breaking news
veda pandiths
-
ఆన్లైన్ దర్బార్ భక్తి!
ఆధ్యాత్మిక సందేహాలు, సంప్రదింపులు; వేద పండితుల మార్గదర్శకత్వం, పూజా సామగ్రి కొనుగోలు వంటి అవసరాల కోసం ఇంటర్నెట్ను ఆశ్రయిస్తున్న భక్త వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో ఆధ్యాత్మిక స్టార్టప్‌లకు ఆదరణ పెరిగింది. మతపరమైన ఆచార వ్యవహారాలు, వాటి పాటింపు విధానాలను ప్రామాణికంగా తెలియజెప్పేందుకు ఈ ఆధ్యాత్మిక ఆన్లైన్ వేదికలు వేద పారంగతులను నియమించుకుంటున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్గత ఏడాదితో పోలిస్తే తమ వినియోగదారుల్లో 2.5 రెట్లు, డిజిటల్ సంప్రదింపుల్లో 3 రెట్ల పెరుగుదల కనిపించిందని ఆధ్యాత్మిక ఆన్లైన్ సంస్థ ‘ఆస్ట్రోయోగి’వెల్లడించింది. సుదీర్ఘ ప్రయాణాలు, పొడవాటి క్యూలు లేని ‘డిజిటల్ యాక్సెస్’ సౌలభ్యతే ఈ పెరుగుదలకు కారణం. ప్రధానంగా యువత, ఎన్నారైలు ఈ సంస్థలను సంప్రదిస్తుండటం, పండుగ సీజన్లో అవి ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించటం కూడా వాటి అభివృద్ధికి తోడ్పడుతోంది. వేలాదిమంది పండితులు ‘ఆస్ట్రోయోగి’తన నెట్‌వర్క్‌లో.. జ్యోతిషు్కలు, టారో కార్డ్ రీడర్లు, వాస్తు నిపుణులు, ఆధ్యాత్మిక కోచ్‌లు సహా కనీసం 10,000 మంది నిపుణులతో అనుసంధానమై ఉంది. వినియోగదారులకు ఆన్లైన్లో ఆధ్యాత్మిక సేవలను ఒక్క ‘క్లిక్కు’తో అందించటానికి ఈ పండితుల అనుభవం తమకెంతగానో ఉపయోగపడుతోందని ఆస్ట్రోయోగి నిర్వాహకులు అంటున్నారు. ఆధ్యాత్మిక కౌన్సెలింగ్ మరొక సంస్థ ‘ఆస్ట్రోసేజ్ ఏఐ’కూడా భక్తి విశ్వాసాల ఆధారిత సేవల్ని నెట్ యూజర్లకు అందిస్తోంది. పండుగలు, ఇతర సమయాలలో నెటిజన్ల సందేహాలకు ఈ సంస్థ తన కౌన్సెలర్ల ద్వారా సమాధానాలు ఇప్పిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే తమను సంపద్రించేవారి సంఖ్య 300 శాతం పెరిగిందని ఆస్ట్రోసేజ్ నిర్వాహకులు చెబుతున్నారు. లక్షల్లో భక్త యూజర్లు 2025లో ప్రారంభమైన ‘ఆస్ట్రోష్యూర్ ఏఐ’కు నెలవారీ వినియోగదారులు 3 లక్షలకు పైగా ఉన్నారు. రోజువారీగా కనీసం 15 వేల మంది సంప్రదింపులు జరుపుతున్నారు. ఆస్ట్రోష్యూర్ ఏఐ యాప్ ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఓస్‌లు కలిపి 10 లక్షల డౌన్లోడ్లకు చేరుకుంది. ఒకప్పుడు లక్షా 50 వేలుగా ఉన్న యూజర్ల సంఖ్య దాదాపు 8 లక్షలకు పెరిగిందట. పూజా సామగ్రి కిట్లు వినియోగదారులు ప్రధానంగా తమ భవిష్యత్తు, అదృష్ట సంఖ్యలు, పంచాంగం, తిథులు, నక్షత్రాలు, శుభ సమయాలు, రాహు కాలాలు వంటి వాటి కోసం ‘ఆస్ట్రో’సైట్లను బ్రౌజ్ చేస్తున్నారు. ఇందుకోసం కొందరు డబ్బు చెల్లించి సబ్స్క్రిప్షన్ కూడా తీసుకుంటున్నారు. కేవలం సంప్రదింపుల కోసమే కాకుండా, ముందుగా ప్యాక్ చేసి ఉంచిన రెడీ మేడ్ పూజా సామగ్రి కిట్ కోసం యూజర్లు వీటి వైపు వస్తున్నారు. సేవలను, వస్తువులను పొందుతున్నారు. గత ఏడాది ఈ వేదికల్లో పూజా సామగ్రి కిట్లు, రత్నాల కోనుగోళ్లు 25 నుంచి 30 శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. సదా ‘ఆధ్యాత్మిక’సేవలో.. ఆస్ట్రోయోగి : ఆన్లైన్ సంప్రదింపులు, జాతకాలు, డిజిటల్ ఆధ్యాత్మిక సేవలను అందించే భారతీయ ఆన్లైన్ జ్యోతిష్య శాస్త్ర వేదిక. ఆస్ట్రోసేజ్ ఏఐ : వ్యక్తిగతంగా ఆధ్యాత్మిక సలహాలు, జాతక చక్రాలు, జ్యోతిష్యం, ఆన్లైన్ సంప్రదింపులు; పూజా విధానం, వివాహ ఆచారాలు, వివరణల వెబ్సైట్. ఆస్ట్రోటాక్ : జ్యోతిష్కులు, పండితులు, పురోహితులతో లైవ్ చాట్లు; ఫోన్ సంప్రదింపులు, జ్యోతిష్య శాస్త్ర సేవలతో అనుసంధానం. దేవ్ధామ్: వర్చువల్ ఆలయ దర్శనాలు. ఆన్లైన్ పూజలు, డిజిటల్ విరాళాల భారతీయ ఆధ్యాత్మిక సాంకేతిక వేదిక. వామా: ఇంటి నుంచే పూజలు, దర్శనాలు, మతాచారాల విషయమై సంప్రదింపులకు ఆన్లైన్ యాక్సెస్‌ను అందించే ఆధ్యాత్మిక సేవల కేంద్రం. -
సీఎం జగన్‌కు తిరుమల వేద పండితుల ఆశీర్వచనం
-
163 మంది భారత వేదవిద్యార్థుల అదృశ్యం
చికాగో: వేద పండితులుగా శిక్షణ పొందేందుకు అమెరికా వెళ్లిన సుమారు 163 మంది భారతీయ విద్యార్థులు అదృశ్యమయ్యారు. అతీంద్రియ యోగా గురు దివంగత మహర్షి మహేశ్ యోగి కుటుంబానికి చెందిన రెండు సంస్థల ద్వారా ఉత్తర భారతదేశంలోని గ్రామాల నుంచి వేదశిక్షణ కోసం దాదాపు 1,050 మందిని అమెరికాలోని అయోవాలో ఉన్న వేదిక్ సిటీకి తీసుకువెళ్లారు. గత ఏడాదిగా వారిలో 163 మంది కనిపించకుండా పోయారని ‘హాయ్ ఇండియా’ అనే స్థానిక వార పత్రిక తాజా సంచికలో వెల్లడించింది. దారుణమేంటంటే.. తప్పిపోయిన వారు ఎక్కడికెళ్లారు?, ఏ పరిస్థితుల్లో ఉన్నారు? అనే విషయాలను ఆ సంస్థలు పట్టించుకున్న పాపాన పోలేదు. వారిని ప్రశ్నిస్తే సమాధానముండదు. ఒక అధికారి మాత్రం ‘ఇమిగ్రేషన్ అవసరాల కోసమో లేక వాళ్ల అమెరికా కలలను తీర్చుకోవడం కోసమో ప్రహారీ దూకి పారిపోయారు’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. తప్పిపోయినవారిలో చాలామంది 19, 20 ఏళ్లవారే ఉన్నారు. ఆ విద్యార్థులను తీసుకెళ్లిన మహార్షి వేదిక్ సిటీ, మహార్షి యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్లపై ‘హాయ్ ఇండియా’ పరిశోధనలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెల్లడయ్యాయి. ఆ సంస్థల ఆధ్వర్యంలో నడిచే ‘గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్’ విద్యాసంస్థ వేద పండితుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 12వ తరగతి వరకు చదివిస్తామని, తర్వాత వారిని వైదిక నిపుణులుగా మారుస్తామని తల్లిదండ్రులతో చెప్పి భారత్‌లోని పేద పిల్లలను అమెరికా తీసుకువెళ్లారు. వీసాకు దరఖాస్తు చేసే ముందే పిల్లలు, వారి తల్లిదండ్రులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఆ కాంట్రాక్ట్ కాపీని వారికి ఇవ్వరు. నెలకు 50 డాలర్లను అమెరికాలోని పిల్లలకు, 150 డాలర్లను భారత్‌లోని వారి తల్లిదండ్రులకు ఇస్తామని అందులో పేర్కొంటారు. కానీ ఆ మొత్తాన్ని నెలవారీగా ఇవ్వరు. ఆ విద్యార్థి ప్రవర్తన సంతృప్తికరంగా ఉంటే.. రెండేళ్లు గడిచాక భారత్ పంపించేముందు ఇస్తామంటారు. విద్యార్థులను తాత్కాలిక గృహాల్లో దారుణ పరిస్థితుల్లో, 24 గంటల పాటు గార్డుల పహారాలో ఉంచుతున్నారు. అమెరికా నుంచి వెళ్లిపోవాలనుకునే విద్యార్థులను వేదిక్ సిటీ నుంచి ఒక వ్యాన్‌లో తీసుకుని ఏర్‌పోర్ట్‌కు వెళ్తారు. ప్రవేశద్వారం వద్ద వారిని వదిలి ‘ఇక్కడే ఉండండి. ఇప్పుడే వస్తాము. విమానం రాగానే వెళ్లిపోదురు గానీ’ అని చెప్పి డ్రైవర్ వెళ్లిపోతాడు. పారిపోవాలనే ఉద్దేశం ఉన్న విద్యార్థులు అక్కడినుంచి వెంటనే పారిపోతారు. కాసేపటికి తిరిగివచ్చిన డ్రైవర్ మిగిలిన విద్యార్థులను తీసుకుని వేదిక్ సిటీకి వస్తాడు. పాస్‌పోర్ట్‌ను తీసుకోకుండా ఎవరైనా తప్పిపోతే, లేదా వెళ్లిపోతే వెంటనే దగ్గర్లోని భారతీయ ఎంబసీలో ఆ పాస్‌పోర్ట్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే తప్పిపోయినవారు ఏ పరిస్థితుల్లో తప్పిపోయారో, లేక వెళ్లిపోయారో వివరించాల్సి ఉంటుంది. కానీ ఆ సంస్థలు ఇంతవరకూ ఎవరి పాస్‌పోర్టులను కూడా తమకివ్వలేదని, తప్పిపోయారన్న సమాచారం కూడా ఇవ్వలేదని చికాగోలోని భారతీయ దౌత్యాధికారి తెలిపారు.


