breaking news
Veterinary Polytechnic College
-
సంతగుడిపాడులో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల
రొంపిచర్ల(పల్నాడు జిల్లా): మండలంలోని సంతగుడిపాడు గ్రామంలో 10 కోట్ల రూపాయల వ్యయంతో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుమతి మంజూరు చేశారని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సంతగుడిపాడు గ్రామంలో గురువారం దేవాలయ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. నాడు నేడు రెండవ ఫేజ్‌లో భాగంగా కోటి ఐదు లక్షల రూపాయల నిధులతో 9 తరగతి గదులు నిర్మించనున్నట్లు తెలిపారు. విద్యకు ముఖ్యమంత్రి ఇస్తున్న ప్రాధాన్యతతో 320 విద్యార్థులు ఉన్న హైస్కూల్లో ఈ ఏడాది 700 మంది విద్యార్థులు చేరారన్నారు. తరగతి గదులు రానున్న వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అదనపు తరగతి గదుల నిర్మాణం పూర్తవుతుందన్నారు. అలాగే ఐదు ఎకరాల స్థలంలో 10 కోట్ల రూపాయల వ్యయంతో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రికి గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పిల్లి ఓబుల్‌రెడ్డి, ఎంపీటీసీ ఇరుగుల మాధవి, సర్పంచ్ ఉయ్యాల సీతమ్మ, మాజీ సర్పంచ్ పల్లకి అంజనారెడ్డి, కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పచ్చవ రవీంద్రబాబు, ఏలేశ్వరరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
విద్యా కేంద్రానికి బీటలు
వెళ్లిపోతున్న ప్రతిష్టాత్మక సంస్థ మామునూరు వెటర్నరీ కాలేజీని సూర్యాపేటకు తరలిస్తున్న ప్రభుత్వం పశువైద్య డిగ్రీ కాలేజీ రాక అనుమానమే.. పట్టించుకోని జిల్లా ప్రజాప్రతినిధులు వరంగల్ : రాష్ట్రంలోనే వరంగల్‌ను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కొత్త విద్యా సంస్థలు ఎన్నో వస్తున్నాయని ప్రకటిస్తోంది. కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థల రాక సంగతి ఎలా ఉన్నా... ఇప్పటికే ఉన్న ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు తరలిపోతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం వల్లే ఈ పరిస్థితి వస్తోంది. వరంగల్ నగరంలో పశుసంవర్థక విద్యకు కేంద్రంగా ఉన్న వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీ తరలిపోతోంది. మామునూరులో ఉన్న వెటర్నరీ కళాశాలను సూర్యాపేట జిల్లా కేంద్రానికి తరలించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ కాలేజీని తరలించేందుకు వెటర్నరీ యూనివర్సిటీ ఉన్నతాధికారులు బానోజీపేట, ఐనవోలు, కేససముద్రం, మద్దూర్, మల్కాపూర్, మొగుళ్ళపల్లి, నెక్కొండ, జఫర్గడ్, ఇనుగుర్తి, కొమురవెల్లి, ఒడితెల, రాయపర్తి, ఎలిశాల వంటి పీహెచ్సీలలో ప్రసవాల సంఖ్య ఐదుకు మించలేదు. అరకొర ల్యాబ్ వసతులు.. టెక్నీషియన్ల కొరత ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అరకొర ల్యాబ్ వసతులతో పాటు ల్యాట్ టెక్నీషియన్ల కొరతతో గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులకు పూర్తి స్థాయిలో సేవలందడం లేదు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మల్కాపూర్, స్టేసన్‌ఘన్‌పూర్, దామెర, శాయంపేట, సంగెం, అలంకానిపేట, కొత్తగూడ, బలుపాల, వెంకటాపూర్, రాయినిగూడెం, రొయ్యూర్, నల్లబెల్లి, సన్నాయిగూడెం. చెన్నరావుపేట, బానోజీపేట, పర్వతగిరి వంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టెక్నిషియన్ల కొరతతో గర్భిణులకు సేవలే అందడం లేదు వేధిస్తున్న వైద్య సిబ్బంది కొరత..: పలు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్య సిబ్బంది కొరత పేద ప్రజలకు తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. కొంత సిబ్బంది ఉన్నప్పటికీ వైద్యుల కొరతతో ఎలాంటి సేవలూ అందని దుస్థితి నెలకొంది. లక్షలు వెచ్చించారు.. లక్షణంగా వదిలేశారు గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలందించాలని ప్రణాళిక బద్దంగా పలు ప్రాంతాల్లో లక్షల రూపాయాలు వెచ్చింది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాలు నిర్మించారు. అయితే ఆ పీహెచ్‌సీలకు వైద్య సిబ్బందిని నియమించకపోవడంతో అవి ప్రారంభానికి సైతం నోచుకోక నిరుపయోగంగా మారాయి. జిల్లాలోని సిద్ధాపూర్, కొండపర్తి, పైడిపల్లి, తాటికొండ, ఇప్పగూడ, మల్యాల, బ్రహ్మణపల్లి, ముత్యాల, కాటపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రజాప్రతినిధులచేత ప్రారంభించబడి సంవత్సరాలు గడుస్తున్నా వాటి ద్వారా మాత్రం పేద ప్రజలకు సేవలందడం లేదు. అంతే కాకుండా ఓబుల్ కేశవాపూర్, కురవి, ఉగ్గంపల్లిలో భవన నిర్మాణాలు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి.