breaking news
Vedam
-
చీకటి ‘వేదం’!
43 ఏళ్ల చీకటి తర్వాత వెలుగు.. కానీ అంతలోనే కారుచీకట్లు! నిర్దోషిగా విడుదలైన ఆ అమాయకుడికి ఆ ఆనందం మిగల్లేదు. వేదనల ‘వేదం’ విషాదానికి అంతేలేదు. ఇది న్యాయమా? మానవత్వమా? అంటే సమాధానాలే లేవు. కళ్ల ముందు రెండు తరాలు గడిచిపోయాయి. కానీ ఆయన మాత్రం ఏం మారలేదు. చేయని నేరానికి నాలుగు దశాబ్దాలకు పైగా (43 ఏళ్లు) జైలు గోడల మధ్య నలిగిపోయిన సుబ్రహ్మణ్యం ‘సుబు’ వేదం (64), ఎట్టకేలకు న్యాయం గెలిచి, నిర్దోషిగా విడుదలయ్యాడు. జీవితం, స్వేచ్ఛ, కుటుంబం.. ఈ బంధాల రుచి మళ్లీ చూడబోతున్నానని ఆశపడ్డాడు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు లేదు. అమెరికా చట్టం అతన్ని మళ్లీ బందీగా మార్చింది.అప్పుడు తప్పుడు శిక్ష.. ఇప్పుడు దేశ బహిష్కరణ ముప్పు చేయని హత్య కేసులో నాలుగు దశాబ్దాలకు పైగా జైలు శిక్ష అనుభవించిన తర్వాత, సుబ్రహ్మణ్యం ‘సుబు’ వేదం ఎంతో కాలంగా ఎదురుచూసిన స్వేచ్ఛకు బదులుగా, కొత్త కష్టాలు ఎదురయ్యాయి. పెద్దగా పరిచయం లేని భారతదేశ బహిష్కరణ ముప్పు అతనికి ఏర్పడింది. తనపై ఉన్న హత్య కేసు శిక్షను రద్దు చేయడంతో, అక్టోబర్ 3న పెన్సిల్వేనియాలోని హంటింగ్డన్ స్టేట్ కరెక్షనల్ ఇన్స్టిట్యూషన్ నుండి విడుదలైన 64 ఏళ్ల సుబు వేదంను, వెంటనే అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అదుపులోకి తీసుకుంది. చేయని హత్యకు చెరసాలలో మగ్గి.. కేవలం తొమ్మిది నెలల వయసులో భారతదేశం నుండి అమెరికాకు వచి్చన వేదం, శాశ్వత ఆమెరికా నివాసి. కానీ 1980లో పెన్సిల్వేనియాలో జరిగిన 19 ఏళ్ల థామస్ కిన్సర్ కాలి్చవేత కేసులో.. దాదాపు మొత్తం వయోజన జీవితాన్ని జైలులోనే గడిపాడు. స్టేట్ కాలేజ్ సమీపంలోని సింక్‌హోల్‌లో కిన్సర్ మృతదేహం లభించింది, అతనితో చివరిగా కనిపించిన వ్యక్తి వేదం (కిన్సర్ మాజీ హైసూ్కల్ సహ విద్యారి్థ) అని పోలీసులు ఆరోపించారు. వేదం తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. అతన్ని 1983, 1988లలో రెండుసార్లు దోషిగా నిర్ధారించారు. పెరోల్ కూడా లేకుండా జీవిత ఖైదు విధించారు. శిక్ష రద్దు, ఎఫ్‌బీఐ నివేదిక ఆగస్ట్ 2025లో, ఒక సెంటర్ కౌంటీ న్యాయమూర్తి అతని శిక్షను రద్దు చేస్తూ, ప్రాసిక్యూటర్లు చట్టవిరుద్ధంగా ఒక ఎఫ్‌బీఐ నివేదికను డిఫెన్స్ న్యాయవాదుల నుండి దాచిపెట్టారని తీర్పు చెప్పారు. ఈ తీర్పు తరువాత, సెంటర్ కౌంటీ జిల్లా అటార్నీ బెర్నీ కాంటోర్నా అన్ని అభియోగాలను అధికారికంగా కొట్టివేశారు. ‘కాలం గడిచిపోవడం, కీలక సాక్షుల నష్టం, వేదం దశాబ్దాల జైలు శిక్షను కారణాలుగా’ పేర్కొన్నట్లు ‘ది ఫిలడెలి్ఫయా ఎంక్వైరర్’ వెల్లడించింది. సుదీర్ఘ అన్యాయం ‘వేదం.. పెన్సిల్వేనియా చరిత్రలో సుదీర్ఘకాలం అన్యాయంగా శిక్షకు గురైన వ్యక్తిగా, అమెరికాలో అత్యధిక కాలం శిక్ష అనుభవించిన వారిలో ఒకరిగా నిలబెట్టింది. ‘వేదం.. తన జీవితంలో అత్యంత విలువైన నాలుగు దశాబ్దాల కాలాన్ని తప్పుడు శిక్ష వల్ల కోల్పోయాడు. ఇప్పుడాయన వయసు 64. ఈ దేశంలోనే ఆయన సోదరి, మేనకోడళ్లు, మనవరాళ్లు.. కుటుంబ బంధాలు అన్నీ ఉన్నాయి. ఏ బంధుత్వం, ఏ పరిచయం లేని దేశానికి, తను ఏమాత్రం తెలియని భారత్‌కు పంపాలని నిర్ణయించడం ఏం న్యాయం?’.. అని ఆయన న్యాయవాది ఆవేదన వ్యక్తం చేశారు. చీకటిలోనూ అక్షర దీపం సుబు తన జైలు జీవితాన్ని దుఃఖంతో ముగించలేదు. ఆయన తన చుట్టూ ఉన్న చీకటిలో జ్ఞాన దీపాలను వెలిగించారు. జైలులో ఖైదీల కోసం అక్షరాస్యత తరగతులు, డిప్లొమా కార్యక్రమాలు నిర్వహించారు. మూడు డిగ్రీలు, 4.0 జీపీఏతో ఎంబీఏ కూడా పూర్తి చేసి, 150 ఏళ్ల జైలు చరిత్రలోనే అరుదైన ఖైదీగా నిలిచారు. మా పోరాటం మానవత్వం కోసమే.. సుబు మేనకోడలు జోయ్ మిల్లర్ వేదం మాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తాయి. ‘43 ఏళ్ల పాటు జైలులో బంధించి వేదం జీవితాన్ని తీసేసుకున్నారు. ఇప్పుడు, ఆయనను ప్రేమించే వారందరికీ దూరంగా, ఏమీ తెలియని ప్రపంచానికి పంపడం అనేది, ఆ అన్యాయాన్ని మరింత పెంచడమే. వేదం తల్లిదండ్రులు ఆయన్ని చూసేందుకు ఏళ్ల తరబడి జైలుకు వచ్చి కన్నుమూశారు. దయచేసి, మా కుటుంబాన్ని ఇకనైనా కలవనివ్వండి. ఈ పోరాటం చట్టం గురించి కాదు... మానవత్వం కోసం’.. అని కన్నీటిపర్యంతమయ్యారు. తప్పుడు శిక్ష పడిన ఒక వ్యక్తి స్వేచ్ఛ కోసం, కుటుంబంతో కలవడం కోసం చేస్తున్న ఈ ఆఖరి పోరాటానికి న్యాయస్థానం ఎలా స్పందిస్తుందోనని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. -
వివాదాస్పదంగా నీరా కేఫ్ వేదామృతం పేరు
-
పిలిచి సినిమాల్లోకి రమ్మన్నారు..
సాక్షి, జూపాడుబంగ్లా: ‘నేసేవాడినంటున్నావు కాస్త మంచి బట్టలు కట్టుకొని రావొచ్చు కదా అంటే ఇళ్లు కట్టేవాడికి ఇళ్లుండదు, చెప్పులు కుట్టేవాడికి చెప్పులుండవు.. మాపరిస్థితి కూడా అంతే’నంటూ వేదం సినిమాలో చెప్పిన డైలాగ్‌తో పాపులర్ అయిన రాములు పాత్రదారి వేదంనాగయ్య నిజజీవితంలో కూడా అష్టకష్టాలు అనుభవించాడు. సినిమాలో నటించే ఏడుపు సీన్ల వెనుక నిజ జీవితంలో జరిగిన ఎన్నో ఘటనలను గుర్తుకు తెచ్చుకొంటే నిజంగానే ఏడుపువస్తుందంటున్నారు. 75 ఏళ్ల వయసులో కూడా చలాకీగా సినిమాల్లో నటిస్తూ కుటుంబపోషణలో తనవంతు పాత్ర పోషిస్తున్న వేదంనాగయ్య మంగళవారం పోతులపాడులో సినిమా షూటింగ్ సందర్భంగా ‘సాక్షి’తో మాట కలిపారు. తన ఊరు, పేరు సినిమా ప్రవేశంపై ఆయన మాటల్లోనే.. ‘మాది గుంటూరు జిల్లా, నర్సరావుపేట వద్ద దేసవరంపేట. నాకున్న రెండెకరాలు సాగు చేసుకుంటూ మిగతా సమయాల్లో కూలి పనులు వెళ్తుంటి. ఊరిలో పనులు లేకపోవడంతో కుమారుడి వెంట హైదరాబాదు వెళ్లాం. ఓ రోజు హైదరాబాదులో నడుచుకుంటూ వెళ్తుంటే ప్రొడ్యూజర్ రాధాకృష్ణ గారు చూసి సినిమాలో నటిస్తావా అని అడిగారు. కొడుకును అడిగి విషయం చెబుతానన్నా. ఇంటికెళ్లి మా వాడితో చెబితే ‘నీలాంటి వాళ్లు సినిమాలో నటించేందుకు చాలా మంది ఉంటారు. నీకెవరు అవకాశం ఇస్తారు’ అన్నాడు. చివరికి ఏదోలాగా ఒప్పించి ప్రొడ్యూజర్ కార్యాలయానికి వెళ్లే పెద్ద డైలాగ్ చీటి ఇచ్చి నేర్చుకోవాలని చెప్పారు. మొత్తం కంఠస్తం పట్టి చెప్పడంతో వేదం సినిమాలో అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి నాపేరు ముందు వేదం సినిమా పేరు చేరిపోయింది. వేదం, నాగవల్లి, ఒక్కడినే, స్టూడెంట్ స్టార్, ఏమాయ చేశావే, రామయ్య వస్తావయ్యా, స్పైడర్ తదితర 25 సినిమాల్లో నటించాను. సినిమా తీసే కంపెనీని బట్టి రోజుకు రూ.3వేల నుంచి రూ.25వేల దాకా ఇస్తారు. అయినా కుటుంబాలు గడవటం కష్టంగా ఉంది. ఈ మధ్య ఆరోగ్యం బాగోలేక పోవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు. ‘మా’ అసోసియేషన్ వారు నెలకు రూ.2,500 పింఛన్ ఇస్తున్నారు. ‘తాతా మనవడు’తో మొదలెట్టా.. 1500 సినిమాల్లో నటించి, పలు నాటకాలు రచించిన జీఎస్ఆర్. మ్మూర్తి అలియాస్ కవి కూడా సాక్షితో మాట్లాడారు. ఆయన మాటల్లోనే ‘మాది విజయనగరం జిల్లా, బజ్జిపేట మండలం, గంగాడ గ్రామం. ప్రస్తుతం కుటుంబసభ్యులతో హైదరాబాదులో ఉంటున్నా. 1972 నుంచి సినిమా రంగంలో ఉన్నా. తాతా మనుమడు సినిమాతో నా సినీ రంగ ప్రస్థానం మొదలైంది. ఇప్పటి వరకు 1500 సినిమాల్లో నటించాను. 70షీల్డులు అందుకున్న నేను సొంతిల్లు మాత్రం సంపాదించుకున్నా. ఏదైనా ఇబ్బందులు ఎదురైతే ‘మా’ అసోసియేషన్ వారు సాయం చేస్తారు. ప్రస్తుతం నెలకు రూ.2,500 పింఛన్ ఇస్తున్నారు. – జీఎస్ఆర్ మూర్తి ఆలియాస్ కవి రైతుల దీనస్థితిపై సినిమా అనంతపురం జిల్లా రైతుల దీనగాథను ‘విరంజి’ పేరుతో తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్ వెంకటరాఘవన్ తెలిపారు. ఇందుకు సంబంధించి జూపాడు బంగ్లా మండలం పోతులపాడు, చాబోలు పరిసర ప్రాంతాల్లో రెండు రోజులుగా షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో మంగళవారం డైరెక్టర్, యూనిట్‌సభ్యులు మీడియాతో మాట్లాడారు. హీరో ‘çస్కంద’ మాట్లాడుతూ.. రైతులు విత్తనాల కొనుగోలు నుంచి ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు అమ్ముకునే వరకు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కుటుంబాలు గడవక భార్యల పుస్తెలు తాకట్టుపెట్టి అప్పులు తీరుస్తున్నారని, అప్పటికీ తీరక ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, ఇలాంటి రైతు దీన గాథలను సినిమాలో చూపిస్తామన్నారు. హైదరాబాదు పరిసరాల్లో 90శాతం చిత్రీకరణ పూర్తయిందన్నారు. రవివర్మ, అప్పాజీ, ప్రీతినిగమ్(నటి), వేదం నాగయ్య, కవి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారన్నారు. చాబోలుకు చెందిన ఓ వ్యక్తి కాటికాపరి పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. -
ప్రతి వాకిలీ ఓ కేన్వాస్..ప్రతి గృహిణీ ఓ చిత్రకారిణి..
నఖచిత్ర ప్రదర్శనలో సామవేదం రవి పరసకు ప్రముఖుల అభినందనలు రాజమహేంద్రవరం కల్చరల్ : ‘తెల్లవారితే భారతీయ గృహిణి తనింటి ప్రాంగణాన్ని కేన్వాస్‌గా చేసుకుని,అపురూపమైన ముగ్గులను తీర్చి దిద్దుతుంది. ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ కళాహృదయం ఉంది’ అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. బుధవారం నఖచిత్రకళాతపస్వి రవి పరస రూపొందించిన 999 నఖచిత్రాల ప్రదర్శన రివర్‌బే హోటల్ ఆహ్వానం సమావేశమందిరంలో జరిగింది. ముఖ్య అతిథిగా సామవేదం మాట్లాడుతూ యుగయుగాలుగా దివ్యత్వంతో ముడిపడిన కళలే కాలానికి ఎదురొడ్డి నిలిచాయన్నారు. భారతీయ సంగీతం, నాట్యం, చిత్రలేఖనం అన్నీ దైవత్వంతో ముడిపడినవేనన్నారు. తీసిపారేసే గోటితో కలకాలం నిలిచిపోయే చిత్రాలను సృష్టించిన రవి పరస అభినందనీయుడన్నారు. కళలు, సైన్సు, తత్త్వశాస్త్రం.. ఈ మూడూ కలిస్తేనే భారతీయ సంస్కృతి అని వివరించారు. నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎం.ముత్యాలునాయుడు మాట్లాడుతూ రవి పరస అంతర్జాతీయ ఖ్యాతిని గడించాలని ఆకాంక్షించారు. డాక్టర్ కర్రి రామారెడ్డి, డాక్టర్ అరిపిరాల నారాయణరావు తదితరులు రవి పరస కృషిని అభినందించారు. స్వాగతవచనాలు పలికిన వి.ఎస్.ఎస్.కృష్ణకుమార్ మాట్లాడుతూ నన్నయ విశ్వ విద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. రవి పరస మాట్లాడుతూ నఖచిత్రకళ అతిప్రాచీనమైనదని, ఈ కళ అంతరించిపోకూడదని అన్నారు. తాను నఖచిత్రాలను చివరి వరకూ గీస్తూనే ఉంటానని ప్రకటించారు. ముఖ్య అతిథులు రవి పరసను సత్కరించారు. -
వేద పరిరక్షణ అందరి బాధ్యత
బోట్‌క్లబ్ : వేద పరిరక్షణ అందరి బాధ్యతని ప్రముఖ అధ్యాత్మిక గురువు, సంస్కృత పండితుడు మల్లంపల్లి అమరేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. రామారావుపేట శివాలయంలో ఆదివారం వేద విజ్ఞాన ప్రతిష్టానమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేదస్మార్త పరీక్షలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వేదాలను పరిరక్షించడం ద్వారా భారతీయ సనాతన ధర్మాన్ని అందరూ కాపాడినవారవుతారన్నారు. ప్రతిష్టాన వేద విభాగ అధ్యక్షుడు పండిత రాయప్రోలు ప్రసాదశర్మ మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా క్రమం తప్పకుండా వేద స్మార్త పరీక్షలు నిర్వహిస్తూ ఆలయ పూజా విధానంలో సుశిక్షితులైన పండితులను తయారుచేసేందుకు ఎంతో కృషి చేస్తున్నామన్నారు. వేద విజ్ఞాన ప్రతిష్టానమ్ అధ్యక్షుడు, ప్రముఖ జ్యోతిషు్యడు చెరుకుపల్లి లక్ష్మీనృశింహశర్మ మాట్లాడుతూ మంత్రోచ్చరణతో అనేక మంచి కార్యక్రమాలు ప్రజలకు, సమాజానికి అందించవచ్చునని దాని కోసం స్వరభరిత మంత్ర పఠనానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతర పోటీల్లో విజేతలకు సర్టిఫికెట్లు అందజేశారు. పండితులు దువ్వూరి సర్వేశ్వర ఘనాపాటి, కపిలవాయి రామశాస్త్రి, యనమండ్ర వెంకట సూర్యనారాయణ , చింతా చలపతిశర్మ, శ్రీపాద రాజశేఖర శర్మ, కోట పంచముఖి శర్మ, మహంకాళి రాజదత్తాత్రేయ శర్మ పాల్గొన్నారు. -
క్రిష్ నిర్మాతగా తెలుగు సినిమా
సమకాలీన సమస్యలను కథావస్తువులుగా చేసుకుని సినిమాలను తెరకెక్కించే దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్). గమ్యం, వేదం, కృష్ణంవందే జగద్గురుమ్ చిత్రాలతో తెలుగు చిత్ర సీమలోని మంచి దర్శకుల్లో స్థానం సంపాదించుకున్నారాయన. ప్రస్తుతం క్రిష్ బాలీవుడ్లో ‘గబ్బర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అక్షయ్‌కుమార్ హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రం నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగు సినిమా చేయడానికి క్రిష్ సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. ఇదిలావుంటే... ఈ సినిమాకంటే ముందు నిర్మాతగా ఓ చిత్రం చేయడానికి క్రిష్ సమాయత్తమయ్యారు. ఇందుకోసం తమిళంలో విజయం సాధించిన ‘శైవం’ సినిమా హక్కులు కూడా ఆయన సొంతం చేసుకున్నారు. బుల్లితెర దర్శకుడైన మలినేని రాధాకృష్ణను ఈ సినిమా ద్వారా తెరకు పరిచయం చేస్తున్నారు క్రిష్. -
'సరోజ'ను మరచిపోలేనంటున్న అనుష్క..!
-
పుల్లయ్య ప్రేమకథ
తెలుగు, తమిళ భాషల్లో ఓ విభిన్న ప్రేమకథతో రూపొందిన చిత్రం ‘పుల్లయ్య ప్రేమకథ’. రమేష్ వర్షశ్రీ దర్శకత్వంలో సమ్రిత క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి గంగాదేవి సమర్పణలో పెయ్యల ప్రవీణ్‌కుమార్ నిర్మించారు. వచ్చే నెల మొదటి వారంలో పాటలను, అదే నెలాఖరున సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రం ఇది. ‘వేదం’ ఫేమ్ నాగయ్య నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులో ఉన్న ఐదు పాటలకు సిద్ధార్ధ్ వాటికన్స్ మంచి స్వరాలిచ్చారు’’ అని చెప్పారు. నాగరాజు, లక్ష్మీ, సింగం మహేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: మనోహర్ కొల్లి, ఎడిటింగ్: కడప శ్రీను.