breaking news
The Verge
-
గుడ్ న్యూస్: ఇకపై ఫొటోలు, వీడియోల 'లీకు'ల బెడద తప్పనుంది
ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న పర్సనల్ ఫొటోలు, వీడియోలు భద్రంగా ఉంటాయా..? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. సైబర్ నేరస్తులు మాల్ వేర్ సాయంతో ఫోన్లలో ఉన్న పర్సనల్ డేటాను లీక్ చేస్తున్నారు.డార్క్ వెబ్‌లో అసాంఘిక కార్యకలపాల కోసం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక ఈ బాధ మీకు తొలగనుంది. త్వరలో ఆండ్రాయిడ్ ఫోన్ వినయోగదారులకు లీకుల బెడద తప్పనుంది. తొలుత 'గూగుల్ ఫిక్సెల్' వినియోగదారుల కోసం ఫొటో, వీడియో ఫోల్డర్‌కి లాక్ వేసే ఫీచర్ ఆప్షన్‌ను గూగుల్ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఏడాది చివరి నాటికి మిగిలిన అన్నీ స్మార్ట్ ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పెరుగుతున్న టెక్నాలజీతో పొంచి ఉన్న ప్రమాదం నుంచి గూగుల్ ఫిక్సెల్ ఫోన్ వినియోగదారుల్ని రక్షించేందుకు ఈ ఏడాది జూన్‌లో గూగుల్ లాక్ ఫీచర్‌ను విడుదల చేసింది. అయితే ఆ ఫీచర్‌ను మరింత అప్డేట్ చేసి త్వరలో విడుదల చేయనుందని టెక్ న్యూస్ వెబ్సైట్ 'ది వెర్జ్' ఓ కథనాన్ని ప్రచురించింది. ది వెర్జ్ రిపోర్ట్ ప్రకారం..గూగుల్ ఫిక్సెల్ ఫోన్ ఆండ్రాయిడ్ వెర్షన్ 6.0 యూజర్లు తమ ఫోన్లో ఉన్న ఫొటోలు, వీడియోలు సురక్షితంగా ఉండేందుకు లాక్ పెట్టుకోవచ్చు.గూగుల్ ఫోటోస్ నుంచి వచ్చే నోటిఫికేషన్ సాయంతో పాస్‌వర్డ్‌ను జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ఈ లాక్ ఫీచర్‌ను వినియోగిస్తే ప్రమాదకరమైన థర్డ్ పార్టీ యాప్స్ ఫోన్లో ఉన్న ఫొటోల్ని, వీడియోల డేటాను సేకరించ లేవు. ఆ యాప్స్‌కు చిక్కకుండా ఈ లాక్ ఫీచర్ వాటిని హైడ్ చేస్తుంది. వీటితో పాటు గుర్తు తెలియని వ్యక్తులు రహస్యంగా ఫోన్లో ఉన్న ఫొటోల్ని బ్యాకప్ తీసుకోవడానికి లేదా షేర్ చేసే అవకాశం ఉండదు. తప్పనిసరిగా పాస్‌వర్డ్‌ను వినియోగించాల్సి ఉంటుంది. గూగుల్ ఫొటోస్' నుంచి వచ్చే నోటిఫికేషన్‌తో ఫోల్డర్‌కి లాక్ చేయడం వల్ల సురక్షితంగా ఉండొచ్చని వెర్జ్ తన కథనంలో పేర్కొంది. చదవండి: గూగుల్ మ్యాప్స్: ఓ గుడ్ న్యూస్-ఓ బ్యాడ్ న్యూస్ -
కృత్రిమ గర్భసంచులొస్తున్నాయ్!
న్యూయార్క్: నెలలు తిరక్కుండానే పుట్టే పిల్లలు ఎక్కువ కాలం బతకరనేది మనకు తెల్సిందే. అలాంటి వారిని బతికించడం కోసం వైద్యులు వారిని ఇంక్యుబేటర్లలో పెట్టి కుస్తీ పట్టాల్సి వస్తుంది. అయినప్పటికీ కొన్నిసార్లు ఇంక్యుబేటర్లలో పెట్టిన పిల్లలు కూడా మత్యువాత పడతారు. ఇంక్యుబేటర్లలో నెలలు నిండని పసికందులను పెట్టి చికిత్స చేయడం కూడా ఖర్చుతో కూడిన వ్యవహారమే. ప్రపంచం మొత్తంగా పురిట్లోనే మరణిస్తున్న ఇలాంటి శిశువుల సంఖ్యలో ఒక్క భారత దేశంలోనే 35 శాతం మంది మరణిస్తున్నారు. వైద్య విజ్ఞానం ఇంతగా విస్తరించిన నేటి ఆధునిక కాలంలో కూడా ఇలాంటి పరిస్థితికి పరిష్కారం లేదా? పురిట్లోనే పుట్టిన బిడ్డ చనిపోతే భరించలేని ఆ బాధ నుంచి తల్లులను రక్షించేందుకు మార్గం లేదా? మరో మూడేళ్లలో ఈ పరిస్థితికి తప్పకుండా పరిష్కారం లభిస్తుందని వైద్యులు భావిస్తున్నారు. ఇటీవల గొర్రె పిల్లలపై నిర్వహించిన ప్రయోగం విజయవంతం అవడమే అందుకు కారణం. తల్లి గర్భంలో, అంటే ఇక్కడ గొర్రె గర్భసంచిలో ఉండే వాతావరణాన్ని కృత్రిమంగా వైద్యులు ఓ పారదర్శక బ్యాగ్‌లో సష్టించారు. ఆ బ్యాగ్‌ను బయోబ్యాగ్ అని పిలుస్తున్నారు. నిర్దిష్ట కాలానికన్నా 105 నుంచి 120 రోజుల ముందు జన్మించిన ఓ ఎనిమిది గొర్రె పిల్లలను ఈ బయోబ్యాగుల్లో పెట్టి వైద్య పరిశోధకులు అధ్యయనం చేశారు. మెల్ల మెల్లగా ఆ గొర్రె పిల్లలు కదలడం, కాళ్లు, చేతులు ఆడించడం, కళ్లు తెరవడం చేశాయి. నాలుగు వారాల అనంతరం వాటిని బ్యాగుల్లో నుంచి తీసి సాధారణ వెంటి లేటర్లలో ఉంచారు. ఆ ఎనిమిది గొర్రె పిల్లలు బతకడం విశేషం. ఈ అధ్యయనం వివరాలను ‘ది వెర్జ్’ అనే సైన్స్ పత్రికలో ప్రచురించారు. ఈ తరహాలోనే స్త్రీల గర్భంలో ఉండే వాతావరణాన్ని కత్రిమంగా సష్టించే మానవ బయోబ్యాగ్ను అభివద్ధి చేయవచ్చని వైద్యులు అభిప్రాయానికి వచ్చారు. ఈ బ్యాగులు అందుబాటులోకి రావడానికి మరో మూడేళ్లు పట్టవచ్చని వారు అంచనా వేస్తున్నారు. అలా అని స్త్రీల అవసరం లేకుండానే పిల్లలను కనవచ్చు అనుకోవడం అది సైన్స్ ఫిక్షన్ సినిమా అవుతుంది తప్ప, నిజం కాదని ఫిలడెల్ఫియా పిల్లల ఆస్పత్రిలో గర్భస్త్ర పిండాలకు చికిత్సచేసే డాక్టర్ అలెన్ ఫ్లేక్ వ్యాఖ్యానించారు. -
కత్రిమ గర్భసంచులొస్తున్నాయ్!