Vengeance
-
స్వార్థం కోసం తప్పుడు కేసులు!
సాక్షి, న్యూఢిల్లీ: దంపతుల మధ్య విభేదాలు తలెత్తినప్పుడు కేవలం ఆర్థిక లబ్ధి, భారీ సెటిల్మెంట్లు ఆశించి భర్త, అతని కుటుంబ సభ్యులపై కేసులు బనాయిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కక్ష సాధింపులో భాగంగా భర్తను దారికి తెచ్చుకునేందుకు మహిళలు గృహహింస, కట్నం వేధింపులతో పాటు ఏకంగా ‘పోక్సో’ వంటి చట్టాలను సైతం దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.మూకుమ్మడి కేసులు సరికాదుఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వైవాహిక వివాదంలో దాఖలైన 10 క్రిమినల్ కేసుల రద్దు పిటిషన్‌పై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. ‘దంపతుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నప్పుడు, భర్తపై కక్ష తీర్చుకునేందుకు క్రిమినల్ చట్టాలను వాడుకుంటున్నారు. ఎలాంటి నిర్దిష్ట ఆధారాలు లేకుండానే క్రూరత్వం, గృహహింస పేరిట అత్తమామలు, వృద్ధులైన కుటుంబ సభ్యులందరిపైనా మూకుమ్మడిగా కేసులు పెడుతు న్నారు’అని ధర్మాసనం పేర్కొంది. ఈ తరహా తప్పుడు కేసుల వల్ల కోర్టుల విలువైన సమయం వృథా కావడమే కాకుండా, న్యాయం కోసం నిరీక్షించే అసలైన బాధితులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టేలా న్యాయవాదులు తమ క్లయింట్లను ప్రోత్సహించ రాదని కూడా ధర్మాసనం హితవు పలికింది.పావులుగా పిల్లలువైవాహిక వివాదాల్లో సంతానాన్ని కూడా పావులుగా వాడుకుంటున్న ‘అతి దారుణమైన ధోరణి’గురించి కోర్టు ప్రస్తావించింది. తండ్రి తన మైనర్ కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ తల్లులు పోక్సో చట్టం కింద తప్పుడు కేసులు పెట్టిస్తున్న వైనాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఎక్కువ భరణం డిమాండ్ చేయడానికి లేదా రాజీకి రావాలని ఒత్తిడి చేయడానికి, పిల్లల ఇష్టానికి వ్యతిరేకంగా వారితోనే కన్నతండ్రిపై అబద్ధపు ఆరోపణలు చేయిస్తున్నారని ధర్మాసనం ఆవేదన చెందింది. కేవలం భార్యాభర్తల గొడవల్లోనే కాకుండా.. ఆస్తి వివాదాలు, వ్యాపార తగాదాలు, అప్పుల వ్యవహారాల్లో సైతం ఎదుటివారిని బెదిరించేందుకు పోక్సోను ఆయుధంగా వా డుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.అలహాబాద్ హైకోర్టు తీర్పు కొట్టివేతభర్త, అతడి సోదరుడు తన 14 ఏళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డారని, ఇతర కుటుంబ సభ్యులు భౌతికంగా దాడి చేశారని ఓ మహిళ నమోదు చేసిన క్రిమినల్ కేసులను ధర్మాసనం కొట్టివేసింది. తల్లి ఒత్తిడి, ఆమె నేర్పించిన మాటల మేరకే బాలిక ఈ ఆరోపణలు చేసినట్లు స్పష్టమవుతోందని ధర్మాసనం తన తీర్పులో వెల్లడించింది. ఫిర్యాదులో తల్లీకూ తుళ్ల వాంగ్మూలాలు అక్షరం పొల్లుపోకుండా ఒకేలా ఉన్నాయని, ఆరోపణలకు ఎలాంటి వైద్యపరమైన ఆధారాలు లేవని పేర్కొంది. ఇలాంటి సాధారణ, అస్పష్టమైన ఆరోపణలతో క్రిమినల్ విచారణను కొనసాగించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెడుతూ.. భర్త, అతని కుటుంబ సభ్యులపై నమోదైన పది కేసులను రద్దు చేస్తూ ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. -
'విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'
హైదరాబాద్: వైఎస్ఆర్ విద్యుత్ ఉద్యోగుల యూనియన్‌పై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే, యూనియన్ అధ్యక్షుడు కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. సోమవారం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ విద్యుత్ ఉద్యోగుల యూనియన్ సమావేశానికి 13 జిల్లాల యూనియన్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల న్యాయపరమైన కోర్కెలను నెరవేర్చలేదని అన్నారు. అలాగే వైఎస్ఆర్ విద్యుత్ ఉద్యోగుల యూనియన్‌పై ప్రభుత్వం కక్షసాధింపు ధోరణిలో వ్యవహరిస్తూ.. యూనియన్‌లోని ఉద్యోగులను ఇప్పటికీ రెగ్యులరైజ్ చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘సాక్షి’పై కక్ష సాధింపుపై 8న ప్రెస్ కౌన్సిల్ విచారణ
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి’ పత్రికపై ప్రభుత్వం సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) ఈ నెల 8వ తేదీన విచారణ చేపట్టనుంది. రాష్ట్ర రాజధాని నిర్మాణం పేరిట మం త్రులు, అధికార పార్టీ నేతలు సాగించిన భూదందాను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పత్రికలో రాసిన వార్తలకు ఆధారాలు చూపాలంటూ సంబంధిత విలేకరులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిపై జోక్యం చేసుకోవాలని కోరుతూ ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) సెక్రెటరీ జనరల్ మార్చి 22న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ)కు లేఖ రాశారు. ఈ వ్యవహారంపై వాస్తవాలను నివేదిక రూపంలో ఇవ్వాలని ప్రెస్ కౌన్సిల్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై గుంటూరు అర్బన్ ఎస్పీ స్పందించారు. జూలై 11న కౌన్సిల్‌కు లేఖ రాశారు. ఎర్రబాలెం గ్రామస్తుల ఫిర్యాదు మేరకు విలేకరులకు నోటీసులు జారీ చేశామన్నారు. సాక్షి పట్ల సర్కారు తీరుపై 8న పీసీఐ విచారణ జరపనుంది. -
సామాన్యులపై ప్రభుత్వం కక్ష సాధింపు
-
చంద్రబాబు కక్ష సాధింపు!
కడప: వైఎస్ఆర్ జిల్లాకు రావలసిన పరిశ్రమలను ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబుకు కక్షసాధింపు తగదని ఆయన హితవు పలికారు. జిల్లాలో ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదన్నారు. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ఎందుకు ఆపారో తక్షణమే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చిన పరిశ్రమలను వెనక్కి పంపుతూ జిల్లా ప్రజలపై కక్షసాధించడం మంచి పద్ధతి కాదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ** -
అసెంబ్లీ ఆవరణలో శంకర్రావు మౌనదీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తన కుటుంబ సభ్యులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ మాజీ మంత్రి డాక్టర్ పి.శంకర్రావు మంగళవారం అసెంబ్లీ ఆవరణలో గంటసేపు మౌన దీక్ష చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘సీఎం, డీజీపీలు నన్ను వేధిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతను, హైకమాండ్‌కు విధేయుడిని అయిన నన్ను రెండుసార్లు అరెస్టు చేశారు. సోమవారం నా తమ్ముడిని అకారణంగా అరెస్టు చేశారు. తాజాగా నా సోదరినీ అరెస్టు చేశారు. మేం ఏ తప్పు చేశామని ఇలా వేధిస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే తనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని, అలాగే ఎర్రచందనం కేసు విషయంలోనూ ఆ దర్యాప్తు జరిపించాలని సవాల్ విసిరారు. సీఎం తీరుతో దళిత, గిరిజన, బలహీనవర్గాలు కాంగ్రెస్‌కు దూరమయ్యాయన్నారు.


