breaking news
Vice-chairman post
-
4న రెండో ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా మండల పరిషత్ రెండో ఉపాధ్యక్ష పదవులకు ఈ నెల 4వ తేదీ మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి మండలాల వారీగా ప్రత్యేక సమావేశాల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరఫున ఎంపీడీఓలు ఇప్పటికే ఎంపీటీసీలకు సమాచారం ఇచ్చారు. ఈ ప్రక్రియ శుక్రవారం సాయంత్రానికే పూర్తయిందని కమిషన్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణలో స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మండల పరిషత్‌లో రెండో ఉపాధ్యక్ష పదవిని ఏర్పాటుచేస్తూ ఇటీవలే అసెంబ్లీలో చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే. దీనికి ముందే గుంటూరు జిల్లా దుగ్గిరాల మినహా మిగిలిన 649 మండలాల్లో మండల పరిషత్ అధ్యక్ష, ఒక ఉపాధ్యక్ష పదవులతో పాటు కోఆప్టెడ్ సభ్యుని ఎన్నిక జరిగింది. ప్రభుత్వ చట్ట సవరణ నేపథ్యంలో ఈ 649 మండలాల్లో రెండో ఉపాధ్యక్ష పదవికి కూడా ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని డిసెంబరు 28న నోటిఫికేషన్ జారీచేశారు. దీంతో నాలుగో తేదీ ఉ.11 గంటలకు అన్నిచోట్లా మండల పరిషత్ ప్రతేక సమావేశాలు మొదలై, ఎంపీటీసీ సభ్యులు రెండో ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. మరోవైపు.. విశాఖ జిల్లా మాకవరం ఎంపీపీ రాజీనామాతో ఆ స్థానానికి కూడా అదే రోజున ఎన్నిక నిర్వహిస్తారు. అలాగే, చిత్తూరు జిల్లా రామకుప్పం, గుర్రంకొండలో మండలాధ్యక్ష పదవులకు, కృష్ణాజిల్లా ఆగిరిపల్లిలో మొదటి ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక జరుగుతుంది. రాజీనామా కారణంగా ఖాళీగా ఉన్న కర్నూలు జెడ్పీ చైర్మన్ ఎన్నిక కూడా మంగళవారం జరుగుతుంది. కోరం ఉంటేనే ఎన్నిక మండల పరిషత్ రెండో ఉపాధ్యక్ష ఎన్నికవిధివిధానాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. రెండో ఉపాధ్యక్ష ఎన్నిక నిమిత్తం జరిగే ప్రత్యేక సమావేశానికి కనీస కోరంగా మండల పరిషత్‌లో ఉండే మొత్తంలో ఎంపీటీసీ సభ్యుల సంఖ్యలో సగానికి పైగా సభ్యులు హాజరు తప్పనిసరని కమిషన్ స్పష్టంచేసింది. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి పరిధిలోని మండల పరిషత్ సమావేశాల్లో పాల్గొనవచ్చని, అయితే, వారికి ఎన్నికలో ఓటు హక్కు ఉండదని తెలిపింది. -
టీడీపీ నాయకుల సిగపట్లు
విజయనగరం ఫోర్ట్: జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవి కోసం టీడీపీ నాయకుల సిగపట్లు పడుతున్నారు. జిల్లాలోని రెం డు డివిజన్ల నుంచి నాయకులు తీవ్రంగా యత్నిస్తున్నారు. రాష్ట్ర మంత్రి కిమిడి మృణాళిని ఆశీస్సులతో ఒకరు ప్రయత్నించగా, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ఆశీస్సులతో ఇంకొకరు లాబీ చేస్తున్నారు. మాజీ మంత్రి శత్రుచర్ల విజ యమరాజు అండతో మరొకరు పోటీపడుతున్నారు. సా మాజిక వాదాన్ని తెరపైకి తెచ్చి మరోనేత రేసులో ఉన్నారు. ఈపోటీలో చివరికి ఎవరికి వైస్ చైర్మన్ పదవి దక్కుతుం దన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా వేపాడ జెడ్పీటీసీ సభ్యురాలు శోభస్వాతిరాణిని టీడీపీ అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. ఇక మిగిలింది. వైస్ చైర్మన్ పదవి. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న టీడీపీ నేతలు ఇప్పుడా పదవి కోసం పోటీ పడుతున్నారు. తమకు కావాలంటే, తమకు కావాలని పట్టుబడుతున్నారు. చైర్పర్సన్ పదవి విజయనగరం డివిజన్‌కు కేటాయించడం తో వైస్ చైర్మన్ పదవిని పార్వతీపురం డివిజన్‌కు కేటాయిం చాలని అక్కడి నాయకుడు డిమాండ్ చేస్తుండగా, పార్వతీ పురం డివిజన్లో ఎన్నికైన వారంతా మహిళలేనని, వైస్ చైర్మన్ పదవి కూడా మహిళలకు ఇచ్చేస్తే బాగుండదన్న వాదనను విజయనగరం డివిజన్ నాయకులు తెరపైకి తెస్తున్నారు. ఈక్రమంలో వైస్ చైర్మన్ పదవి కోసం పార్వతీ పురం జెడ్పీటీసీ సభ్యురాలు గొ ట్టాపు గౌరీశ్వరి, జియ్యమ్మవలస జెడ్పీటీసీ సభ్యురాలు డొంకాడ మంగమ్మ, గరివిడి జెడ్పీటీసీ బలగం కృష్ణమూర్తి, గజపతినగరం జెడ్పీటీసీ మక్కువ శ్రీధర్ పోటీ పడుతున్నారు. గొట్టాపు గౌరీశ్వరి భర్త వెంకటనాయుడు పార్టీలో క్రీయాశీలకంగా పని చేయడమే కాకుండా అశోక్‌కు నమ్మకస్తుడిగా ఉన్నారు. నిత్యం బంగ్లాలోనే ఉంటూ విధేయునిగా కొనసాగుతున్నారు. దీంతో తప్పకుండా తమకే పదవి దక్కుతుందని పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఇక, మాజీ మంత్రి శత్రుచర్ల విజయమరాజు అండతో జియ్యమ్మవలస జెడ్పీటీసీ డొంకాడ మంగమ్మ ఆశిస్తున్నారు. అన్నీ పోయిన తమకు ఈ రకంగా గుర్తింపు ఇవ్వాలని శత్రుచర్ల వర్గీయులు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, విజయనగరం డివిజన్‌కు వచ్చేసరికి గరివిడి జెడ్పీటీసీ సభ్యుడు బలగం కృష్ణమూర్తి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నిక కాబోతున్న శోభా స్వాతిరాణి ఈ డివిజన్‌కు చెందిన వారైనా.. ఆమె భర్త పార్వతీపురం డివిజన్ పరిధిలో వారు కావడంతో అటొకటి, ఇటొకటి కోణంలో ఆలోచించొద్దని అధినేతను కోరుతున్నారు. ఒకవేళ అక్కడివారికే ఇవ్వాలనుకుంటే రెం డు పదవులను మహిళలకు ఇచ్చేసినట్టు అవుతుందని, దీని వల్ల ఇబ్బందులొస్తాయన్న వాదనను తీసుకొస్తున్నారు. సీనియారిటీ, విధేయతను దృష్టిలో ఉంచుకుని తనకే ఇవ్వాలని కోరుతుండడంతో పాటు మంత్రి కిమిడి మృణాళిని ఆశీస్సులతో రేసులో ఉన్నారు. గజపతినగరం జెడ్పీటీసీ సభ్యుడు మక్కువ శ్రీధర్ కూడా ఈ పదవిని ఆశిస్తున్నారు. జెడ్పీటీసీగా చేసిన అనుభవం, సామాజిక వాదాన్ని ప్రస్తావనకు తెస్తూ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు ద్వారా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైస్ చైర్మన్ పదవి ఎ వరికి ఇస్తారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.