వైఎస్ఆర్ విద్యుత్ ఉద్యోగుల యూనియన్పై ప్రభుత్వం కక్షసాధింపుకు పాల్పడుతోందని కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.
ఈ సందర్భంగా కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల న్యాయపరమైన కోర్కెలను నెరవేర్చలేదని అన్నారు. అలాగే వైఎస్ఆర్ విద్యుత్ ఉద్యోగుల యూనియన్పై ప్రభుత్వం కక్షసాధింపు ధోరణిలో వ్యవహరిస్తూ.. యూనియన్లోని ఉద్యోగులను ఇప్పటికీ రెగ్యులరైజ్ చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.