను (Sudarshana Chundawat) 2019లో వివాహం చేసుకున్నారు. విభేదాల కారణంగా 2024, నవంబర్‌లో వీరు విడిపోయారు.కాంగ్రెస్ పార్టీలో కీలక నేత36 ఏళ్ల విక్రమాదిత్య సింగ్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ శాసనసభలో సిమ్లా గ్రామీణ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మండీ నియోజకవర్గంలో పోటీ చేసి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) చేతిలో ఓడిపోయారు. రాజకీయాల్లో తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. చదవండి: నా రీల్స్ చూడడం తగ్గించండి సారూ.. ఢిల్లీ సీఎం ఇంట్రస్టింగ్ కామెంట్స్
- 
      
                   
                                                       రాయని డైరీ.. విక్రమాదిత్య సింగ్ (కంగన ప్రత్యర్థి)ఓటమే కాదు, కొన్నిసార్లు గెలుపు కూడా గుణపాఠాలు నేర్పుతుంది. జూన్ 1న జరిగే ‘మండీ’ లోక్ సభా స్థానం ఎన్నికల్లో ఒకవేళ నేను గెలిస్తే... ‘గెలుపు కోసం ప్రత్యర్థి గురించి తప్పుగా మాట్లాడటం ఓటమి కన్నా తక్కువేం కాదు’... అన్నదే బహుశా నేను నేర్చుకునే మొదటి గుణపాఠం అవుతుంది!రాజకీయంగా ఎన్నైనా ఉండొచ్చు. అవి రాజకీయంగానే ఉండాలి. వ్యక్తిగత స్థాయికి దిగకూడదు. దిగజార కూడదు. కంగనకు, నాకు మధ్య ఏం లేదు. ఆమె బీజేపీ, నేను కాంగ్రెస్. సినిమాల్లో ఆమె ‘క్వీన్’, సిమ్లా వాళ్లకు నేను ‘కింగ్. ఇద్దరం ఒకింట్లో పుట్టుంటే ఆమె అక్క, నేను తమ్ముడు. కానీ ప్రచారంలో ఆమెను ఎన్నిమాటలన్నాను! అన్నానా? అనవలసి వచ్చిందా? అనవలసి వచ్చినా అది అన్నట్లే!కంగనకు, నాకు మధ్య ఏం లేకుండానూ లేదు. మంచి నటిగా ఆమెను నేను అభిమానిస్తాను. కనుక నేను ఆమె అభిమానిని అన్నట్లే! మా మధ్య సినీతారకు–సినీ అభిమానికి మధ్య ఉండే అనుబంధం ఉన్నట్లే! ‘క్వీన్’ సినిమాలో చూడాలి కంగనను. ‘క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ సినిమా కాదు, ‘క్వీన్’ సినిమా. అమాయకురాలైన అమ్మాయి. ఆత్మాభిమానం కల అమ్మాయి. ప్రతికూల పరిస్థితుల్ని చేతుల్లోకి తీసుకుని రాణిలా ఏలిన అమ్మాయి. మధురం, సున్నితం, ఆహ్లాదకరం... ‘క్వీన్’ లో కంగన నటన. అందులో అనే ఏముందీ! ప్రతి చిత్రంలోనూ!రొమాంటిక్ థ్రిల్లర్ ‘గ్యాంగ్‌స్టర్’ తో మొదలు పెట్టి రాజకీయాల్లోకి వచ్చి పడ్డారు కంగన. ఇక్కడ ఆమె తొలి చిత్రం ‘మండీ’. దర్శకత్వం బీజేపీ. అందులో విలన్... ఇంకెవరు? నేనే. బీజేపీ నుంచి కంగన, కాంగ్రెస్ నుండి నేను మండీ నుంచి పోటీ పడుతున్నాం. మాటలూ పడుతున్నాం!ఎన్నెన్ని మాటలు! ఎంతెంత మాటలు! అర్థం లేనివి, అనవసరమైనవీ, అసహ్యకరమైనవి, రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేనివి! ఆమె బీఫ్ తిన్నారని అన్నాను. ఆమె దర్శించిన దేవాలయాలను శుద్ధి చేయాలని అన్నాను. తిరిగి ఆమె నన్ను ‘మహా చోర్’ అన్నారు. ‘ఛోటా పప్పు’ అన్నారు. కానీ స్త్రీ... పురుషుడిని అనడం వేరు. పురుషుడు స్త్రీని అనడం వేరు.అమ్మ స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ‘మండీ’ సిటింగ్ ఎంపీ. అమ్మ కాంగ్రెస్‌లో ఉండి కూడా... రామాలయం నిర్మించినందుకు మోదీజీని ధైర్యంగా ప్రశంసించగలిగారు! అయోధ్యలో ప్రతిష్ఠాపన కార్యక్రమానికి వెళ్లకూడదని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించిన తర్వాత కూడా మోదీని అమ్మ బహిరంగంగా అభినందించారు.అందుకు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ... ‘‘ప్రతిభాసింగ్జీ! మీరు పార్టీ నియమాలను ఉల్లంఘించారు...’’ అని అమ్మను బహిష్కరించి, ‘‘ప్రతిభాసింగ్ జీ! మీరు మా పార్టీలోకి వచ్చేయండి...’’ అని బీజేపీ అమ్మను ఆహ్వానించి, అమ్మ బీజేపీలో చేరి, ఇప్పుడు ఇదే ‘మండీ’ నుంచి నాకు పోటీగా నిలబడి ఉంటే అమ్మను కూడా కంగనను అన్నట్లే అన్నేసి మాటలు అనవలసి వచ్చేదా? మాటలు అనవలసి వస్తే అసలు అమ్మకు పోటీగా నిలబడేవాడినా?‘‘కంగనకు బుద్ధి ప్రసాదించమని ఆ శ్రీరాముడిని వేడుకుంటున్నాను’’ అని కూడా నేను కంగన గురించి అన్నాను. అందుకు కంగన – ‘‘వీరభద్రసింగ్జీ ఈరోజు జీవించి ఉంటే కనుక నా గురించి అగౌరవంగా మాట్లాడినందుకు తన కొడుకు విక్రమాదిత్యను మందలించి, ‘వెళ్లి ఆమెకు క్షమాపణ చెప్పు’ అని ఉండేవారు...’’ అన్నారు.ఆ మాట నిజమే కావచ్చు. కానీ, కొన్నిసార్లు క్షమాపణ కోరటం కూడా అభిమానాన్ని ప్రదర్శించుకోవటమే అవుతుంది. అభిమానం అన్నది గుండెల్లో ఉంటేనే మనల్ని సౌకర్యవంతంగా ఉంచుతుంది. అయినా అందరికీ అమ్మకు ఉన్నంత ధైర్యం ఉంటుందా?! రాజకీయ ప్రత్యర్థిని అభినందించేంత ధైర్యం! – మాధవ్ శింగరాజు
- 
      
                   
                                                       కంగనా ముంబైకి ముల్లె సర్దుకోవాల్సిందే: మంత్రి విక్రమాధిత్యసిమ్లా: సినీ నటి, బీజేపీ మండి అభ్యర్థిని కంగనా రనౌత్ దిగుమతి చేసుకున్న నాయకురాలని హిమాచల్ కాంగ్రెస్ మంత్రి విక్రమాధిత్య సింగ్ విమర్శలు చేశారు. ఆమెను మండి ఓటమిపాలైతే.. ముంబైకి సాగనంపే ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాసౌలీలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని విక్రమాధిత్య మాట్లాడారు.‘‘హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ నాలుగు పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధిస్తుంది. మండిలో అయితే రాష్ట్రానికి దిగిమంతి చేయబడిన కంగనా రనౌత్‌ను ముంబైకి సాగనంపడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ ఎన్నికల పోటీలో మేము ముందడుగు వేశాం. మండిలో ప్రతిరోజు రాత్రిపగలు పనిచేస్తున్నాం. హిమాచల్‌లో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని హామీ ఇవ్వగలను’’అని విక్రమాధిత్య అన్నారు.గత నెలలో కూడా విక్రమాధిత్య కంగనా రనౌత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కంగనా రనౌత్ వర్షం కాలంలో వచ్చే కప్ప లాంటి వారని ఎద్దేవా చేశారు. ‘‘ఎన్నికల ప్రచారం అనంతరం మండి నుంచి ఆమె వెళ్లిపోతుంది. కంగనా హిమాచల్ ప్రదేశ్‌కు కేవలం టూర్ కోసమే వస్తారు. కంగనా ఈ రోజు ఇక్కడ ఉంటారు.. రేపు మళ్లీ వెళ్లిపోతారు. వర్ష కాలంలో కప్ప మాదిరి కంగనా హిమాచల్‌కు వస్తూ.. వెళ్తూ ఉంటారు’’ అని విమర్శలు చేశారు. నాలుగు లోక్‌సభ స్థానాలు.. మండి, సిమ్లా, కాంగ్రా, మహీర్‌పూర్‌లలో చివరి విడత జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఫతితాలు జూన్ 4న వెలువడనున్నాయ.


